Yuzvendra Chahal : బ్యాట‌ర్ల సిక్స‌ర్ల పండ‌గ‌.. చాహ‌ల్ ఖాతాలో చెత్త రికార్డు

రాజ‌స్థాన్ రాయ‌ల్స్ స్టార్ స్పిన్న‌ర్ యుజ్వేంద్ర చాహ‌ల్ ఓ చెత్త రికార్డును త‌న పేరిట న‌మోదు చేసుకున్నాడు.

Yuzvendra Chahal became second bowler to conceded 200 sixes in IPL

Chahal conceded 200 sixes : రాజ‌స్థాన్ రాయ‌ల్స్ స్టార్ స్పిన్న‌ర్ యుజ్వేంద్ర చాహ‌ల్ ఓ చెత్త రికార్డును త‌న పేరిట న‌మోదు చేసుకున్నాడు. పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో అత‌డు దీన్ని అందుకున్నాడు. ఐపీఎల్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక సిక్స‌ర్లు ఇచ్చిన రెండో బౌల‌ర్‌గా రికార్డుల‌కు ఎక్కాడు. ఇప్ప‌టి వ‌రకు చాహ‌ల్ 150 ఐపీఎల్ ఇన్నింగ్స్‌లో 201 సిక్స‌ర్లు ఇచ్చాడు.

చాహ‌ల్ కంటే ముందు ఐపీఎల్‌లో 200 సిక్స‌ర్లు స‌మ‌ర్పించుకున్న బౌల‌ర్ పీయూష్ చావ్లా కాగా.. అత‌డి బౌలింగ్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 211 సిక్స‌ర్లను బ్యాట‌ర్లు బాదారు. ఈ జాబితాలో ర‌వీంద్ర జ‌డేజా, ర‌విచంద్ర‌న్ అశ్విన్‌లు కూడా ఉన్నారు. వీరిద్ద‌రు వ‌రుస‌గా 198, 189 సిక్స‌ర్లు ఇచ్చి మూడు, నాలుగు స్థానాల్లో కొన‌సాగుతున్నారు.

Sanju Samson : ధోని స్టైల్‌లో.. సంజూ శాంస‌న్ స్ట‌న్నింగ్ ర‌నౌట్ వీడియో

ఐపీఎల్‌లో అత్య‌ధిక సిక్స‌ర్లు ఇచ్చిన బౌల‌ర్లు వీరే..
పీయూష్ చావ్లా – 184 ఇన్నింగ్స్‌ల్లో 211 సిక్స‌ర్లు
యుజ్వేంద్ర చాహ‌ల్ – 150 ఇన్నింగ్స్‌ల్లో 201 సిక్స‌ర్లు
ర‌వీంద్ర జ‌డేజా – 202 ఇన్నింగ్స్‌ల్లో 198 సిక్స‌ర్లు
ర‌విచంద్ర‌న్ అశ్విన్ – 199 ఇన్నింగ్స్‌ల్లో 189 సిక్స‌ర్లు
అమిత్ మిశ్రా – 161 ఇన్నింగ్స్‌ల్లో 182 సిక్స‌ర్లు సిక్స‌ర్లు

ప‌ర్పుల్ క్యాప్‌..

ఈ సీజ‌న్‌లో చాహ‌ల్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆరు మ్యాచుల్లో 11 వికెట్లు ప‌డ‌గొట్టి ప‌ర్పుల్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ సీజ‌న్‌లో అత‌డి ఎకాన‌మీ 7.40 కాగా.. స‌గ‌టు 14.81గా ఉంది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో చాహల్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఇప్పటి వరకు 3305 బంతులు వేసిన చాహల్ మొత్తం 198 వికెట్లు తీశాడు. మ‌రో రెండు వికెట్లు తీస్తే ఐపీఎల్ చ‌రిత్ర‌లో 200 వికెట్లు తీసిన మొద‌టి బౌల‌ర్‌గా చ‌రిత్ర సృష్టిస్తాడు.

Punjab Kings : పంజాబ్‌కు వ‌రుస షాకులు..కెప్టెన్ దూరం.. ఇలాగైతే..

ట్రెండింగ్ వార్తలు