5 Best Vivo Phones (Image Credit To Original Source)
5 Best Vivo Phones : వివో లవర్స్ కోసం అద్భుతమైన ఫోన్లు.. ఈ జనవరిలో వివో నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. కొత్త వివో ఫోన్ కొనాలని చూస్తుంటే ఇది మీకోసమే. రూ. 20వేల లోపు ధరలో 5 బెస్ట్ వివో ఫోన్లను అందిస్తున్నాం.. ఇందులో మీకు నచ్చిన వివో ఫోన్ ఇంటికి తెచ్చుకోండి..
వివో T4X (రూ. 14,999) :
వివో T4Xలో 8MP సెల్ఫీ కెమెరా, డ్యూయల్ 50MP కెమెరా ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్, 1050 నిట్స్ (HBM)తో 6.72-అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమన్షిటీ 7300 చిప్‌సెట్, ఫన్‌టచ్ 15పై రన్ అవుతుంది. 6500mAh బ్యాటరీ, 44W ఛార్జింగ్ సపోర్ట్ అందిస్తుంది.
వివో Y31 5G (రూ. 16,999) :
వివో Y31 5G ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ (HBM)తో 6.68-అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో వస్తుంది. స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2తో ఫన్‌టచ్ 15పై రన్ అవుతుంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే.. 8MP సెల్ఫీ కెమెరా, 50MP రియర్ కెమెరా ఉంది. ఈ వివో ఫోన్ 6500mAh బ్యాటరీ, 44W ఛార్జింగ్ సపోర్టు చేస్తుంది.
వివో Y31 ప్రో (రూ. 19,999) :
వివో Y31 ప్రో 50MP రియర్ కెమెరాతో 8MP సెల్ఫీ కెమెరా అందిస్తుంది. మీడియాటెక్ డైమన్షిటీ 7300 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. 6.72-అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫన్‌టచ్ 15పై రన్ అవుతుంది. 120Hz రిఫ్రెష్ రేట్, 960Hz PWM, 1050 నిట్స్ (HBM)ను అందిస్తుంది. 44W ఛార్జింగ్ సపోర్టుతో 6500mAh బ్యాటరీని అందిస్తుంది.
5 Best Vivo Phones (Image Credit To Original Source)
వివో T3 (రూ. 18,499)
వివో T3లో 50MP కెమెరా లెన్స్, 16MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఈ యూనిట్ 6.67-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే రన్ అవుతుంది. 120Hz రిఫ్రెష్ రేట్, 1800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో రన్ అవుతుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. ఫన్‌టచ్ 14పై రన్ అవుతుంది. ఈ వివో ఫోన్ 5000mAh బ్యాటరీ, 44W ఛార్జింగ్‌తో వస్తుంది.
వివో Y300 ప్లస్ (రూ. 23,999) :
5000mAh బ్యాటరీ, 44W ఛార్జింగ్‌తో వివో Y300 ప్లస్ స్నాప్‌డ్రాగన్ 695 5G ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది. ఫన్‌టచ్ 14పై రన్ అవుతుంది. ఈ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు అమోల్డ్‌తో 6.78 అంగుళాల డిస్‌ప్లే సపోర్ట్ చేస్తాయి. 120Hz రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ అందిస్తుంది.