2025 Honda Activa 125 launched at Rs 94,442
2025 Honda Activa 125 : ప్రముఖ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా అప్‌డేటడ్ 125సీసీ యాక్టివాను రూ. 94,422 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ప్రారంభ ధరతో ప్రవేశపెట్టింది. లేటెస్ట్ ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఉంది. 2025 యాక్టివా 125 అప్‌గ్రేడ్ చేసిన 123.92సీసీ, సింగిల్-సిలిండర్ పీజీఎమ్-ఎఫ్ఐ (ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్) ఇంజన్‌తో ఇప్పుడు ఓబీడీ2బీ కంప్లైంట్, 6.20కిలోవాట్ పవర్, 10.5 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
అప్‌గ్రేడ్ చేసిన ఇంజన్‌తో ఇప్పుడు కఠినమైన ఉద్గార నిబంధనలను కలిగి ఉంది. అదనంగా, స్కూటర్‌లో ఇడ్లింగ్ స్టాప్ సిస్టమ్ ఉంటుంది. ఎక్స్‌టెండెడ్ స్టాప్‌ల సమయంలో ఇంజిన్‌ను ఆటోమేటిక్‌గా ఆపివేయడం ద్వారా ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది.
ఇప్పుడు యాక్టివా 125 బ్లూటూత్ కనెక్టివిటీతో కొత్త 4.2-అంగుళాల టీఎఫ్టీ డిస్‌ప్లేను కలిగి ఉంది. హోండా రోడ్‌సింక్ యాప్‌కు సపోర్టుగా ఉంటుంది. నావిగేషన్ కాల్/మెసేజ్ అలర్ట్‌లు, ప్రయాణంలో రైడర్‌లను కనెక్ట్ చేయడం వంటి ఫంక్షన్‌లను ఎనేబుల్ చేస్తుంది. అదనపు సౌలభ్యం కోసం యూఎస్‌బీ టైప్-సి ఛార్జింగ్ పోర్ట్‌ను కూడా కలిగి ఉంది. ప్రయాణిస్తున్నప్పుడు రైడర్‌లు తమ డివైజ్‌లను ఛార్జ్ చేసేందుకు అనుమతిస్తుంది.
అప్‌డేట్ అయిన యాక్టివా 125 సిగ్నేచర్ సిల్హౌట్‌ను కలిగి ఉంది. అయితే, కొత్త కాంట్రాస్టింగ్ బ్రౌన్ సీట్లు, లోపలి ప్యానెల్‌లను కలిగి ఉంది. వ్యూ మోడ్ మరింత ఆకర్షణగా ఉంటుంది. పెరల్ ఇగ్నియస్ బ్లాక్, మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్, పెరల్ డీప్ గ్రౌండ్ గ్రే, పెరల్ సైరన్ బ్లూ, రెబెల్ రెడ్ మెటాలిక్, పెర్ల్ ప్రెషియస్ వైట్ అనే 6 కలర్ ఆప్షన్‌లతో డీఎల్ఎక్స్, హెచ్-స్మార్ట్ అనే 2 వేరియంట్‌లలో లభిస్తుంది.
హోండా డీఎల్ఎక్స్ వేరియంట్ ధర రూ. 94,442 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ), అయితే హెచ్-స్మార్ట్ ధర రూ. 97,146 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). 2025 యాక్టివా 125 ఇప్పుడు భారత మార్కెట్లో డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంది.
Read Also : CBSE CTET Answer Key 2024 : సీబీఎస్ఈ సీటెట్ ఆన్సర్ కీ 2024 త్వరలో విడుదల.. డేట్, టైమ్ అప్‌టేట్ వివరాలివే!