దేశీవాలీ లీగ్‌లో జరిగే మ్యాచ్‌లలో అనూహ్యమైన రికార్డులతో పాటు ఆసక్తికరమైన ఘటనలు చోటు చేసుకోవడం సర్వసాధారణం. ఇదే తరహాలో విటాలిటీ బ్లాస్ట్ లీగ్‌లో జరిగిన ఘటన మైదానంలో ఉన్న వారినే కాకుండా వీడియో చూసిన వారందరినీ కడుపుబ్బా నవ్విస్తోంది.
ఇటీవల డారమ్, యార్క్ షైర్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. యార్క షైర్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్. మ్యాచ్‌లో భాగంగా కేశవ్ ఓ లెంగ్తీ డెలివరి విసిరాడు. బంతిని షాట్ ఆడేందుకు యత్నించి బ్యాట్స్‌మన్ విఫలమయ్యాడు. బాల్ ప్యాడ్స్ మధ్య తిరుగుతూ అక్కడే ఉండిపోయింది.
దానిని అందుకుని త్రో విసిరేందుకు చూసిన కీపర్ గురి కాస్త తప్పి బౌలర్ బేస్ అదిరింది. వికెట్ కీపర్ జొనాథన్ టట్టరసల్ బంతిని బౌలర్ ఎండ్‌కు విసరబోయాడు. అది యాంగిల్ మార్చుకుని బౌలింగ్ వేసి వెనక్కు తిరిగిన కేశవ్ బేస్‌కు టచ్ అయింది. ఎడమకాలి వెనుక భాగంలో తగలడంతో కాసేపటి వరకూ రుద్దుకుంటూనే ఉండిపోయాడు.
ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారడంతో ఫుల్లుగా నవ్వుకుంటూ షేర్ చేస్తున్నారు. మ్యాచ్‌లో 4ఓవర్లు బౌలింగ్ వేసిన కేశవ్ 21పరుగులు ఇచ్చి సున్నా వికెట్లతో వెనుదిరిగాడు. అయినప్పటికీ యార్క్‌షైర్ జట్టే 14పరుగుల తేడాతో విజయం సాధించింది.
The poor bowler ?#Blast19 pic.twitter.com/cFjcYc6Ls1
— Vitality Blast (@VitalityBlast) August 24, 2019