IND vs ZIM : మూడో టీ20 మ్యాచ్‌.. దంచికొట్టిన వైభ‌వ్ సూర్య‌వంశీ.. జింబాబ్వే ముందు భారీ ల‌క్ష్యం..

హ‌రారే వేదిక‌గా భార‌త్, జింబాబ్వే జ‌ట్ల మ‌ధ్య (IND vs ZIM ) మూడో టీ20 మ్యాచ్ జ‌రుగుతోంది.

Zimbabwe target is 193 runs in 3rd T20 against India

IND vs ZIM : హ‌రారే వేదిక‌గా భార‌త్, జింబాబ్వే జ‌ట్ల మ‌ధ్య మూడో టీ20 మ్యాచ్ జ‌రుగుతోంది. 15 ఏళ్ల వైభ‌వ్ సూర్య‌వంశీ (81; 49 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) దంచికొట్ట‌డంతో తొలుత బ్యాటింగ్ చేసిన భార‌త్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 192 ప‌రుగులు చేసింది. దీంతో జింబాబ్వే ముందు 193 ప‌రుగుల ల‌క్ష్యం నిలిచింది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భార‌త్‌కు ఆదిలోనే షాక్ త‌గిలింది. ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ 4 బంతుల్లో 2 ప‌రుగులు మాత్ర‌మే చేసి జ‌ట్టు స్కోరు 20 ప‌రుగుల వ‌ద్ద పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. అయితే మ‌రో ఓపెన‌ర్ వైభ‌వ్ సూర్య‌వంశీ త‌నదైన శైలిలో ప‌రుగులు రాబ‌ట్టాడు. అత‌డికి ఇషాన్ కిష‌న్ (29; 26 బంతుల్లో 4 ఫోర్లు), శ్రేయ‌స్ అయ్య‌ర్ (27; 18 బంతుల్లో 2 ఫోర్లు) చ‌క్క‌ని స‌హ‌కారం అందించారు.

Vaibhav Sooryavanshi : మూడో టీ20 మ్యాచ్‌లో వైభ‌వ్ విధ్వంసం.. 8 ఫోర్లు, 4 సిక్స‌ర్లు.. నువ్వు మామూలోడివి కాదు సామీ..

అర్థ‌శ‌త‌కం దాటిన త‌రువాత మ‌రింత‌ వేగంగా ఆడిన వైభ‌వ్ భారీ షాట్ కు య‌త్నించి ఔట్ అయ్యాడు. ఆఖ‌రిలో రింకూ సింగ్ (25; 14 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) వేగంగా ఆడ‌డంతో జ‌ట్టు స్కోరు 190 ప‌రుగులు దాటింది. జింబాబ్వే బౌల‌ర్ల‌లో బ్రాడ్ ఎవాన్స్ రెండు వికెట్లు తీశాడు. సికింద‌ర్ ర‌జా, బ్లెస్సింగ్ ముజరబాని, వెస్లీ మధెవెరే లు త‌లా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.