Esha Singh : పారిస్ ఒలింపిక్స్ బెర్తును ఖరారు చేసుకున్న తెలంగాణ అమ్మాయి.. స్పందించిన ఎమ్మెల్సీ క‌విత

తెలంగాణకు చెందిన 18 ఏళ్ల ఈషా సింగ్ పారిస్ ఒలింపిక్స్ బెర్త్‌ను ద‌క్కించుకుంది.

Esha Singh

Esha Singh : తెలంగాణకు చెందిన 18 ఏళ్ల ఈషా సింగ్ పారిస్ ఒలింపిక్స్ బెర్త్‌ను ద‌క్కించుకుంది. జ‌కార్తా వేదిక‌గా జ‌రిగిన ఆసియా ఒలింపిక్ క్వాలిఫ‌య‌ర్ టోర్న‌మెంట్‌లో మ‌హిళ‌ల 10 మీట‌ర్ల ఎయిర్ పిస్ట‌ల్ విభాగంలో స్వ‌ర్ణ‌ప‌తకాన్ని గెల‌వ‌డం ద్వారా ఆమె విశ్వ‌క్రీడ‌ల‌కు అర్హ‌త సాధించింది.

10 మీట‌ర్ల ఎయిర్ పిస్ట‌ల్ విభాగంలో ఈషా సింగ్ 243.1 స్కోరు చేసి స్వ‌ర్ణం కైవ‌సం చేసుకుంది. పాకిస్తాన్ కు చెందిన కిష్మ‌లా త‌ల‌బ్ (236.3) ర‌జ‌కాన్ని అందుకోగా, భార‌త్‌కు చెందిన రిథ‌మ్ సాంగ్వాన్ (214.5) క్యాంస ప‌త‌కాన్ని ముద్దాడింది. ఒలింపిక్ బెర్తును ఖాయం చేసుకున్న ఈషా సింగ్ పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తోంది.

KL Rahul : కేఎల్ రాహుల్ టీ20ల‌కు ప‌నికిరాడా..? జ‌ట్టులో చోటు ద‌క్క‌క‌పోవ‌డానికి కార‌ణ‌మేంటి..?

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత సోష‌ల్ మీడియా వేదిక‌గా అభినంద‌న‌లు తెలియ‌జేసింది.’పారిస్ ఒలింపిక్స్ బెర్త్‌ను సొంతం చేసుకున్న తెలంగాణ ముద్దు బిడ్డ ఈషాసింగ్ కు శుభాకాంక్ష‌లు. జ‌కార్తాలో జ‌రిగిన ఆసియా ఛాంఫియ‌న్ షిప్‌లో స్వ‌ర్ణం గెల‌వ‌డం మీ నైపుణ్యం, సంక‌ల్పానికి నిద‌ర్శ‌నం. ఒలింపిక్ వేదిక‌పై స‌త్తా చాటాల‌ని కోరుకుంటున్నాను.’ అని క‌విత ట్వీట్ చేశారు.

Kapil Dev : ఇంట‌ర్నెట్‌ను ఊపేస్తున్న క‌పిల్‌దేవ్ డ్యాన్స్‌.. ఎవ‌రితో, ఏ పాట‌కో తెలుసా?

ట్రెండింగ్ వార్తలు