Punjab Kings : పంజాబ్‌కు వరుస షాకులు..కెప్టెన్ దూరం.. ఇలాగైతే..
ఓటమి బాధలో ఉన్న పంజాబ్ కింగ్స్‌కు ఊహించని షాక్ తగిలింది.

PBKS captain Shikhar Dhawan sidelined for a week with shoulder injury
Punjab Kings captain : ఓటమి బాధలో ఉన్న పంజాబ్ కింగ్స్‌కు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ శిఖర్ ధావన్ రెండు వారాల పాటు ఆటకు దూరం కానున్నాడు. శనివారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ అతడు ఆడలేదు. శిఖర్ భుజానికి గాయమైందని, అతడు కోలుకునేందుకు ఆరు నుంచి పది రోజుల సమయం పట్టే అవకాశం ఉందని ఆ జట్టు క్రికెట్ డెవలప్‌మెంట్ హెడ్ సంజయ్ బంగర్ తెలిపాడు.
ఈ నేపథ్యంలో పంజాబ్ జట్టు ఆడనున్న మరో రెండు ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచులకు శిఖర్ అందుబాటులో ఉండడు. ఈ సీనియర్ బ్యాటర్ అందుబాటులో ఉండకపోవడం పంజాబ్‌కు గట్టి ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. ఏప్రిల్ 26 న కేకేఆర్‌తో జరిగే మ్యాచ్ సమయానికి అతడు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ధావన్ అందుబాటులో లేకపోవడంతో సామ్ కర్రన్ జట్టుకు తాత్కాలిక సారథిగా బాధ్యతలను నిర్వర్తించనున్నాడు.
Sanju Samson : ధోని స్టైల్‌లో.. సంజూ శాంసన్ స్టన్నింగ్ రనౌట్ వీడియో
రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో పంజాబ్ జట్టు మూడు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 147 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాటర్లలో జితేశ్ శర్మ(24 బంతుల్లో 29), అషుతోష్ శర్మ(16 బంతుల్లో 31) రాణించారు. రాజస్థాన్ బౌలర్లలో కేశవ్ మహరాజ్, ఆవేశ్ ఖాన్‌లు చెరో రెండు వికెట్లు తీశారు. ట్రెంట్ బౌల్ట్, కుల్దీద్ సేన్, చాహల్‌లు తలా ఓ వికెట్ పడగొట్టారు.
అనంతరం లక్ష్యాన్ని రాజస్థాన్ 19.5 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. రాజస్థాన్ బ్యాటర్లలో యశస్వి జైస్వాల్ (39; 28 బంతుల్లో), షిమ్రోన్ హెట్మెయర్ (27నాటౌట్; 10 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లు) లు రాణించారు. పంజాబ్ బౌలర్లలో రబాడ, సామ్ కర్రన్ లు చెరో రెండు వికెట్లు తీశారు. అర్ష్‌దీప్ సింగ్, లివింగ్ స్టోన్, హర్షల్ పటేల్ లు తలా ఓ వికెట్ పడగొట్టారు.
Suryakumar Yadav : చెన్నైతో మ్యాచ్‌కు ముందు కెమెరాను బద్దలు కొట్టిన సూర్యకుమార్ యాదవ్