Telugu » Technology » 5 Best Ai Phones Launched In 2025 Check Full Details Sh
5 Best AI Phones : కొత్త AI ఫోన్ కావాలా? 2025లో టాప్ 5 బెస్ట్ ఏఐ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు..!
5 Best AI Phones : ఏఐ ఫోన్ కావాలా? 2025లో అత్యంత పవర్‌ఫుల్ ఫీచర్లతో ఏఐ ఫోన్లు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. టాప్ బెస్ట్ ఏఐ ఫోన్లలో మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి.. పూర్తి వివరాలివే..
5 Best AI Phones : కొత్త ఏఐ ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? 2025లో స్మార్ట్‌ఫోన్‌లలో ఏఐ ఫోన్లకు ఫుల్ డిమాండ్ పెరిగింది. మనం చేయాల్సిన అన్ని పనులను ఇప్పుడు ఏఐనే చేసేస్తుంది. ఎలా రాయాలి? ఎడిట్ ఎలా చేయాలి? ఫొటోలను తీయాలో కూడా అదే చేసేస్తుంది. ఎవరితో ఎలా కమ్యూనికేట్ చేయాలో కూడా అదే చెబుతోంది. అందుకే పలు బ్రాండ్‌లు స్మార్ట్ అసిస్టెంట్‌లు, జనరేటివ్ ఇమేజ్ టూల్స్, రియల్ టైమ్ ట్రాన్స్‌క్రిప్షన్, కాంటెక్స్ట్ అవేర్ ఫీచర్‌లతో నేరుగా OSలోనే అందిస్తున్నాయి.
2/7
డివైజ్ ప్రాసెసింగ్, జనరేటివ్ ఎడిటింగ్, స్మార్ట్ అసిస్టెంట్ వంటి ఫీచర్లు కలిగిన ఫోన్లను అనేక బ్రాండ్లు మార్కెట్లోకి రిలీజ్ చేశాయి. శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా, శాంసంగ్ గెలాక్సీ ఏఐ, వన్‌ప్లస్ 13s వంటి ఏఐ టూల్స్ నుంచి గూగుల్ పిక్సెల్ 10లో జెమిని నానో బనానా ఫీచర్ల వరకు ఐక్యూ 15, ఒప్పో ఫైండ్ X9లోని అడ్వాన్స్ ఏఐ సూట్‌ల వరకు, ఈ మోడల్స్ రియల్ టైమ్ ఆధారిత ఫీచర్లతో హైలెట్‌గా నిలిచాయి. మీరు కూడా ఏఐ ఫీచర్లు కలిగిన ఫోన్ కోసం చూస్తుంటే ఇది మీకోసమే.. 2025లో లాంచ్ అయిన 5 బెస్ట్ AI ఫోన్‌లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మీకు నచ్చిన ఏఐ ఫోన్ కొనేసుకోండి.
3/7
శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా (రూ. 1,08,999) : శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ఫోన్ ఏఐ ఫీచర్లతో మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. గెలాక్సీ ఏఐ ఎక్స్‌పీరియన్స్ యూజర్లను కట్టిపడేసేలా ఉంటుంది. కొత్త ఏఐ సెలెక్ట్ సైడ్‌బార్ రైటింగ్ అసిస్ట్ కోసం టెక్స్ట్‌ను హైలైట్ చేయొచ్చు లేదంటే జనరేటివ్ ఎడిట్‌ల కోసం ఫొటోలను క్యాప్చర్ చేయొచ్చు. గ్యాలరీ ఇప్పుడు రిఫ్లెక్షన్స్ తొలగిస్తుంది. షాడోలను అడ్జెస్ట్ చేస్తుంది. కట్ చేసిన ఫొటోలను విస్తరిస్తుంది. వస్తువులను కూడా సజావుగా మారుస్తుంది. ఈ అప్‌గ్రేడ్‌లన్నీ 2025 స్మార్ట్‌ఫోన్‌లలో అందుబాటులో ఉన్నాయి. ధర విషయానికి వస్తే.. రూ. 1,08,999 నుంచి లభ్యమవుతుంది.
4/7
గూగుల్ పిక్సెల్ 10 (రూ. 69,500) : జెమిని నానో ఆధారిత ఫీచర్లతో గూగుల్ డివైజ్ ఏఐ టెక్నాలజీతో పనిచేస్తుంది. క్లౌడ్ యాక్సెస్ లేకుండానే మ్యాజిక్ క్యూ మెసేజ్, యాప్‌లు, ఇమెయిల్‌ల నుంచి అవసరమైన సమాచారాన్ని అందిస్తుంది. అయితే, కెమెరా కోచ్, కాల్ ట్రాన్స్‌క్రిప్ట్‌లు, ఫొటో ఎడిటింగ్ వంటివి అద్భుతంగా ఉంటాయి. ఇప్పటివరకు వచ్చిన అత్యంత ఆకర్షణీయమైన పిక్సెల్ ఫోన్లలో పిక్సెల్ 10 ఒకటిగా చెప్పొచ్చు.
5/7
ఐక్యూ 15 (రూ. 72,999) : ఐక్యూ 15లో OriginOS6 లోపల అద్భుతమైన ఏఐ టూల్స్ ఉన్నాయి. ఏఐ నోట్ అసిస్ట్ ఏఐ ట్రాన్స్‌లేషన్ నుంచి కాల్ హ్యాండ్లింగ్, నైట్ టైమ్ బ్యాటరీని సేవ్ చేసే స్లీప్ మోడ్ వరకు అన్ని ఫీచర్లు కలిగి ఉంది. ఏఐ రీటచ్, ఇమేజ్ ఎక్స్‌పాండర్ రిఫ్లెక్షన్ ఎరేస్ వంటి క్రియేటివిటీ టూల్స్ ఫొటోలను మరింత మెరుగుపరుస్తాయి. ఈ ఐక్యూ ఫోన్‌ను ఏఐ ఆధారిత అసిస్టెంట్‌గా వినియోగించుకోవచ్చు.
6/7
వన్‌ప్లస్ 13s (రూ. 63,999) : వన్‌ప్లస్ 13s అద్భుతమైన ఫీచర్లతో ప్రైవసీ ఆధారిత ఏఐపై పనిచేస్తుంది. ఏఐ ప్లస్ మైండ్ ఫొటోలతో అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. ఏఐ వాయిస్‌స్క్రైబ్ కాల్స్ రికార్డ్ చేస్తుంది. అయితే, కాల్ అసిస్టెంట్ కాల్ సంభాషణలను రియల్ టైమ్‌లోనే ట్రాన్సులేట్ చేస్తుంది. ఫొటోగ్రఫీ కోసం ఏఐ రీఫ్రేమ్, ఏఐ బెస్ట్ ఫేస్ 2.0 వంటి టూల్స్ వంటి మరింత ఆకర్షణీయంగా ఉంటాయి.
7/7
ఒప్పో ఫైండ్ X9 (రూ. 74,999) : ఈ ఒప్పో ఫోన్ ColorOS16లో ఏఐ రన్ అవుతుంది. ఏఐ పోర్ట్రెయిట్ గ్లో, ప్లానింగ్, ఏఐ మైండ్ స్పేస్, జనరేటివ్ కోసం ఏఐ సమ్మరీ రైటర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఏఐ లింక్‌బూస్ట్‌తో నెట్‌వర్క్ స్టేబిలిటీని పెంచుతుంది. డీబ్లరింగ్, రీలైటింగ్ రిఫ్లెక్షన్ రిమూవల్ ద్వారా ఫొటోలను అప్‌గ్రేడ్ చేస్తుంది. 2025లో ఏఐ స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది.