Bronco Test : టీమ్ఇండియా ఆటగాళ్లకు ఊరట..! బ్రాంకో టెస్టు లేనట్లేనా?
భారత ప్లేయర్లకు బ్రాంకో టెస్టు (Bronco Test) నుంచి ఊరట లభించినట్లు వార్తలు వస్తున్నాయి. ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ను తెలుసుకునేందుకు..

No Bronco Test For team india players In Bengaluru Report
Bronco Test : భారత ప్లేయర్లకు బ్రాంకో టెస్టు నుంచి ఊరట లభించినట్లు వార్తలు వస్తున్నాయి. ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ను తెలుసుకునేందుకు మొన్నటి వరకు యోయో టెస్టు ఉండగా ఇటీవల బ్రాంకో టెస్టు(Bronco Test )ను తీసుకువచ్చారు. ఆటగాళ్లు బ్రాంకో, యోయో టెస్టు రెండింటిలోనూ పాస్ కావాల్సిందేనని బీసీసీఐ వెల్లడించినట్లు ఇటీవల రిపోర్టులు వచ్చాయి. అయితే.. తాజాగా దీనిపై బీసీసీఐ కాస్త వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది.
సాధారణంగా రగ్బీ ఆటగాళ్ల ఫిట్‌నెస్ తెలుసుకునేందుకు బ్రాంకో టెస్టు వంటివి ఉపయోగిస్తారని, క్రికెటర్లకు దీన్ని అమలు చేయడం సరికాదనే విమర్శలు వచ్చాయి. అదే సమయంలో సీనియర్ ఆటగాడు, వన్డే కెప్టెన్ రోహిత్ శర్మను జట్టు నుంచి బయటకు పంపేందుకే ఈ టెస్టును తీసుకొచ్చారనే కామెంట్లు కాస్త గట్టిగానే వినిపించాయి.
US Open 2025 : తొలిసారి గ్రాండ్‌స్లామ్ క్వార్టర్స్‌కు యుకీ బాంబ్రీ..
ఈ క్రమంలోనే బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుందని నివేదికలు చెబుతున్నాయి. గతంలోలాగానే ఆటగాళ్లకు ఫిట్‌నెస్ టెస్టులను నిర్వహించాలని ఆదేశించినట్లు సమాచారం.
‘సెప్టెంబర్ 9 నుంచి ఆసియా కప్ ప్రారంభం కానుంది. ఈ మెగాటోర్నీలో పాల్గొనేందుకు భారత జట్టు నాలుగో తేదీ ఉదయం దుబాయ్‌కు బయలుదేరనుంది. ఆటగాళ్లు అందరూ అక్కడే కలుసుకుంటారు. సెప్టెంబర్ 5న ఐసీసీ అకాడమీలో మొదటి ప్రాక్టీస్ సెషన్ జరగనుంది. అప్పుడు మేనేజ్‌మెంట్, స్ట్రెంత్ అండ్ కండీషనింగ్ కోచ్ బ్రాంకో టెస్టుతోనే ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ను అంచనా వేయాలని భావిస్తే దుబాయ్‌లో దాన్ని నిర్వహించే అవకాశం ఉంది. అయితే.. ఈ టెస్టు పై ఇప్పటికే వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో దాన్ని అమలు చేయకపోవచ్చు.’ అని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
సెప్టెంబర్ 14న భారత్, పాక్ మ్యాచ్..
ఆసియా కప్‌లో భారత్ తన తొలి మ్యాచ్‌ను సెప్టెంబర్ 10న ఆతిథ్య యూఏఈతో ఆడనుంది. ఇక చిరకాల ప్రత్యర్థులు భారత్, పాక్ జట్ల మధ్య మ్యాచ్ సెప్టెంబర్ 14న జరగనుంది. లీగ్ దశలో చివరి మ్యాచ్ సెప్టెంబర్ 19న ఒమన్‌తో ఆడనుంది.