Best Camera Phones : కొంటే ఇలాంటి ఫోన్లు కొనాలి భయ్యా.. టాప్ 5 బెస్ట్ కెమెరా ఫోన్లు ఇవే.. ఏ ఫోన్ కొంటే బెటర్?

Best Camera Phones : కొత్త ఫోన్ కావాలా? భారత మార్కెట్లో గూగుల్ పిక్సెల్ 9 కన్నా అద్భుతమైన కెమెరా ఫీచర్లతో 5 బెస్ట్ ఫోన్లు లభ్యమవుతున్నాయి.

Best Camera Phones

Best Camera Phones : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? 2025లో 5 అద్భుతమైన కెమెరా ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన స్మార్ట్‌ఫోన్ ఎంచుకోండి.

ఐఫోన్ 16 :
ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 16 సెన్సార్-షిఫ్ట్ OISతో పవర్‌ఫుల్ 48MP ప్రైమరీ కెమెరా, 4K డాల్బీ విజన్ HDR వీడియోకు సపోర్టు ఇచ్చే 12MP అల్ట్రావైడ్ లెన్స్‌ను కలిగి ఉంది.

Read Also : Honor 400 Pro : హానర్ కొత్త ఫోన్ కేక.. కెమెరా ఫీచర్లు హైలెట్.. మీ బడ్జెట్ ధరలోనే కొనేసుకోండి.. ఫుల్ డిటెయిల్స్..!

3D స్పేషియల్ ఆడియో, 12MP సెల్ఫీ కెమెరాతో గూగుల్ పిక్సెల్ 9 కన్నా విలువైన కెమెరా ఫోన్ కలిగి ఉంది. ఈ ఫోన్ ధర రూ.69,999 నుంచి అందుబాటులో ఉంది.

ఐక్యూ 13 :
ఐక్యూ 13 ఫోన్ OISతో 50MP ప్రైమరీ సెన్సార్, 2x జూమ్‌ 50MP టెలిఫోటో లెన్స్, 50MP అల్ట్రావైడ్ కెమెరాతో మల్టీఫేస్ ట్రిపుల్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. 8K వీడియో రికార్డింగ్, HDR సపోర్టుతో గూగుల్ పిక్సెల్ 9 కన్నా పవర్‌హౌస్ కెమెరా కలిగి ఉంది. ఈ ఫోన్ ధర రూ. 57,999 ధరకు లభ్యమవుతుంది.

శాంసంగ్ గెలాక్సీ S25 :
అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ S25 ఫోన్ 50MP ప్రైమరీ సెన్సార్, 3x ఆప్టికల్ జూమ్‌‌తో 10MP టెలిఫోటో లెన్స్, సూపర్ స్టెడీ వీడియోతో 12MP అల్ట్రావైడ్ షూటర్‌తో ట్రిపుల్-కెమెరా సెటప్‌ను అందిస్తుంది.

8K HDR వీడియో, HDR10+, 4K సెల్ఫీ రికార్డింగ్‌తో గూగుల్ పిక్సెల్ 9 కన్నా కెమెరా ఫోన్ కలిగి ఉంది. ఈ శాంసంగ్ ఫోన్ ధర రూ.74,998 ధరకు పొందవచ్చు.

వన్‌ప్లస్ 13 :
ఈ వన్‌ప్లస్ 13 ఫోన్ రూ.69,998 ధరకు వస్తుంది. 6.82-అంగుళాల LTPO అమోల్డ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్, 1TB వరకు UFS 4.0 స్టోరేజ్‌ కలిగి ఉంది.

50MP హాసెల్‌బ్లాడ్ ట్రిపుల్ కెమెరా, 8K వీడియో రికార్డింగ్, 6000mAh బ్యాటరీ, సర్కిల్ టు సెర్చ్‌తో గూగుల్ పిక్సెల్ 9 కన్నా ప్రీమియం కెమెరా ఫోన్ కలిగి ఉంది.

Read Also : Realme Narzo 70 Turbo 5G : అమెజాన్‌లో రియల్‌మి 5G ఫోన్‌పై అద్భుతమైన డీల్.. తక్కువ ధరకే ఎలా కొనాలంటే? 

వివో X200 :
వివో X200 ఫోన్ OISతో 50MP ప్రైమరీ సెన్సార్, 3x జూమ్‌కు సపోర్టు ఇచ్చే 50MP టెలిఫోటో లెన్స్, 50MP అల్ట్రావైడ్ కెమెరాతో వస్తుంది.

Zeiss ఆప్టిక్స్, 4K రికార్డింగ్ సామర్థ్యంతో 32MP సెల్ఫీ కెమెరా, గూగుల్ పిక్సెల్ 9 కన్నా ఆకర్షణీయమైన ఫోటోగ్రఫీతో వస్తుంది. ఈ ఫోన్ రూ.65,999కి లభ్యం అవుతోంది.