Don Bradman : క్రికెట్ చ‌రిత్ర‌లోనే ఈ బ్యాట‌ర్‌ను మించినోడు లేడు.. ఈ బ్యాట‌ర్ నెల‌కొల్పిన ఈ 8 రికార్డులు బ్రేక్ చేయ‌డం దాదాపుగా అసాధ్యం..!

క్రికెట్ చ‌రిత్ర‌లో ఎంద‌రో గొప్ప బ్యాట‌ర్లు ఉన్నారు. వారంద‌రిలో క‌న్నా ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాట్స్‌మన్ డాన్ బ్రాడ్‌మన్ (Don Bradman)ఎంతో ప్ర‌త్యేకం.

Don Bradman : క్రికెట్ చ‌రిత్ర‌లోనే ఈ బ్యాట‌ర్‌ను మించినోడు లేడు.. ఈ బ్యాట‌ర్ నెల‌కొల్పిన ఈ 8 రికార్డులు బ్రేక్ చేయ‌డం దాదాపుగా అసాధ్యం..!

Don Bradman 8 unbreakable records of cricket history

Updated On : September 3, 2025 / 4:24 PM IST

Don Bradman : క్రికెట్ చ‌రిత్ర‌లో ఎంద‌రో గొప్ప బ్యాట‌ర్లు ఉన్నారు. వారంద‌రిలో క‌న్నా ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాట్స్‌మన్ డాన్ బ్రాడ్‌మన్ (Don Bradman)ఎంతో ప్ర‌త్యేకం. ఆయ‌న త‌న టెస్టు కెరీర్‌లో 6996 ప‌రుగులు సాధించాడు. ఇందులో 29 సెంచ‌రీలు ఉన్నాయి. ఆయ‌న త‌రువాత సునీల్ గ‌వాస్క‌ర్‌, స‌చిన్ టెండూల్క‌ర్‌, రికీ పాంటింగ్‌, బ్రియాన్ లారా, రాహుల్ ద్ర‌విడ్‌, జాక్వెస్ క‌లిస్‌, జోరూట్ వంటి ఎంద‌రో దిగ్గ‌జ ఆట‌గాళ్లు వచ్చారు గానీ ఎవ్వ‌రూ కూడా ఆయ‌న సాధించిన రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్టలేక‌పోయారు.

డాన్ బ్రాడ్‌మ‌న్ కుచెందిన 8 ఎనిమిది రికార్డుల‌ను బ్రేక్ చేయ‌డం చాలా క‌ష్టం. అవి ఏంటంటే..?

టెస్ట్ కెరీర్‌లో అత్యధిక బ్యాటింగ్ సగటు..

డాన్ బ్రాడ్‌మెన్ 80 ఇన్నింగ్స్‌ల్లో 99.96 స‌గటుతో 6996 ప‌రుగులు చేశాడు. ఇప్ప‌టి వ‌ర‌కు క్రికెట్ ఆడిన వారింద‌రిలో క‌నీసం 20 టెస్టు ఇన్నింగ్స్‌లు ఆడి 2000 కంటే ఎక్కువ ప‌రుగులు చేసిన వారిలో బ్రాడ్‌మ‌న్‌దే అత్య‌ధికం. ఈ రికార్డు భ‌విష్య‌త్తులోనూ బ‌ద్ద‌లు అయ్యే అవ‌కాశం చాలా త‌క్కువే.

Bronco Test : టీమ్ఇండియా ఆట‌గాళ్ల‌కు ఊర‌ట‌..! బ్రాంకో టెస్టు లేన‌ట్లేనా?

టెస్టు మ్యాచ్‌లో ఓ రోజులో అత్య‌ధిక ప‌రుగులు..

150 సంవ‌త్స‌రాల టెస్టు క్రికెట్ చ‌రిత్ర‌లో ఒకే రోజులో ట్రిపుల్ సెంచ‌రీ చేసిన ఏకైక ఆట‌గాడు బ్రాడ్‌మ‌న్‌. 1930లో యాషెస్ మూడో టెస్టులో తొలి రోజు ఆట ముగిసే స‌మ‌యానికి 309 ప‌రుగుల‌తో అజేయంగా నిలిచాడు. ఆ మ్యాచ్‌లో వ‌న్‌డౌన్‌లో వ‌చ్చిన బ్రాడ్‌మ‌న్ ప్ర‌త్య‌ర్థి బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు.

ఒక టెస్టు సిరీస్‌లో అత్య‌ధిక ప‌రుగులు..

