Chahal : ప్ర‌ద‌ర్శ‌న‌తోనే సెల‌క్ట‌ర్ల‌ను ప్రశ్నిస్తున్న చాహ‌ల్‌..! జ‌ట్టులో త‌న‌కు చోటు ఎందుకు లేద‌ని..?

Yuzvendra Chahal : వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023లో చోటు ద‌క్క‌లేదు. పోనీ ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లోనైనా అవ‌కాశం ల‌భిస్తుంద‌ని ఆశ‌గా ఎదురుచూశాడు యుజ్వేంద్ర చాహల్.

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023లో చోటు ద‌క్క‌లేదు. పోనీ ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లోనైనా అవ‌కాశం ల‌భిస్తుంద‌ని ఆశ‌గా ఎదురుచూశాడు యుజ్వేంద్ర చాహల్. అయితే ఇక్క‌డ కూడా అత‌డికి నిరాశే ఎదురైంది. అయితే.. అత‌డు మాత్రం కృంగిపోలేదు. ఎక్క‌డైనా మ్యాచ్ ఆడ‌డ‌మే త‌న ల‌క్ష్య‌మ‌ని చెప్పాడు. త‌న ప్ర‌ద‌ర్శ‌న‌తోనే సెల‌క్ట‌ర్ల‌కు స‌మాధానం చెప్పాల‌ని అనుకున్నాడు. ఇందుకు దేశవాలీ 50 ఓవర్ల టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీ 2023 వేదిక‌గా ఎంచుకున్నాడు. మొద‌టి మ్యాచులోనే 6 వికెట్ల‌తో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చేశాడు.

హ‌ర్యానాకు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న చాహ‌ల్ ఉత్త‌రాఖండ్ తో జ‌రిగిన మ్యాచ్‌లో సంచ‌ల‌న ప్ర‌ద‌ర్శ‌న చేశాడు. కేవ‌లం 26 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చి 6 వికెట్లు తీశాడు. చాహ‌ల్ తో పాటు తేవాటియా (2/29) రాణించ‌డంతో మొద‌ట బ్యాటింగ్ చేసిన ఉత్త‌రాఖండ్ 47.4 ఓవ‌ర్ల‌లో 207 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. ఆదిత్య తారే (65) అర్ధ‌శ‌త‌కంతో రాణించాడు. అనంత‌రం యువ‌రాజ్ సింగ్ (68), అంకిత్ కుమార్ (49)లు రాణించ‌డంతో ల‌క్ష్యాన్ని హ‌ర్యానా 45 ఓవ‌ర్ల‌లో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది.

సూర్య నాయ‌క‌త్వంలో..

టీ20ల‌కు రెగ్యుల‌ర్ కెప్టెన్ అయిన హార్దిక్ పాండ్య గాయ‌ప‌డ‌డంతో సూర్య‌కుమార్ యాద‌వ్‌ను ఆసీస్‌తో టీ20 సిరీస్‌కు కెప్టెన్‌గా ఎంపిక చేశారు. స్పిన్ విభాగంలో ర‌వి బిష్ణోయ్‌, అక్ష‌ర్ ప‌టేల్‌, వాషింగ్ట‌న్ సుంద‌ర్‌కు చోటు ఇచ్చారు. అయితే చాహ‌ల్‌ను మాత్రం ప‌క్క‌న పెట్టారు. టీ20 సిరీస్‌కు జ‌ట్టును ప్ర‌క‌టించిన వెంట‌నే చాహల్ సోషల్ మీడియాలోకి వెళ్లి ఒక స్మైలీ ఎమోజీని పోస్ట్ చేశాడు.

Rahul Dravid : ఇంకో ఏడాదా..? అస్స‌లు వ‌ద్దు.. టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ ఎవ‌రో తెలుసా..?

ఇటీవలి ఓ ఇంటర్వ్యూలో తనను వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌కు ఎంపిక చేయ‌క‌పోవ‌డంపై చాహ‌ల్ స్పందించాడు. ‘పరిస్థితులకు అలవాటు పడ్డానని చెప్పాడు. జ‌ట్టులో 15 మందికి మాత్ర‌మే చోటు ఉంటుంద‌ని అర్థం చేసుకున్నాను. ఎందుకంటే ఇది ప్ర‌పంచ‌క‌ప్‌. ఇక్క‌డ మీరు 17 లేదా 18 మంది ఆట‌గాళ్ల‌ను తీసుకోలేరు.’ అని చాహ‌ల్ అన్నాడు.

‘అవును కొంచెం బాధ ప‌డ్డాను. కానీ జీవితంలో ముందుకు సాగడమే నా నినాదం. నేను ఇప్పుడు దానికి అలవాటు పడ్డాను. ఇప్ప‌టికి మూడు ప్రపంచ కప్‌లు (నవ్వుతూ). నేను ఎక్కడైనా క్రికెట్ ఆడాలనుకుంటున్నాను.’ అని చాహ‌ల్ చెప్పాడు.

T20 World Cup 2024 : టీ20ల‌కు హార్దిక్‌పాండ్య కెప్టెన్‌గా వ‌ద్దు.. అందుకు స‌రైనోడు అత‌డే : గంభీర్

ట్రెండింగ్ వార్తలు