Best Affordable Earphones 2025
Best Affordable Earphones 2025 : కొత్త ఇయర్‌ఫోన్స్ కొనేందుకు చూస్తున్నారా? ప్రస్తుతం మార్కెట్లో చాలా బ్రాండ్ల పేరుతో ఇయర్‌ఫోన్లు లభ్యమవుతున్నాయి. అందులో మీ బడ్జెట్ ధరలో మీకు నచ్చిన క్వాలిటీతో లభించే మరెన్నో సరసమైన ఇయర్ ఫోన్లు కొనుగోలు చేయొచ్చు. 2025లో మీరు కొనుగోలు చేయగల 5 బెస్ట్ ఇయర్‌ఫోన్‌లు ఉన్నాయి. ఇందులో మీకు ఏ బ్రాండ్ ఇయర్ ఫోన్స్ కావాలో కొనేసుకోండి.
లైట్నింగ్ కనెక్టర్‌తో ఆపిల్ ఇయర్‌పాడ్స్ (రూ. 2,000) :
ఆపిల్ ఇయర్‌పాడ్స్ కేవలం కాల్స్ ఆన్సర్ చేయడమే కాదు.. మ్యూజిక్, వీడియో ప్లేబ్యాక్ కంట్రోల్ చేయొచ్చు. అద్భుతమైన సౌండ్ బాస్ టోన్‌లను జనరేట్ చేస్తాయి. చెమట, నీటి నుంచి ప్రొటెక్షన్ అందిస్తాయి. ఈ ఇయర్ పాడ్స్ లైట్నింగ్ కనెక్టర్‌తో iOS10 లేదా ఆపై వెర్షన్లకు సపోర్టు ఇచ్చే డివైజ్‌లకు అనుకూలంగా ఉంటుంది. ఇందులో ఐపాడ్ టచ్, ఐప్యాడ్, ఐఫోన్ కూడా ఉన్నాయి.
వన్‌ప్లస్ నార్డ్ వైర్డ్ ఇయర్‌ఫోన్స్ (రూ. 799) :
వన్‌ప్లస్ నార్డ్ వైర్డ్ ఇయర్‌ఫోన్‌లు హై-రెస్ ఆడియో టెక్నాలజీని కలిగి ఉంటాయి. స్టాండర్డ్ సౌండ్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తాయి. ఈ ఇయర్‌ఫోన్‌లు మాగ్నెటిక్ బ్యాక్‌ను కలిగి ఉంటాయి. చిక్కులు లేకుండా ఉంటాయి. ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి.
స్కిన్‌కు అనుకూలంగా సిలికాన్ టిప్స్ కలిగి ఉంటుంది. చెవులకు ఈజీగా సెట్ అవుతాయి. తేలికైన డిజైన్, ఈజీగా క్యారీ చేసేలా ఉంటుంది. ఇంకా, ఇంటర్నల్ మైక్రోఫోన్ కంట్రోలింగ్ బటన్‌లను కలిగి ఉంటాయి. మీకు కాల్స్, మీడియా, వాయిస్ అసిస్టెంట్‌లపై పూర్తి కంట్రోల్ అందిస్తాయి.
కొత్త జేబీఎల్ C100SI 3mW రేటెడ్ పవర్ ఇన్‌పుట్, 1.2m కేబుల్ పొడవు, 20-20kHz ఫ్రీక్వెన్సీ రేంజ్ కలిగి ఉంది. చాలా తేలికైనది. ఈజీగా క్యారీ చేయొచ్చు. అత్యుత్తమ సౌండ్ ఎక్స్‌పీరియన్స్ కోసం పవర్‌ఫుల్9mm డ్రైవర్లను కలిగి ఉంది. ఈ జేబీఎల్ ఇయర్ హెడ్‌ఫోన్ రెడ్, బ్లాక్, వైట్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
సోనీ IER-EX15C (రూ. 2,490) :
లేటెస్ట్ సోనీ ఇయర్‌ఫోన్‌లు 5mm డ్రైవర్లు, నేచురల్ ఆపరేషన్ కలిగి ఉంటాయి. మీ మ్యూజిక్ ప్లేబ్యాక్‌ను కంట్రోల్ చేయొచ్చు. మల్టీ-ఫంక్షన్ బటన్ మ్యూజిక్ పాజ్ చేయడం, ట్రాక్‌లను క్రాస్ చేయడం, కాల్‌లకు ఆన్సర్ చేయొచ్చు. అదనంగా, ఈ డివైజ్ కేబుల్ లాంగ్ అడ్జెస్ట్ చేసుకోవచ్చు. పింక్, బ్లూ, వైట్ బ్లాక్ కలర్ వేరియంట్‌లలో లభిస్తుంది.
బోట్ బాస్ హెడ్స్ 242 (రూ. 699) :
బోఆట్ బాస్‌హెడ్స్ 242 అనేవి శరీరంపై చెమట, దుమ్ము, నీటి నుంచి ప్రొటెక్ట్ చేసేందుకు IPX4 వాటర్ రెసిస్టెన్స్‌తో 10mm డైనమిక్ డ్రైవర్లను కలిగి ఉంది. 20Hz-20kHz ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ 3mW రేటెడ్ పవర్ ఇన్‌పుట్‌ను కలిగి ఉంది. ఇంకా, స్పిరిట్ లైమ్, బ్లూ, నియాన్ గ్రీన్, యాక్టివ్ బ్లాక్, ఆరెంజ్ రెడ్ కలర్ వేరియంట్‌లలో వస్తుంది.