×
Ad

సై అంటే సై.. Iphone 17కి పోటీ ఇచ్చే 5 ఆండ్రాయిడ్ ఫోన్లు.. ఫీచర్లలో ఆపిల్ తో ఢీ అంటే ఢీ..

Latest Mobile Phones : ఐఫోన్ 17 కొనడం కన్నా ఆండ్రాయిడ్ ఫోన్లను కొనసుకోవడం బెటర్. ప్రస్తుతం భారతీయ మార్కెట్లో ఐఫోన్ 17కు మించిన 5 స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి..

Latest Mobile Phones

Latest Mobile Phones : కొత్త ఆపిల్ ఐఫోన్ 17 కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ఐఫోన్ 17 కన్నా బెటర్ ఫీచర్లతో భారతీయ మార్కెట్లో సరికొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఐఫోన్ 17 స్పెషిఫికేషన్లతో యూజర్లను ఆకట్టుకునేలా ఉంటుంది. కానీ, ఇదే ధరకు ఇతర ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లు మెరుగైన స్పెసిఫికేషన్‌లతో అందుబాటులో ఉన్నాయి.

కెమెరా ఫీచర్లు, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో (Latest Mobile Phones) అత్యంత ఆకర్షణీయంగా ఉన్నాయి. మీరు కూడా ఐఫోన్ 17 బదులుగా ఆండ్రాయిడ్ ఫోన్ కొనాలనుకుంటే ఇది మీకోసమే.. ప్రస్తుతం మార్కెట్లో ఒప్పో ఫైండ్ X9 నుంచి ఇటీవలే లాంచ్ అయిన రియల్‌మి జీటీ 8 ప్రో వరకు కొనుగోలు చేయగల 5 లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ల లిస్టును మీకోసం అందిస్తున్నాం.. ఇందులో మీకు నచ్చిన ఆండ్రాయిడ్ ఫోన్ కొనేసుకోండి.

ఒప్పో ఫైండ్ X9 (రూ. 74,999) :

ఒప్పో ఫైండ్ X9 ఫోన్ భారీ 7025mAh బ్యాటరీని కలిగి ఉంది. 1B రంగులు, 120Hz రిఫ్రెష్ రేట్, 3600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ అందించే 6.59-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. బ్యాక్ సైడ్ ట్రిపుల్ 50MP కెమెరా సెటప్‌ కలిగి ఉంది.

వన్‌ప్లస్ 15 (రూ. 72,999) :
వన్‌ప్లస్ 15లో 1B కలర్స్‌తో 6.78-అంగుళాల ఎల్టీపీఓ అమోల్డ్ డిస్‌ప్లే, 165Hz రిఫ్రెష్ రేట్, బ్యాక్ సైడ్ ట్రిపుల్ 50MP కెమెరా సెటప్ ఉన్నాయి. 120W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే భారీ 7300mAh బ్యాటరీని కూడా కలిగి ఉంది.

Read Also : Camera Phones : ఒప్పో ఫైండ్ X9 ప్రో కన్నా ఖతర్నాక్ ఫీచర్లతో 6 బెస్ట్ కెమెరా ఫోన్లు ఇవే.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి!

​శాంసంగ్ గెలాక్సీ S25 ఎఫ్ఈ (రూ. 65,999) :
శాంసంగ్ గెలాక్సీ S25 ఎఫ్ఈ ట్రిపుల్-కెమెరా సెటప్, 50MP వెడల్పు, 8MP టెలిఫోటో, 12MP అల్ట్రావైడ్ సెన్సార్‌ కలిగి ఉంటుంది. ఎక్సినోస్ 2400 ప్రాసెసర్‌తో 44W వైర్డ్ ఛార్జింగ్‌తో 4900mAh బ్యాటరీని కలిగి ఉంది.

గూగుల్ పిక్సెల్ 10 ప్రో (రూ. 67,850) :
గూగుల్ పిక్సెల్ 10 ప్రో 6.3-అంగుళాల ఎల్టీపీఓ ఓఎల్ఈడీ డిస్‌ప్లే కలిగి ఉంది. గరిష్ట ప్రకాశం 3300 నిట్స్ 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంది. ట్రిపుల్-కెమెరా సిస్టమ్‌, 50MP వెడల్పు, 48MP అల్ట్రావైడ్, 48MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ కలిగి ఉంది. ఈ పిక్సెల్ ఫోన్ గూగుల్ టెన్సర్ G5 ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది. 30W వైర్డ్ ఛార్జింగ్‌తో 4870mAh బ్యాటరీని కలిగి ఉంది.

రియల్‌మి జీటీ 8 ప్రో (రూ. 72,999) :
రియల్‌మి లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ రియల్‌మి GT 8 ప్రోను ప్రవేశపెట్టింది. ఇందులో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ అందించే 6.79-అంగుళాల ఎల్టీపీఓ అమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంది. ఈ ఫోన్ 1B రంగులు, 144Hz రిఫ్రెష్ రేట్ 7000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ అందిస్తుంది. ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. 50MP + 50MP + 200MP బ్యాక్ కెమెరా సెటప్‌ కలిగి ఉంది.