Realme C75 5G : రియల్‌మి లవర్స్‌కు పండగే.. కొత్త రియల్‌మి 5G ఫోన్ చూశారా? ధర ఎంతో తెలిస్తే కొనకుండా ఉండలేరు!

Realme C75 5G : కొత్త రియల్‌మి C75 5G ఫోన్ లాంచ్ అయింది. ఈ ఫోన్ అద్భుతమైన ఫీచర్లతో రియల్‌మి అభిమానులను ఆకట్టుకునేలా ఉంది. ఈ ఫోన్ ఫీచర్లు, ధర వివరాలను ఓసారి లుక్కేయండి.

Realme C75 5G

Realme C75 5G : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? రియల్‌మి నుంచి సరికొత్త 5జీ ఫోన్ వచ్చేసింది. గత ఏడాదిలో రియల్‌మి C65 5G తర్వాత రియల్‌‌మి C75 5G ఫోన్ భారత మార్కెట్లో రిలీజ్ అయింది. ఈ రెండు ఫోన్లు ఒకే డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో రన్ అవుతాయి.

లేటెస్ట్ రియల్‌మి C75లో ఫాస్ట్ ఛార్జింగ్, భారీ బ్యాటరీ, మిలిటరీ-గ్రేడ్ MIL-STD-810H సర్టిఫికేషన్, డస్ట్, వాటర్ నిరోధకతకు IP64 రేటింగ్ ఉన్నాయి. ఈ రియల్‌మి ఫీచర్లు, ధర, లభ్యత వివరాలను ఓసారి పరిశీలిద్దాం.

Read Also : Best 5G Phones : అమెజాన్‌‌లో రూ. 15వేల లోపు ధరలో బెస్ట్ 5G స్మార్ట్‌ఫోన్లు ఇవే.. ఏ ఫోన్ కొంటారో మీ ఇష్టం..!

రియల్‌మి C75 5G స్పెసిఫికేషన్లు :
రియల్‌మి C75 5G ఫోన్ లిల్లీ స్లిమ్ డిజైన్‌ను కలిగి ఉంది. ఈ రియల్‌మి ఫోన్ కొలతలు 7.94mm కలిగి ఉంది. హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్, 625 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. 6.67-అంగుళాల ఎల్‌సీడీ ప్యానెల్‌ను కలిగి ఉంది. డైమెన్సిటీ 6300 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. 6GB వరకు ర్యామ్, 128GB వరకు ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుంది. స్పెషల్ మైక్రో SD కార్డ్‌ని ఉపయోగించి 2TB వరకు స్టోరేజీ విస్తరించుకోవచ్చు.

ఈ హ్యాండ్‌సెట్ 45W ఛార్జింగ్, 5W రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడిన భారీ 6,000mAh బ్యాటరీని కలిగి ఉంది. కేవలం 10 నిమిషాల ఛార్జ్‌తో 4 గంటల వినియోగాన్ని అందిస్తుంది. ఇమేజింగ్ కోసం 32MP గెలాక్సీకోర్ (GALAXYCORE) GC32E2 AF బ్యాక్ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. సాఫ్ట్‌వేర్ ఫ్రంట్ సైడ్ రియల్‌మి UI 6.0తో ఆండ్రాయిడ్ 15 OSలో రన్ అవుతుంది.

Read Also : BSNL Plan Offer : BSNL బంపర్ ఆఫర్.. 180 రోజుల రీఛార్జ్ ప్లాన్.. అన్‌లిమిటెడ్ కాలింగ్, డేటా బెనిఫిట్స్.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి!

రియల్‌మి C75 5G ధర, సేల్ :
భారత మార్కెట్లో రియల్‌మి C75 5G ఫోన్ (4GB/64GB) మోడల్‌ ధర రూ. 12,999 నుంచి ప్రారంభమవుతుంది. అయితే, 6GB/128GB వేరియంట్ ధర రూ. 13,999కు లభిస్తోంది. లిల్లీ వైట్, మిడ్‌నైట్ లిల్లీ, పర్పుల్ బ్లోసమ్ షేడ్స్‌లో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్, భారత మార్కెట్లో కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంది.