3-months YouTube Premium membership available for Rs 10 in India
YouTube Premium Membership : ప్రముఖ యూట్యూబ్ (Youtube Premium) YouTube వెల్‌కమ్ ప్రోగ్రామ్‌ను అందిస్తోంది. ఈ ప్రీమియం మెంబర్‌షిప్ కింద రూ. 10కి ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తోంది. ఈ ఆఫర్‌ను పొందే యూజర్లు మూడు నెలల పాటు YouTube ప్రీమియం సభ్యత్వాన్ని పొందవచ్చు. ఆ తర్వాత నెలకు అధికారిక ధర రూ. 129 చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఆఫర్ ఎంతకాలం అందుబాటులో ఉంటుందో కంపెనీ వెల్లడించలేదు. ఆఫర్ లిమిటెడ్ కాలానికి మాత్రమే అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది.
YouTube Premium అనేది ప్రాథమికంగా సబ్‌స్క్రిప్షన్-ఆధారిత సర్వీసు. యాడ్-ఫ్రీ వీడియో ఎక్స్ ఫీరియన్స్ వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వీడియోలను ఆఫ్‌లైన్‌లో ప్లే చేయడం, బ్యాక్‌గ్రౌండ్‌లో వీడియోలను ప్లే చేయడం, YouTube Musicకు మెంబర్‌షిప్ యాడ్ ఫ్రీ ఎక్స్ పీరియన్స్ వంటి అనేక ఇతర ఫీచర్‌లను YouTube Kids యాప్‌పై అందిస్తుంది.
3-months YouTube Premium membership available for Rs 10 in India
రూ.10 యూట్యూబ్ ప్రీమియం మెంబర్‌షిప్ ఆఫర్‌ను మొదట టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ నివేదించారు. ఆఫర్‌ను ఈ లింక్ ద్వారా (Youtube Premium) పొందవచ్చు. ఇప్పుడు, ఇక్కడ క్యాచ్ ఏమిటంటే.. YouTube ఇన్వైట్ ప్రోగ్రామ్ ఆఫర్ మొదటిసారి YouTube Red, Music Premium, YouTube Premium, Google Play మ్యూజిక్ సబ్‌స్క్రైబర్‌లకు మాత్రమే వ్యాలిడిటీ అందిస్తుంది.
ఆఫర్‌ను పొందాలనుకునే యూజర్లు ఈ లింక్‌పై క్లిక్ చేయండి > YouTube ప్రీమియం పొందండి. ఆప్షన్‌పై క్లిక్ చేయండి > పేమెంట్ వివరాలను యాడ్ చేయండి > స్క్రీన్‌పై సూచనలను ఫాలో కావడం ద్వారా ట్రాన్సాక్షన్లను పూర్తి చేయండి. యూజర్లు OTP లేదా మీరు ఎంచుకున్న ఏదైనా ఇతర పేమెంట్ పద్ధతి ద్వారా ధృవీకరణ కోసం మీ బ్యాంకుల పేమెంట్ పోర్టల్‌కు రీడైరెక్ట్ అవుతారు. ఈ ప్రక్రియలను ఫాలో చేసిన తర్వాత.. స్క్రీన్ YouTube ప్రీమియంకు ఇన్వైట్ అనే ప్రాంప్ట్‌ను చూపిస్తుంది. అప్పుడు మెంబర్‌షిప్ అయిందని నిర్ధారిస్తూ YouTube మీ రిజిస్టర్డ్ ఈ-మెయిల్ IDకి ఈమెయిల్‌ను కూడా పంపుతుంది.
మీరు ఇప్పుడు ఆఫర్‌ని ఎంచుకుంటే.. మీరు 3 నెలల పాటు YouTube Premium మెంబర్‌షిప్‌కి యాక్సెస్‌ని పొందవచ్చు. జనవరి నుంచి YouTube ప్రీమియం ఫీచర్‌లను పొందేందుకు అధికారిక ధర, నెలకు రూ. 129 చెల్లించాలి. రూ.10 ఆఫర్ ముగిసేందుకు 7 రోజుల ముందు సబ్‌స్క్రైబర్‌కు YouTube మెంబర్ షిప్ కొనసాగించవచ్చు లేదా నిలిపివేయవచ్చు.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..
Read Also : YouTube Premium : యూట్యూబ్ ప్రీమియంలోనే 4K వీడియో చూడొచ్చు.. ఎందుకో తెలుసా?