Telugu » Technology » 5 Best Camera Phones That You Can Buy Instead Of Dslr Camera In 2025 Check Full Details Sh
Best Camera Phones 2025 : కొంటే ఇలాంటి ఫోన్లు కొనాలి బ్రో.. DSLR కెమెరా కన్నా తోపు ఫీచర్లతో 5 బెస్ట్ కెమెరా ఫోన్లు.. ఏది కొంటారో మీదే ఛాయిస్..!
Best Camera Phones 2025 : ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? పవర్‌ఫుల్ DSLR కెమెరాకు మించిన అద్భుతమైన ఫీచర్లతో 5 బెస్ట్ కెమెరా ఫోన్లు లభ్యమవుతున్నాయి.. ఏ ఫోన్ కొంటారో మీరే డిసైడ్ చేసుకోండి.
Best Camera Phones 2025 : కెమెరా లవర్స్ కోసం అద్భుతమైన కెమెరా ఫోన్లు.. 2025లో కెమెరా ఫోన్లకు ఫుల్ క్రేజ్ పెరిగింది. చాలామంది క్రియేటర్లు ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లను కొనేందుకు ఆసక్తి చూపించారు. అందులో ప్రధానంగా DSLR కెమెరాలను పక్కన పెట్టేసి ఈ స్మార్ట్‌ఫోన్ కెమెరా ఫోన్లనే ఎక్కువగా కొంటున్నారు. భారీ సెన్సార్లు, పెరిస్కోప్ జూమ్ లెన్స్‌లు, 8K వీడియో, అడ్వాన్స్ స్టేబిలైజేషన్ ప్రొఫెషనల్ కలర్ సైన్స్‌తో, నేటి ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లు పోర్ట్రెయిట్‌ల నుంచి సినిమాటిక్ వీడియో వరకు మరెన్నో ఫీచర్లు ఉన్నాయి.
2/7
శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ నుంచి వివో X300 ప్రో, ఒప్పో ఫైండ్ X9 ప్రో, గూగుల్ పిక్సెల్ 10 ప్రో ఎక్స్ఎల్ వరకు ఈ కెమెరా ఫోన్‌లు 200MP సెన్సార్లు, పెరిస్కోప్ జూమ్, 8K వీడియో, ProRes ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ కోసం అడ్వాన్స్ కలర్ సైన్స్‌ను అందిస్తున్నాయి. ఈ ఏడాదిలో DSLR కెమెరాల కన్నా విలువైనా 5 కెమెరా ఫోన్లు మార్కెట్లో లభ్యమవుతున్నాయి.. ఈ ఫోన్లలో ఏది కొంటారో కొనేసుకోండి.
3/7
ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ (రూ. 1,49,900) : ఆపిల్ ఐఫోన్ 17 ప్రో మాక్స్ ప్రొఫెషనల్ టూల్స్ డిమాండ్ చేసే క్రియేటర్ల కోసం అందిస్తోంది. ట్రిపుల్ 48MP కెమెరా సిస్టమ్‌లో సెన్సార్-షిఫ్ట్ స్టెబిలైజేషన్, 4x పెరిస్కోప్ లెన్స్, అల్ట్రావైడ్ షూటర్ ఉన్నాయి. ప్రోరెస్ రా, ఆపిల్ లాగ్ 2, డాల్బీ విజన్ HDR, స్పేషియల్ వీడియో లిడార్‌తో వస్తుంది. నేరుగా ఫిల్మ్ మేకింగ్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది.
వివో X300 ప్రో (రూ. 1,09,999) : వివో X300 ప్రో అనేది Zeiss-ట్యూన్ ఆప్టిక్స్‌తో కూడిన ఫొటోగ్రఫీ పవర్‌హౌస్. 50MP OIS మెయిన్ సెన్సార్, మాక్రో షాట్‌లతో భారీ 200MP పెరిస్కోప్ టెలిఫోటో, 50MP అల్ట్రావైడ్ కెమెరాతో వస్తుంది. 8K వీడియో, డాల్బీ విజన్ HDR హై-రిజల్యూషన్ సెల్ఫీ కెమెరా కలిగి ఉంది. రోజువారీ షూటింగ్ కోసం DSLR కెమెరా ఫీచర్లను అందిస్తుంది.
6/7
గూగుల్ పిక్సెల్ 10 ప్రో XL (రూ. 1,24,999) : గూగుల్ పిక్సెల్ 10 ప్రో XL ఫోన్ కంప్యూటేషనల్ మ్యాజిక్ ఆధారితమైన ఫొటోగ్రఫీని అందిస్తుంది. 50MP మెయిన్ కెమెరా, 48MP 5x పెరిస్కోప్ జూమ్, అల్ట్రావైడ్ లెన్స్ 42MP సెల్ఫీ షూటర్‌తో పాటు రన్ అవుతాయి. టెన్సర్ G5 చిప్‌తో ట్రెడేషనల్ కెమెరాలకు పోటీగా అద్భుతమైన ఫొటోలను అందిస్తుంది.
7/7
ఒప్పో ఫైండ్ X9 ప్రో (రూ. 1,09,999) : ఒప్పో ఫైండ్ X9 ప్రో ఫోన్ 50MP మెయిన్ సెన్సార్, భారీ 200MP పెరిస్కోప్ జూమ్ లెన్స్, అల్ట్రావైడ్ కెమెరాతో ప్రొఫెషనల్-గ్రేడ్ ఇమేజింగ్‌ను అందిస్తుంది. హాసెల్‌బ్లాడ్ కలర్ కాలిబ్రేషన్, లేజర్ AF, LOG వీడియో, డాల్బీ విజన్ రికార్డింగ్, DSLR-వంటి రిజల్ట్స్ కోరుకునే ఫోటోగ్రాఫర్‌లు, వీడియోగ్రాఫర్‌లకు అద్భుతమైన ఫోన్ అని చెప్పొచ్చు.