Realme C75 5G : రియల్‌మి లవర్స్‌కు పండగే.. కొత్త రియల్‌మి 5G ఫోన్ చూశారా? ధర ఎంతో తెలిస్తే కొనకుండా ఉండలేరు!
Realme C75 5G : కొత్త రియల్‌మి C75 5G ఫోన్ లాంచ్ అయింది. ఈ ఫోన్ అద్భుతమైన ఫీచర్లతో రియల్‌మి అభిమానులను ఆకట్టుకునేలా ఉంది. ఈ ఫోన్ ఫీచర్లు, ధర వివరాలను ఓసారి లుక్కేయండి.

Realme C75 5G
Realme C75 5G : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? రియల్‌మి నుంచి సరికొత్త 5జీ ఫోన్ వచ్చేసింది. గత ఏడాదిలో రియల్‌మి C65 5G తర్వాత రియల్‌మి C75 5G ఫోన్ భారత మార్కెట్లో రిలీజ్ అయింది. ఈ రెండు ఫోన్లు ఒకే డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో రన్ అవుతాయి.
లేటెస్ట్ రియల్‌మి C75లో ఫాస్ట్ ఛార్జింగ్, భారీ బ్యాటరీ, మిలిటరీ-గ్రేడ్ MIL-STD-810H సర్టిఫికేషన్, డస్ట్, వాటర్ నిరోధకతకు IP64 రేటింగ్ ఉన్నాయి. ఈ రియల్‌మి ఫీచర్లు, ధర, లభ్యత వివరాలను ఓసారి పరిశీలిద్దాం.
Read Also : Best 5G Phones : అమెజాన్‌లో రూ. 15వేల లోపు ధరలో బెస్ట్ 5G స్మార్ట్‌ఫోన్లు ఇవే.. ఏ ఫోన్ కొంటారో మీ ఇష్టం..!
రియల్‌మి C75 5G స్పెసిఫికేషన్లు :
రియల్‌మి C75 5G ఫోన్ లిల్లీ స్లిమ్ డిజైన్‌ను కలిగి ఉంది. ఈ రియల్‌మి ఫోన్ కొలతలు 7.94mm కలిగి ఉంది. హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్, 625 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. 6.67-అంగుళాల ఎల్‌సీడీ ప్యానెల్‌ను కలిగి ఉంది. డైమెన్సిటీ 6300 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. 6GB వరకు ర్యామ్, 128GB వరకు ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుంది. స్పెషల్ మైక్రో SD కార్డ్‌ని ఉపయోగించి 2TB వరకు స్టోరేజీ విస్తరించుకోవచ్చు.
ఈ హ్యాండ్‌సెట్ 45W ఛార్జింగ్, 5W రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడిన భారీ 6,000mAh బ్యాటరీని కలిగి ఉంది. కేవలం 10 నిమిషాల ఛార్జ్‌తో 4 గంటల వినియోగాన్ని అందిస్తుంది. ఇమేజింగ్ కోసం 32MP గెలాక్సీకోర్ (GALAXYCORE) GC32E2 AF బ్యాక్ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. సాఫ్ట్‌వేర్ ఫ్రంట్ సైడ్ రియల్‌మి UI 6.0తో ఆండ్రాయిడ్ 15 OSలో రన్ అవుతుంది.
రియల్‌మి C75 5G ధర, సేల్ :
భారత మార్కెట్లో రియల్‌మి C75 5G ఫోన్ (4GB/64GB) మోడల్ ధర రూ. 12,999 నుంచి ప్రారంభమవుతుంది. అయితే, 6GB/128GB వేరియంట్ ధర రూ. 13,999కు లభిస్తోంది. లిల్లీ వైట్, మిడ్‌నైట్ లిల్లీ, పర్పుల్ బ్లోసమ్ షేడ్స్‌లో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్, భారత మార్కెట్లో కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంది.