10 Tips to Increase Car Mileage and Save Fuel, Follow these simple Steps in Telugu
Car Mileage Tips : మీ కారు మైలేజీ ఎంత ఇస్తుంది? ఇంధనం వెంటనే ఖర్చు అయిపోతుందా? ఇంతకీ కారు మైలేజీని ఎలా పెంచుకోవాలి? ఇంధనాన్ని ఎలా ఆదా చేయాలి అనేది చాలామంది అవగాహన ఉండదు.. మరికొంతమంది అయితే కారు మైలేజీ, ఇంధనాన్ని ఆదా ఎలా అనే దానిపై ఇంటర్నెట్‌లో తెగ వెతికేస్తుంటారు. మీరు కూడా దీనిపైనే సెర్చ్ చేస్తుంటే.. ఇది మీకోసమే.. మీ కారు మైలేజీని మెరుగుపరచడంతో పాటు మీ మొత్తం ఇంధన ఖర్చులను తగ్గించే అద్భుతమైన 10 సింపుల్ టిప్స్ మీకోసం అందిస్తున్నాం. ఈ టిప్స్ పాటించడం ద్వారా కారు మైలేజీని పెంచుకోండి.
కారు మైలేజీని మెరుగుపరచడానికి 10 టిప్స్ ఇవే :
1. ఇంజిన్‌ను మంచి కండిషన్‌లో ఉంచుకోండి :
కారు మైలేజీని పెంచుకోవడానికి అద్భుతమైన మార్గాల్లో ఒకటి.. మీ కారును జాగ్రత్తగా చూసుకోవడం. మీ కారును మురికి, అడ్డుపడే ఫిల్టర్‌లతో డ్రైవ్ చేస్తే.. ఎక్కువ ఇంధనాన్ని వినియోగిస్తుందని గుర్తించాలి. ఇంజిన్‌లో మురికి, గాలి వడపోత గాలి ప్రవాహాన్ని నిరోధిస్తుంది. దాంతో ఆక్సిజన్‌ను తగ్గిస్తుంది. తత్ఫలితంగా కారు ఇంజిన్ వేడిక్కుతుంది. క్లీన్ ఫిల్టర్‌తో కవర్ చేసేందుకు ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. దాంతో ఇంధనం అవసరమైనది కన్నా ఎక్కువ ఖర్చు అవుతుంది.
2. కారు లోపల లోడ్ తగ్గించండి :
కారు మైలేజీని ఎలా పెంచుకోవాలా అని ఆలోచిస్తున్నారా? కారు లోపల అనవసరమైన బరువైన వస్తువులను పెట్టవద్దు. కారులో లోడ్ పెరిగినకొద్ది ఇంధనం ఎక్కువగా ఖర్చు అవుతుంది. లోడ్ తగ్గించుకోవడం ద్వారా ఇంధనాన్ని ఆదా చేయగలుగుతారు. కారులో 100 పౌండ్లు గ్యాస్ మైలేజీని ఒక శాతానికి తగ్గించగలవని మీకు తెలుసా? చిన్న వాహనాలు ఈ సమస్యలను ఎక్కువగా ఎదుర్కొంటాయి. అందుకే, మీ కారులో అధిక బరువును ఉంచకుండా ప్రయత్నించండి. ఇప్పటి నుంచి ఇంధనంపై ఎంత ఆదా చేయవచ్చో మీరే చూస్తారు.
How to Improve Car Mileage
3. సరైన ఇంజిన్ ఆయిల్ ఉపయోగించండి :
ఇంజిన్ అందించే మైలేజీకి నేరుగా సంబంధం ఉన్నది ఒక్కటే ఇంజిన్ ఆయిల్.. మీరు సరైన ఇంజిన్ ఆయిల్ గ్రేడ్‌ని ఉపయోగిస్తున్నారా? లేదా చెక్ చేసుకోండి. మీ వాహన మాన్యువల్‌లో దీనికి సంబంధించిన సమాచారాన్ని పొందవచ్చు. దాని ప్రకారం సూచించిన ఇంజిన్ ఆయిల్ మాత్రమే వాడాలి.
4. పెడల్‌ను అదే పనిగా నొక్కిపట్టొద్దు :
కారు గ్యాస్ మైలేజీని పెంచుకోవాలంటే ముందుగా చేయాల్సిన పని.. పెడల్‌ను అదే పనిగా ప్రెస్ చేయొద్దు. సాధ్యమైనంతవరకు సులభంగా వెళ్లడానికి ప్రయత్నించండి. ముందు స్పీడ్ గా వెళ్లండి.. ఆ తర్వాత బ్రేక్ వేయండి.. ఆపై ఫాస్ట్ యాక్సిలరేషన్ కొట్టడం వంటి చేయడం ద్వారా ఇంధనాన్ని ఆదా చేయొచ్చు. పేలవమైన డ్రైవింగ్ అలవాట్లు కూడా ఇంధన ఆదాపై 15శాతం నుంచి 30శాతం ప్రభావం చూపుతాయి. ఈ పద్ధతిని పాటించడం ద్వారా ఇంధనాన్ని ఆదా చేసుకోవచ్చు.
