Honor 400 Pro : హానర్ కొత్త ఫోన్ కేక.. కెమెరా ఫీచర్లు హైలెట్.. మీ బడ్జెట్ ధరలోనే కొనేసుకోండి.. ఫుల్ డిటెయిల్స్..!
Honor 400 Pro : హానర్ కొత్త ఫోన్ చూశారా? మీ బడ్జెట్ ధరలోనే ప్రీమియం ఫీచర్లతో వచ్చేసింది. ఇంతకీ ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయో ఓసారి లుక్కేయండి.

Honor 400 Pro
Honor 400 Pro : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? మీ బడ్జెట్ ధరలోనే కొత్త హానర్ 400 ప్రో వచ్చేసింది. ప్రీమియం డిజైన్, పవర్‌ఫుల్ చిప్‌సెట్, కెమెరా-సెంట్రలైజడ్ ఫీచర్లతో హానర్ 400 ప్రో కెమెరా స్మార్ట్‌ఫోన్‌ను మిడ్ రేంజ్ సెగ్మెంట్లోకి హానర్ రిలీజ్ చేసింది. స్టైలిష్, పర్ఫార్మెన్స్-ఆధారిత కెమెరా-సెంట్రలైజడ్ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్న వినియోగదారులకు ఈ ఫోన్ బెస్ట్ ఫోన్. ఇంతకీ హానర్ 400 ప్రో ఫీచర్లు, ధర వివరాలను ఓసారి పరిశీలిద్దాం..
Read Also : Realme C75 5G : రియల్‌మి లవర్స్‌కు పండగే.. కొత్త రియల్‌మి 5G ఫోన్ చూశారా? ధర ఎంతో తెలిస్తే కొనకుండా ఉండలేరు!
హానర్ 400 ప్రో డిస్‌ప్లే, డిజైన్ :
హానర్ 400 ప్రోలో 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టుతో కూడిన పెద్ద 6.78-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే ఉంది. గ్లాస్ బ్యాక్ డిజైన్‌తో పాటు కర్వడ్ డిస్‌ప్లే కలిగి ఉంది. ఈ ఫోన్ ప్రీమియం ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది.
హానర్ 400 ప్రో పర్ఫార్మెన్స్, స్టోరేజీ :
ఈ హానర్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్ మిడ్-రేంజ్ చిప్‌సెట్‌లను కలిగి ఉంది. రోజువారీ వినియోగానికి గేమింగ్, మల్టీ టాస్కింగ్‌లో పర్ఫార్మెన్స్ అందిస్తుంది. హానర్ 400 ప్రో 12GB ర్యామ్‌తో వస్తుంది. 256GB, 512GB అనే రెండు స్టోరేజీ ఆప్షన్లను అందిస్తుంది. అన్ని యాప్స్, మీడియా ఫైల్స్ కూడా యాక్సస్ చేయొచ్చు.
హానర్ 400 ప్రో కెమెరా, ఫీచర్లు :
హానర్ 400 ప్రో కెమెరా సామర్థ్యాలు ఉన్నాయి. తక్కువ కాంతితో అద్భుతమైన ఫొటోలు క్యాప్చర్ చేయొచ్చు. 200MP సోనీ IMX906 OIS ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. అలాగే, 12MP అల్ట్రా-వైడ్ లెన్స్ ఉంది. కస్టమైజడ్ వైడ్ షాట్‌లను కలిగి ఉంది. ఫ్రంట్ సైడ్ 50MP సెల్ఫీ కెమెరా ఉంది. సెల్ఫీలకు మాత్రమే కాదు.. అద్భుతమైన వీడియోను క్యాప్చర్ చేయొచ్చు.
హానర్ 400 ప్రో బ్యాటరీ, ఛార్జింగ్ :
ఈ ఫోన్‌లో 5300mAh బ్యాటరీ ఉంది. ఒక రోజు కన్నా ఎక్కువ ఛార్జింగ్ వస్తుంది. 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందిస్తుంది. కొన్ని నిమిషాల్లోనే ఫోన్‌ను చాలా వరకు ఛార్జ్ చేయగలదు. దాంతో పాటు 80W వైర్‌లెస్ ఛార్జింగ్, 5W రివర్స్ ఛార్జింగ్ ఆప్షన్ కలిగి ఉంది.
హానర్ 400 ప్రో ధర ఎంతంటే? :
చైనాలో హానర్ 400 ప్రో ఫోన్ 12GB + 256GB వేరియంట్ ధర 2999 యాన్స్ అంటే దాదాపు రూ.35,000కు లభ్యమవుతుంది. 12GB + 512GB వేరియంట్ ధర 3299 యాన్స్ అంటే దాదాపు రూ.38వేలు ఉంటుంది. ఈ ఫోన్ ప్రస్తుతం చైనాలో మాత్రమే అందుబాటులో ఉంది. ప్రపంచవ్యాప్తంగా లాంచ్ అయ్యే అవకాశాలు లేవు. ఒకసారి లాంచ్ అయిన తర్వాత మిడ్-రేంజ్ కేటగిరీలోని ప్రీమియం స్మార్ట్‌ఫోన్లతో అందుబాటులోకి వస్తుంది.
Read Also : Honda Shine 100 : కొత్త బైక్ కావాలా? హోండా షైన్ బైక్ భలే ఉంది భయ్యా.. మైలేజీలో కింగ్.. మీ బడ్జెట్ ధరలోనే..!
హానర్ 400 ప్రో డిజైన్, డిస్‌ప్లే, కెమెరా, బ్యాటరీ ఛార్జింగ్ వంటి ఆప్షన్లతో స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్, ప్రీమియం డిస్‌ప్లే, పవర్‌ఫుల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఈ ఫోన్ బడ్జెట్‌లో పవర్‌ఫుల్, స్టైలిష్ ఫోన్‌ను కోరుకునే యూజర్లకు బెస్ట్ ఆప్షన్. ఫీచర్-రిచ్ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తుంటే హానర్ 400 ప్రోను కొనుగోలు చేయొచ్చు.