Flipkart Black Friday Sale 2025 : వావ్.. ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ డేట్ ఇదిగో.. స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లపై డిస్కౌంట్లే డిస్కౌంట్లు.. గెట్ రెడీ..!

Flipkart Black Friday Sale 2025 : అతి త్వరలో ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ ప్రారంభం కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లపై అదిరిపోయే డిస్కౌంట్లు అందుబాటులో ఉండనున్నాయి..

Flipkart Black Friday Sale 2025 : వావ్.. ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ డేట్ ఇదిగో.. స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లపై డిస్కౌంట్లే డిస్కౌంట్లు.. గెట్ రెడీ..!

Flipkart Black Friday Sale 2025

Updated On : November 21, 2025 / 3:10 PM IST

Flipkart Black Friday Sale 2025 : కొత్త స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్స్ కొనేందుకు చూస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ 2025 కొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. కంపెనీ స్పెషల్ మైక్రోసైట్ ద్వారా ఈ సేల్ ఈవెంట్‌ను ప్రకటించింది. “బ్యాగ్ ది బిగ్గెస్ట్ డీల్స్” అనే ట్యాగ్‌లైన్‌తో బ్లాక్ ఫ్రైడే సేల్ 2025 స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సిస్టమ్‌లు, టీవీలు, ల్యాప్‌టాప్‌లు, పీసీలు, వాషింగ్ మెషీన్‌లు, రిఫ్రిజిరేటర్‌లు వంటి వివిధ ఎలక్ట్రానిక్‌లను తగ్గింపు ధరలకు అందించనుంది.

గాడ్జెట్‌లతో పాటు, ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ (Flipkart Black Friday Sale 2025) దుస్తులు, రోజువారీ నిత్యావసరాలు, గృహాలంకరణ వస్తువులను కూడా తగ్గింపు ధర ట్యాగ్‌లతో లిస్టు చేసింది. అంతేకాకుండా, ఫ్లిప్‌కార్ట్ పోటీదారు అమెజాన్ కూడా బ్లాక్ ఫ్రైడే సేల్ ఈవెంట్‌ను అతి త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.

ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ ఈవెంట్ 2025 :
ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ 2025 నవంబర్ 23న ప్రారంభమవుతుందని ప్రకటించింది. ఈ సేల్ ఈవెంట్ కోసం స్పెషల్ మైక్రోసైట్ ఇప్పుడు కంపెనీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. ఈ సేల్ వ్యవధిలో తగ్గింపు ధరకు లభించే ప్రొడక్టుల కేటగిరీలను వెల్లడించింది.

రాబోయే ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ 2025 సందర్భంగా శాంసంగ్ ఎల్జీ వంటి బ్రాండ్‌ల నుంచి ఫోన్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, టీవీలు, హోమ్ థియేటర్లు, వాషింగ్ మెషీన్లు, హోం అప్లియన్సెస్, పీసీలు, ల్యాప్‌టాప్‌లు, ఎయిర్ కండిషనర్లు, ప్రింటర్లు, మిక్సర్లు, ఫ్యాన్లు, డిష్‌వాషర్లు రిఫ్రిజిరేటర్లు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులు తక్కువ ధరలకు అందుబాటులో ఉండనున్నాయి.

Read Also : Black Friday Sale 2025 : బ్లాక్ ఫ్రైడే సేల్ ఆఫర్.. గూగుల్ పిక్సెల్ 10 ప్రోపై ఖతర్నాక్ డిస్కౌంట్.. ఆర్డర్ పెట్టడమే ఆలస్యం..!

ఆసక్తిగల వినియోగదారులు యూపీఐ, క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డుల ద్వారా పేమెంట్లు చేయొచ్చు. పూర్తి మొత్తాన్ని ముందుగానే చెల్లించకుండా ఈఎంఐ ప్లాన్‌ ఎంచుకునే అవకాశం ఉంది. ఈ సేల్ ఈవెంట్ సమయంలో ముందస్తు డిస్కౌంట్లను పొందవచ్చు. అంతేకాకుండా, ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ 2025 బ్యానర్ ప్రకటనలో ఆసుస్ క్రోమ్‌బుక్ ల్యాప్‌టాప్ అందుబాటులో ఉంది. ఈ సేల్ ఈవెంట్ సమయంలో తక్కువ ధరకు కొనేసుకోవచ్చు.

శీతాకాలానికి అవసరమైన ఎలక్ట్రానిక్స్, రూమ్ హీటర్లు, గీజర్లు వంటివి తగ్గింపు ధరకు లభిస్తాయి. అయితే, క్రెడిట్, డెబిట్ కార్డ్ డిస్కౌంట్‌ల కోసం పార్టనర్ బ్యాంకుల పేర్లను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. రాబోయే రోజుల్లో మరిన్ని వివరాలు ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఫ్లిప్‌కార్ట్ సేల్ ఈవెంట్ తేదీని వెల్లడించింది. అమెజాన్ త్వరలో బ్లాక్ ఫ్రైడే సేల్ 2025ని కూడా ప్రకటించవచ్చు. ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్ 2025 తర్వాత ఫ్లిప్‌కార్ట్ ఫస్ట్ మెయిన్ సేల్ ప్రారంభం కానుంది.