Google Pixel 9a : కొత్త గూగుల్ పిక్సెల్ 9a ఫోన్ కొనాలని అనుకుంటున్నారా? అయితే, మీకోసం అంతే స్థాయిలో అద్భుతమైన ఫీచర్లతో మరెన్నో ఆండ్రాయిడ్ ఫోన్లు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. మీ బడ్జెట్ రూ. 50వేలు అయితే పిక్సెల్ 9a కన్నా బెటర్ ఫీచర్లు కలిగిన ఫోన్లు కొనేసుకోవచ్చు. అందులో ముఖ్యంగా రూ. 50వేల ధరకు లభించే గూగుల్ పిక్సెల్ 9aలో 48MP ప్రైమరీ కెమెరా, 5100mAh బ్యాటరీ ఉన్నాయి. ఇదే ధరలో మెరుగైన ఫీచర్లను అందించే కొన్ని స్మార్ట్‌ఫోన్లను మీకోసం అందిస్తున్నాం.. ఇందులో మీకు నచ్చిన స్మార్ట్ ఫోన్ కొనేసుకోండి.
2/6
శాంసంగ్ గెలాక్సీ A56 (రూ. 38,999) : శాంసంగ్ గెలాక్సీ A56 ఫోన్ 1900 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.7-అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ కలిగి ఉంది. కెమెరా విషయానికొస్తే.. ఈ యూనిట్ ట్రిపుల్ 50MP + 12MP + 5MP బ్యాక్ కెమెరా, 12MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంది. 45W వైర్డ్ ఛార్జర్‌తో 5000mAh బ్యాటరీ కలిగి ఉంది. అద్భుతమైన పర్ఫార్మెన్స్, లాంగ్ బ్యాటరీ లైఫ్ కూడా అందిస్తుంది. గూగుల్ పిక్సెల్ 9a మాదిరిగా ఈ శాంసంగ్ గెలాక్సీ A56 ఫీచర్లు ఆకట్టుకునేలా ఉంటాయి.
3/6
గూగుల్ పిక్సెల్ 8a (రూ. 22,799) : గూగుల్ పిక్సెల్ 8a ఫోన్ 6.1-అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లే, 64MP+13MP మాదిరిగా 13MP సెల్ఫీ కెమెరాతో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంది. ఈ యూనిట్ గూగుల్ టెన్సర్ G3 చిప్‌సెట్‌తో అదిరిపోయే పర్ఫార్మెన్స్ అందిస్తుంది. మొత్తంమీద, గూగుల్ పిక్సెల్ 8ఎ కెమెరా ఫీచర్లు, ధర పరంగా గూగుల్ పిక్సెల్ 9aతో గట్టి పోటీనిస్తోంది.
4/6
శాంసంగ్ గెలాక్సీ S24 (రూ. 41,879) : శాంసంగ్ గెలాక్సీ S24 ఫోన్ ట్రిపుల్ 50MP + 10MP + 12MP కెమెరా, 12MP ఫ్రంట్ కెమెరాతో అద్భుతమైన ఫొటోలు, సెల్ఫీలతో క్యాప్చర్ చేయొచ్చు. స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 3 లేదా ఎక్సినోస్ 2400 చిప్‌సెట్ కలిగి ఉంది. 4000mAh బ్యాటరీతో గూగుల్ పిక్సెల్ 9a కన్నా అద్భుతంగా ఉంటుంది.
5/6
వన్‌ప్లస్ 13R (రూ. 37,869) : ఈ ఏడాదిలో వన్‌ప్లస్ 13R ఫోన్ లాంచ్ అయింది. 6.78-అంగుళాల పెద్ద ఎల్టీపీఓ 4.1 అమోల్డ్ డిస్‌ప్లే అందిస్తుంది. డ్యూయల్ 50MP బ్యాక్ కెమెరా, 8MP అల్ట్రావైడ్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన ఫొటోలను క్యాప్చర్ చేస్తుంది. 6000mAh బ్యాటరీతో ఈ యూనిట్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 కలిగి ఉంది. గూగుల్ పిక్సెల్ 9a కన్నా అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది.
6/6
రెడ్‌మి నోట్ 14 ప్రో ప్లస్ (రూ. 31,998) : సెల్ఫీ ప్రియుల కోసం రెడ్‌మి నోట్ 14 ప్రో ప్లస్ డ్యూయల్ 50MP + 8MP బ్యాక్ కెమెరా 20MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 6200mAh బ్యాటరీతో వస్తుంది. ఈ యూనిట్ గూగుల్ పిక్సెల్ 9aతో పోలిస్తే అద్భుతమైన పర్ఫార్మెన్స్, ఆకర్షణీయమైన కెమెరా ఫీచర్లను అందిస్తుంది.