US Open 2025 : తొలిసారి గ్రాండ్‌స్లామ్ క్వార్టర్స్‌కు యుకీ బాంబ్రీ..
భారత టెన్నిస్ ఆటగాడు యుకీ బాంబ్రీ యూఎస్ ఓపెన్(US Open 2025)లో క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నాడు. కాగా.. యుకీ కెరీర్‌లో ఓ గ్రాండ్ స్లామ్..

US Open India Yuki Bhambri Makes First Ever Grand Slam Quarterfinals
US Open 2025 : భారత టెన్నిస్ ఆటగాడు యుకీ బాంబ్రీ యూఎస్ ఓపెన్(US Open 2025)లో క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నాడు. కాగా.. యుకీ కెరీర్‌లో ఓ గ్రాండ్ స్లామ్ లో క్వార్టర్స్‌కు చేరుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
డబుల్స్‌లో న్యూజిలాండ్‌కు చెందిన మైకెల్ వెనుస్‌తో కలిసి యుకీ బరిలోకి దిగాడు. వీరికి 14వ సీడ్ దక్కింది. ఈ ఇండో-న్యూజిలాండ్ జోడి ప్రీక్వార్టర్స్‌లో నాలుగో సీడ్ జోడీ కెవిన్ క్రావిట్జ్ – టిమ్ పూయిట్జ్‌పై గెలుపొందింది. గంటా 23 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో 6-4, 6-4 తేడాతో యుకీ-మైకెల్ జోడీ విజయం సాధించింది.
Yuki Bhambri 🇮🇳 through to his maiden Grand Slam QF!
Yuki & his best friend on tour Michael Venus 🇳🇿 stormed past the No. 4 seeds K Krawietz / T Puetz by 6-4 6-4 scoreline to move into the QF! pic.twitter.com/AsDHMv0zbf
— Indian Tennis Daily (ITD) (@IndTennisDaily) September 2, 2025
ఇక క్వార్టర్స్‌లో యుకీ బాంబ్రీ-మైకెల్ వెనుస్ జోడీ క్రొయేషియాకు చెందిన నికోలా మోక్టిక్-అమెరికాకు చెందిన రాజీవ్‌రామ్ జోడీతో తలపడనుంది.
Haris Rauf world Record : పాక్ 10వ నంబర్ బ్యాటర్ వరల్డ్ రికార్డు.. ఏమా కొట్టుడు సామీ..
డబుల్స్‌లో ఫర్వాలేదు..
సింగిల్స్‌లో ఇప్పటి వరకు యుకీ బాంబ్రీ గ్రాండ్ స్లామ్‌ల్లో మొదటి రౌండ్‌ను కూడా దాటలేకపోయాడు. అయితే.. డబుల్స్‌లో మాత్రం ఫర్వాలేదనిపిస్తున్నాడు. ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ ఓపెన్‌లలో మూడో రౌండ్‌కు చేరుకున్నాడు. ప్రస్తుతం క్వార్టర్స్‌కు చేరుకున్న యుకీ జోడీ.. అక్కడ 11వ సీడ్‌ను ఓడించడం కష్టమైన విషయం అయితే కాదు. మరో రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధిస్తే ఫైనల్‌కు చేరుకునే ఛాన్స్ ఉంది.