5. టైర్లలో సరైన ఎయిర్ ప్రెజర్‌తో నడపండి :
మీ కారు టైర్లలో ఎల్లప్పుడూ సరైన గాలి పీడనంతో డ్రైవింగ్ చేయాలి. ఎందుకంటే.. కారు ఇంధన సామర్థ్యంతో దీనికి నేరుగా సంబంధం ఉంటుంది. తగ్గిన టైర్ ప్రెజర్ అంటే.. రోడ్డు, టైర్ మధ్య సాధారణ పరిమితికి మించి ఘర్షణ ఉంటుంది. ఫలితంగా, టైర్ రబ్బరు, రహదారి మధ్య ఘర్షణ మరింత పెరుగుతుంది. తద్వారా ఎక్కువ ఇంధనాన్ని వినియోగిస్తుంది. మరోవైపు, అధికంగా గాలిని నింపిన టైర్లు ఇంధన వినియోగాన్ని తగ్గిస్తాయి. అయితే గ్రిప్, ఆక్వాప్లానింగ్ నిరోధకత తగ్గుతుంది. అందుకే టైర్‌లో గాలి పీడనం సరైన స్థాయిలో ఉండేలా చూసుకోండి.
Car Mileage and Save Fuel
6. ఓవర్ రివ్వింగ్ మానుకోండి :
ఓవర్-రివింగ్ మైలేజీని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. హార్డ్ యాక్సలేరేషన్ మరింత ఇంధనాన్ని వినియోగిస్తుంది. మీరు కారు మైలేజీని మెరుగుపరచడానికి, ఇంధనాన్ని ఆదా చేయడానికి సిద్ధంగా ఉంటే.. నెమ్మదిగా, క్రమంగా వేగవంతం చేయడానికి ప్రయత్నించండి.
7. గేర్లను సరిగ్గా ఉపయోగించండి :
అధిక మైలేజీని పెంచుకోవడానికి గేర్‌లను సరిగ్గా మార్చడం చాలా అవసరం. మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ కార్లకు వర్తిస్తుంది. సరైన వేగంతో గేర్లను ఉపయోగించండి. ఇది ఇంధనాన్ని ఆదా చేయడంలో సాయపడుతుంది.
8. చక్రాల అమరికను చెక్ చేయండి :
చక్రాలను తప్పుగా అమర్చిన కార్లలో మైలేజీ, ఇంధన ఆర్థిక వ్యవస్థను ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. సరికాని అమరిక ఇంధన సామర్థ్యాన్ని గరిష్టంగా 10శాతం వరకు తగ్గిస్తుంది. అలాగే, టైర్‌లు అకాలంగా అరిగిపోయేలా ప్రభావితం చేయవచ్చు. స్టీరింగ్ వీల్‌లో వైబ్రేషన్ వంటివి టైర్లలో హెచ్చుతగ్గుదలకు దారితీయవచ్చు. కారు మైలేజీని మరింత తగ్గించడానికి దారితీస్తుంది. అందువల్ల, టైర్లు సరిగ్గా సమతుల్యంగా ఉన్నాయని నిర్ధారించుకోవాలి. మీ టైర్లను నిశితంగా పరిశీలించండి లేదా ఏదైనా గ్యారేజీని సందర్శించండి.
10 Tips for Car Mileage
9. ఎయిర్-కాన్ ఆఫ్ చేసి వదిలేయండి :
బయట చాలా ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటే తప్ప.. కారు ఎయిర్‌కాన్‌ను అనవసరంగా ఆన్ చేయవద్దు. అధిక వినియోగం ఇంజిన్‌పై చాలా ఒత్తిడిని కలిగిస్తుంది. ఎక్కువ ఇంధనాన్ని వినియోగిస్తుంది. ముఖ్యంగా తక్కువ వేగంతో ఉన్నప్పుడు హీట్ చేసిన విండ్‌స్క్రీన్‌లు, డిమిస్టర్‌లు మొదలైన వాటికి ఇది వర్తిస్తుంది.
10. సరైన స్పీడ్ లిమిట్‌తో వెళ్లండి :
కారు మైలేజీని మెరుగుపరచుకోవడాలంటే వాహనం మాన్యువల్‌లో పేర్కొన్న విధంగా సరైన స్పీడ్ లిమిట్ కలిగి ఉండటం చాలా అవసరం పరిశోధన ప్రకారం.. 80ఎంపీహెచ్ (మైల్ ఫర్ అవర్) వేగంతో డ్రైవింగ్ చేయడం ద్వారా 70ఎంపీహెచ్ కన్నా 25శాతం ఎక్కువ ఇంధనం ఖర్చు అవుతుందని తేలింది.
Read Also : Hyundai Cars Discounts : కొత్త కారు కొంటున్నారా? హ్యుందాయ్ కార్లపై భారీ డిస్కౌంట్లు.. ఏ వేరియంట్ ధర ఎంతంటే?