Camera Phones : ఒప్పో ఫైండ్ X9 ప్రో కన్నా ఖతర్నాక్ ఫీచర్లతో 6 బెస్ట్ కెమెరా ఫోన్లు ఇవే.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి!

Camera Phones : ఒప్పో ఫైండ్ X9 ప్రో కన్నా బెటర్ ఫీచర్లతో 6 కెమెరా ఫోన్లు లభ్యమవుతున్నాయి. ఇందులో ఏ స్మార్ట్ ఫోన్ కొంటారో కొనేసుకోండి.

Camera Phones : ఒప్పో ఫైండ్ X9 ప్రో కన్నా ఖతర్నాక్ ఫీచర్లతో 6 బెస్ట్ కెమెరా ఫోన్లు ఇవే.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి!

6 Camera Phones

Updated On : November 21, 2025 / 3:30 PM IST

Camera Phones : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? ఒప్పో లేటెస్ట్ ఫైండ్ X9 సిరీస్‌ లాంచ్ అయింది. ఈ ప్రో వేరియంట్ అద్భుతమైన కెమెరాలను కలిగి ఉన్నప్పటికీ, ఒప్పో ఫైండ్ X9 ప్రోతో పోటీ పడగల అనేక పవర్‌ఫుల్ కెమెరా ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి.

ఇందులో వివో X200 ప్రో, ఐఫోన్ 16 ప్రో, శాంసంగ్ (Camera Phones) గెలాక్సీ S25 అల్ట్రా, గూగుల్ పిక్సెల్ 10 ప్రో, వన్‌ప్లస్ 15, ఐఫోన్ 17 వంటి బెస్ట్ కెమెరా ఫోన్‌లు లభ్యమవుతున్నాయి. కెమెరా ఫీచర్ల కోసం చూస్తుంటే ఈ 6 ఫోన్లలో మీకు నచ్చిన ఏదైనా స్మార్ట్‌ఫోన్ కొనేసుకోవచ్చు.

వివో X200 ప్రో (రూ. 94,999) :
వివో X200 ప్రోలో 50MP+200MP+50MP బ్యాక్ కెమెరా సెటప్, 32MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఎక్కువ గంటల కోసం 6000mAh బ్యాటరీని కలిగి ఉంది. అద్భుతమైన పర్ఫార్మెన్స్ కోసం డైమన్షిటీ 9400 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లోని జీసెస్ ఆప్టిక్స్ టెక్నాలజీ ఒప్పో ఫైండ్ X9 ప్రోకి గట్టి పోటీని ఇస్తుంది.

ఐఫోన్ 16 ప్రో (రూ. 1,09,900) :

ఆపిల్ ఐఫోన్ 16 ప్రో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.3-అంగుళాల ఎల్టీపీఓ సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో వస్తుంది. ఆపిల్ A18 ప్రో చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. 48MP ప్రైమరీ షూటర్, 48MP అల్ట్రా-వైడ్-యాంగిల్ షూటర్ 12MP పెరిస్కోప్ టెలిఫోటో షూటర్‌, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ కలిగి ఉంటుంది. 3582mAh బ్యాటరీతో పాటు 25W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌ కలిగి ఉంది.

Read Also : Flipkart Black Friday Sale 2025 : వావ్.. ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ డేట్ ఇదిగో.. స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లపై డిస్కౌంట్లే డిస్కౌంట్లు.. గెట్ రెడీ..!

శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా (రూ. 1,09,999) :
శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ఫోన్ బ్యాక్ సైడ్ క్వాడ్-కెమెరా సెటప్‌ కలిగి ఉంది. ఇందులో 200MP వైడ్, 10MP టెలిఫోటో, 50MP పెరిస్కోప్ టెలిఫోటో, 50MP అల్ట్రావైడ్ సెన్సార్ ఉన్నాయి. ఇంకా, 5000mAh బ్యాటరీ కలిగి ఉంది. బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో ఇదొకటిగా చెప్పొచ్చు.

గూగుల్ పిక్సెల్ 10 ప్రో (రూ. 1,09,999) :
గూగుల్ పిక్సెల్ 10 ప్రో 50MP వైడ్, 48MP పెరిస్కోప్ టెలిఫోటో, 48MP అల్ట్రావైడ్ సెన్సార్‌లతో కూడిన ట్రిపుల్-కెమెరా సెటప్‌తో వస్తుంది. ఈ యూనిట్ 42MP సెల్ఫీ కెమెరాతో బెస్ట్ సెల్ఫీలను క్యాప్చర్ చేయొచ్చు.అద్భుతమైన వ్యూ కోసం 6.3-అంగుళాల ఎల్టీపీఓ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంది.

వన్‌ప్లస్ 15 (రూ. 72,999) :
ఈ వన్‌ప్లస్ 15 ఫోన్ బ్యాక్ సైడ్ 50MP ట్రిపుల్-కెమెరా సెటప్‌తో వస్తుంది. వన్‌ప్లస్ 15 మోడల్ 1B కలర్ ఆప్షన్లతో 6.78-అంగుళాల ఎల్టీపీఓ అమోల్డ్ డిస్‌ప్లే, 165Hz రిఫ్రెష్ రేట్‌ కలిగి ఉంది. ఇంకా, 120W వైర్డ్ ఛార్జింగ్‌తో భారీ 7300mAh బ్యాటరీని కలిగి ఉంది.

ఐఫోన్ 17 (రూ. 82,900) :
ఐఫోన్ 17 మోడల్ iOS 19తో 48MP వైడ్, 48MP అల్ట్రా-వైడ్ బ్యాక్ కెమెరా సెన్సార్లను కలిగి ఉంది. అద్భుతమైన పోర్ట్రెయిట్‌ల కోసం HDR డాల్బీ విజన్ HDR, 18MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. 25W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 3692mAh బ్యాటరీని కలిగి ఉంది.