Sakshi Malik : ప్రతిరోజు మెంటల్‌గా ఎలాంటి కఠోర పరిస్థితులు ఎదుర్కొంటున్నామో తెలుసా?: రెజ్లర్ సాక్షి మాలిక్

రాజీపడాలని తమపై చాలా ఒత్తిడి తీసుకొచ్చారని, బెదిరించారని సాక్షి మాలిక్ తెలిపింది.

Sakshi Malik

Wrestlers protest – Sakshi Malik : రెజ్లర్ల ఆందోళనపై సాక్షి మాలిక్ ఇవాళ మీడియాతో మాట్లాడింది. ” మా సమస్యలు తీరితేనే ఆసియన్ గేమ్స్‌(Asian Games)లో ఆడతాం. మేము ప్రతిరోజు మానసికంగా ఎటువంటి స్థితిని ఎదుర్కొంటున్నామో మీకు తెలియదు ” అని రెజ్లర్ సాక్షి మాలిక్ తెలిపింది.

మళ్లీ ఆందోళనకు దిగాలా? వద్దా? అన్న విషయంపై జూన్ 15న తర్వాత నిర్ణయం తీసుకుంటామని సాక్షి మాలిక్ చెప్పింది. రాజీపడాలని తమపై చాలా ఒత్తిడి తీసుకొచ్చారని తెలిపింది. ఫిర్యాదు చేసిన ఏడుగురికి రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ (Brij Bhushan Sharan Singh) మనుషుల నుంచి కాల్స్ వచ్చాయని, వారు బెదిరించారని తెలిపింది.

అయినప్పటికీ, బ్రిజ్ భూషణ్ ను అరెస్టు చేయనిదే తాము ఆందోళన విరమించబోమని రెజ్లర్లు చెప్పిన విషయం తెలిసిందే. ఈ డిమాండ్ పై ఇప్పటికీ తాము వెనక్కి తగ్గలేదని రెజ్లర్లు అంటున్నారు. పోలీసులు చేస్తున్న విచారణపై తమకు నమ్మకం లేదని చెప్పారు. రెజ్లర్ల ఉద్యమం నుంచి సాక్షి మాలిక్ తప్పుకుందని ఇటీవల ప్రచారం జరిగింది. అయితే, తాను ఉద్యమం నుంచి తప్పుకోలేదని సాక్షి మాలిక్ స్పష్టం చేసింది.

Kottu Satyanarayana: దేవుడితో పరాచకాలు ఆడుతున్నావ్ చంద్రబాబు.. అందుకే గాలి, దుమ్ము లేచింది..