Best 5G Phones : అమెజాన్‌లో రూ. 15వేల లోపు ధరలో బెస్ట్ 5G స్మార్ట్‌ఫోన్లు ఇవే.. ఏ ఫోన్ కొంటారో మీ ఇష్టం..!
Best 5G Phones : అమెజాన్ సమ్మర్ సేల్ సందర్భంగా అనేక బ్రాండ్ల స్మార్ట్ ఫోన్లపై అదిరే డిస్కౌంట్లను అందిస్తోంది. రూ.15వేల లోపు ధరలో బెస్ట్ 5జీ ఫోన్లను ఎలా కొనుగోలు చేయాలంటే?

Best 5G Phones
Best 5G Phones : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2025 అద్భుతమైన ఆఫర్లను అందిస్తోంది. తక్కువ ధరలో కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలంటే ఇదే సరైన సమయం. శాంసంగ్, ఐక్యూ, రియల్‌మి, లావా, రెడ్‌మి వంటి టాప్ బ్రాండ్లు బడ్జెట్ ఆఫర్లతో ఆకర్షణీయమైన డిస్కౌంట్లను అందిస్తున్నాయి. ఈ లిమిటెడ్ సేల్‌లో టాప్ బడ్జెట్-ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ ఆఫర్ల గురించి ఓసారి లుక్కేయండి.
Read Also : Realme Narzo 70 Turbo 5G : అమెజాన్‌లో రియల్‌మి 5G ఫోన్‌పై అద్భుతమైన డీల్.. తక్కువ ధరకే ఎలా కొనాలంటే?
శాంసంగ్ గెలాక్సీ M06 5G ఆఫర్ :
శాంసంగ్ గెలాక్సీ M06 5G అసలు ధర రూ. 12,499 నుంచి రూ.7,799కి పడిపోయింది. 422K+ AnTuTu రేటింగ్‌తో మీడియాటెక్ డైమన్షిటీ 6300 ప్రాసెసర్‌తో వస్తుంది. ఈ ఫోన్ 12 5G బ్యాండ్‌లను సపోర్ట్ చేయగలదు.
ఆండ్రాయిడ్ 15, వన్ యూఐ 7.0తో వస్తుంది. 2.4GHz ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో వస్తుంది. 50MP మెయిన్ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్, 8MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. 5000mAh బ్యాటరీకి 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. స్లిమ్ 8.0mm బాడీలో వస్తుంది. కొనుగోలుదారులు 4 జనరేషన్ ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, నాక్స్ సెక్యూరిటీ కూడా పొందవచ్చు.
ఐక్యూ Z9x 5G డిస్కౌంట్ :
ఐక్యూ Z9x 5G టోర్నాడో గ్రీన్ ఫోన్ ఇప్పుడు రూ.17,499 నుంచి తగ్గి రూ.13,249 ధరకు అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్ ఉంది. అద్భుతమైన 560K+ AnTuTu రేటింగ్‌తో వస్తుంది. ఈ మోడల్ పవర్‌ఫుల్ 6000mAh బ్యాటరీని కలిగి ఉంది.
ఇది కేవలం 7.99mm మందంతో కలిపి 44W ఫ్లాష్‌ఛార్జ్‌ను అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఫన్‌టచ్ OS 14 ఉపయోగిస్తుంది. దీర్ఘకాలిక బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. బ్యాంకుల ఆఫర్లు, కూపన్‌లతో మరిన్ని సేవింగ్స్ పొందవచ్చు.
రియల్‌మి నార్జో 70 టర్బో 5G డీల్ :
రియల్‌మి నార్జో 70 టర్బో 5G ఫోన్ ఇప్పుడు రూ. 19,999 నుంచి రూ. 13,499కు తగ్గింది. ఈ మోడల్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ ప్రాసెసర్‌ను కలిగి ఉంది. 750K AnTuTu మార్కుతో వస్తుంది. ఏఐ బూస్ట్ 2.0, లాగ్-ఫ్రీ గేమింగ్, లాంగ్ టైమ్ పర్ఫార్మెన్స్ కోసం 9-లేయర్ వేపర్ కూలింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంది. మోటార్‌స్పోర్ట్ ఫోన్ 6GB ర్యామ్, 128GB స్టోరేజ్‌తో వస్తుంది. గేమర్‌లు, పర్ఫార్మెన్స్ ఔత్సాహికులకు బెస్ట్ అని చెప్పొచ్చు. కస్టమర్లు అదనపు కూపన్లు, బ్యాంక్ ఆఫర్లను పొందే అవకాశం ఉంది.
లావా బ్లేజ్ 5G ధర తగ్గింపు :
అమెజాన్ సమ్మర్ సేల్‌లో లావా బ్లేజ్ 5G కేవలం రూ. 8,999 ధరకే లభిస్తుంది. 6GB ర్యామ్, 128GB స్టోరేజ్, 6.5-అంగుళాల HD+ స్క్రీన్‌తో వస్తుంది. ఆండ్రాయిడ్ 13 ఆధారంగా రూపొందించారు. మీడియాటెక్ డైమన్షిటీ 6020 ప్రాసెసర్ ద్వారా రన్ అవుతుంది. SA/NSA 5G బ్యాండ్ సపోర్ట్‌తో వస్తుంది. 50MP ఏఐ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 5000mAh బ్యాటరీని కూడా కలిగి ఉంది.
రెడ్‌మి 13C 5G సమ్మర్ డిస్కౌంట్ :
ప్రస్తుతం ఈ సేల్‌లో రెడ్‌మి 13C 5G ఫోన్ రూ. 10,499 ధరకు లభిస్తుంది. 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.74-అంగుళాల HD+ స్క్రీన్‌ను కలిగి ఉంది. మీడియాటెక్ డైమన్షిటీ 6100+ చిప్‌తో వస్తుంది. ఈ ఫోన్ 50MP ఏఐ కెమెరా, 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.
ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా MIUI 14ను కలిగి ఉంది. స్టేబుల్ పర్ఫార్మెన్స్, బ్యాటరీ బ్యాకప్‌తో రూ. 11వేల కన్నా తక్కువ ధరలో ఆల్ రౌండర్ 5G స్మార్ట్‌ఫోన్‌ను కోరుకునే వారికి బెస్ట్ ఫోన్ అని చెప్పవచ్చు.