టెస్టు క్రికెట్ చ‌రిత్ర‌లో ఓ టెస్టు సిరీస్‌లో 900 కంటే ఎక్కువ ప‌రుగులు సాధించిన ఆట‌గాళ్లు ఇద్ద‌రే ఉన్నారు. వారిలో ఒక‌రు డాన్‌బ్రాడ్‌మ‌న్‌. 1928-29 యాషెస్ సిరీస్‌లో వాలీ హామండ్ ఆస్ట్రేలియా పై 905 ప‌రుగులు చేశాడు. ఇక బ్రాడ్‌మ‌న్ 1930లో ఆస్ట్రేలియా జ‌ట్టు ఇంగ్లాండ్‌లో ప‌ర్య‌టించిన‌ప్పుడు కేవ‌లం 7 ఇన్నింగ్స్‌ల్లో 974 ప‌రుగులు చేసి హామండ్ రికార్డును బ‌ద్ద‌లు కొట్టాడు.

కెప్టెన్‌గా టెస్టు సిరీస్‌లో అత్య‌ధిక ప‌రుగులు..

1936-37లో ఇంగ్లాండ్ జ‌ట్టు ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా.. బ్రాడ్‌మ‌న్ ఆసీస్ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించాడు. కెప్టెన్‌గా బ్రాడ్‌మ‌న్‌కు అదే తొలి సిరీస్‌. ఈ సిరీస్‌లో 9 ఇన్నింగ్స్‌ల్లో 90 స‌గ‌టుతో 810 ప‌రుగులు చేశాడు. ఇప్ప‌టి వ‌ర‌కు టెస్టు క్రికెట్ చ‌రిత్ర‌లో ఓ టెస్టు సిరీస్‌లో ఓ కెప్టెన్ సాధించిన అత్య‌ధిక ప‌రుగులు ఇవే. ఓ టెస్టు సిరీస్‌లో 800 కంటే ఎక్కువ ప‌రుగులు చేసిన ఏకైక కెప్టెన్ కూడా బ్రాడ్‌మ‌నే.

అత్య‌ధిక టెస్టు డ‌బుల్ సెంచ‌రీలు..

52 మ్యాచ్‌ల టెస్టు కెరీర్‌లో బ్రాడ్‌మ‌న్ ఆస్ట్రేలియా త‌రుపున 12 డ‌బుల్ సెంచ‌రీలు చేశాడు. బ్రాడ్‌మ‌న్ త‌రువాత టెస్టు క్రికెట్‌లో 10 కంటే ఎక్కువ డ‌బుల్ సెంచ‌రీలు చేసిన బ్యాట్‌మైన్ కుమార్ సంగ‌క్క‌ర మాత్ర‌మే. సంగ‌క్క‌ర 11 ద్విశ‌త‌కాలు బాదాడు.

Haris Rauf world Record : పాక్ 10వ నంబ‌ర్ బ్యాట‌ర్ వ‌ర‌ల్డ్ రికార్డు.. ఏమా కొట్టుడు సామీ..

ఓ జ‌ట్టుపై అత్య‌ధిక టెస్టు సెంచ‌రీలు..

త‌న కెరీర్‌లో బ్రాడ్‌మ‌న్ 52 టెస్టు మ్యాచ్‌లు ఆడ‌గా ఇందులో 37 మ్యాచ్‌లు ఇంగ్లాండ్‌తోనే ఆడాడు. ఆ స‌మ‌యంలో ఇంగ్లాండ్ పై 5028 ప‌రుగులు సాధించాడు. ఇందులో 19 శ‌త‌కాలు ఉన్నాయి. ఓ జ‌ట్టు పై టెస్టుల్లో ఓ బ్యాట‌ర్ చేసిన అత్య‌ధిక శ‌త‌కాలు ఇవే.

వ‌రుస టెస్టు మ్యాచ్‌ల్లో అత్య‌ధిక సెంచ‌రీలు..

1937 జ‌న‌వ‌రి నుంచి 1938 జూలై మ‌ధ్య బ్రాడ్‌మ‌న్ వ‌రుస‌గా 6 టెస్టుల్లో సెంచ‌రీలు చేశాడు. ఈ ఆరు మ్యాచ్‌లు కూడా అత‌డు ఇంగ్లాండ్ పైనే ఆడాడు.

ప్ర‌త్యేక రికార్డు..

బ్రాడ్‌మ‌న్ 1948లో టెస్టు క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. కానీ.. టెస్టుల్లో అత్యంత వేగంగా 2వేలు, 3వేలు, 4వేలు, 5వేలు, 6వేలు ప‌రుగులు చేసిన రికార్డు ఇప్ప‌టికి బ్రాడ్‌మ‌న్ పేరిటే ఉంది.