5 Most Affordable Bikes : అత్యంత సరసమైన ధరలో 5 సూపర్ బైకులు..!
కొత్త బైక్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? భారత మార్కెట్లో ఏ కొత్త మోడల్ వస్తుందా? అని ఎదురుచూస్తున్నారా? 2021 ఏడాదిలో భారత మార్కెట్లోకి అత్యంత సరసమైన ధరకే సూపర్ బైకులు వచ్చేశాయి.

5 Most Affordable Bikes In India 2021, Hero Hf Deluxe To Bajaj Ct100
5 Most Affordable Bikes In India 2021 : కొత్త బైక్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? భారత మార్కెట్లో ఏ కొత్త మోడల్ వస్తుందా? అని ఎదురుచూస్తున్నారా? 2021 ఏడాదిలో భారత మార్కెట్లోకి అత్యంత సరసమైన ధరకే సూపర్ బైకులు వచ్చేశాయి. ప్రపంచంలో అతిపెద్ద టూ వీలర్స్ మార్కెట్లలో భారత్ ఒకటి.. మేజార్టీ బైక్ సేల్స్ ఎక్కువగా సరసమైన ధరకే వినియోగదారులు కొనుగొలు చేస్తుంటారు. రానురాను మోటార్ సైకిళ్లకు భారీ డిమాండ్ పెరిగిపోతోంది. అధిక సంఖ్యలో సేల్స్ అవుతున్నాయి. అలాగే బైకుల ధరలు కూడా ఇటీవలే పెరిగాయి. భారత మార్కెట్లో ప్రస్తుతం అత్యంత సరసమైన ధరకే సూపర్ బైకులు అందుబాటులో ఉన్నాయి. అందులో మీకోసం ఐదు అత్యంత సరసమైన బైకుల జాబితాను అందిస్తున్నాం.. మీకు నచ్చిన బైకు ఏదో ఎంపిక చేసుకుని కొనుగోలు చేసుకోవచ్చు.
1. Bajaj CT 100 :
భారత మార్కెట్లో బజాజ్ కంపెనీ ఆఫర్ చేసే పాపులర్ మోడల్.. Bajaj CT 100.. అత్యంత సరసమైన ధరకే లభిస్తోంది. దీని కనీస ధర రూ.47,654 (ఎక్స్-షోరూం, ఢిల్లీ)లకే అందుబాటులో ఉంది. ఎంట్రీ లెవల్ బైకుల్లో స్టయిలీష్ లుకింగ్, భారీ మైలేజీ ఇచ్చే బైక్ ఇది. 102cc 4స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ తో వచ్చింది. 7.9 PS పవర్ తో పాటు 8.34Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 4-స్పీడ్ ట్రాన్స్ మిషన్ ఇంజిన్ ఇది. బజాబ్ కంపెనీ CT 100 మూడు పెయింట్ స్కీమ్‌లలో ఆఫర్ చేస్తోంది. Gloss Ebony Black మోడల్ Blue Decalsతో రాగా.. Matte Olive Green మోడల్ Yellow Decals, Gloss Flame Red మోడల్ Bright Red Decalsతో వచ్చింది.
2. Hero HF Deluxe :
హీరో మోటార్ కార్పొరేషన్ కంపెనీ అందించే హీరో బైక్ లైనప్‌లో బెస్ట్ సెల్లింగ్ మోటార్ సైకిళ్లలో Hero HF Deluxe మోడల్ ఒకటి.. డిసెంబర్ 2020లో భారత మార్కెట్లో అత్యంత అమ్ముడైన రెండో మోడల్ బైక్ కూడా ఇదే.. అదే నెలలో 1.4 లక్షల యూనిట్లను హీరో విక్రయించింది. ఈ మోడల్ బైక్ 97.2cc మోటార్ ఇంజిన్ తో వచ్చింది. 8PS వరకు గరిష్ట శక్తిని అందిస్తుంది. 8.05Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ వేరియంట్ కనీసం ధర రూ.51,200 వరకు ఉంది. టాప్ ఎండ్ సెల్ఫ్ స్టార్ట్ i3 ట్రిమ్ లెవల్ ధర రూ.61,225 (ఎక్స్ షోరూం, ఢిల్లీ) వరకు ఉంటుంది.
3. Bajaj CT 110 :
బజాజ్ ప్రీమియం వెర్షన్లలో CT 110 మోడల్ బైక్ ఒకటి. ప్రీమియం ఫీచర్లు కలిగిన బైక్ మోడల్స్ కొరుకునే కొనుగోలుదారులకు ఈ మోడల్ ఓసారి ట్రై చేయొచ్చు. కాకుంటే ధర కొంచెం ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. ఈ బైకులో LED DRL, రబ్బర్ ట్యాంక్ ప్యాడ్, బాష్ ప్లేట్, థిక్ ప్యాడెడ్ సీట్‌తో పాటు పై వంపుతిరిగిన సైలెన్సర్ కూడా ఉంది. Bajaj CT 110 మోడల్ బైకులో 115.45cc ఇంజిన్, 4 స్ట్రోక్ సింగిల్ సిలిండర్ మోటార్, 7,000rpm వద్ద 8.6 PS శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అలాగే 5,000rpmతో 9.81 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ప్రస్తుతం దీని ధర (ఎక్స్ షోరూం, ఢిల్లీ)లో రూ.54,318లకు అందుబాటులో ఉంది.
4. TVS Sport :
గత ఏడాది ఏప్రిల్ నెలలోనే BS6 TVS Sport మోడల్ బైక్ మార్కెట్లోకి వచ్చింది. సరికొత్త లుక్ తో 109.7cc సింగిల్ సిలిండర్ ఇంజిన్ తో వచ్చింది. 8.29 PS శక్తితో పాటు 8.7 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. BS4 నుంచి BS 6 ఉద్గార ప్రమాణాలతో వచ్చిన ఈ బైకులో ట్యూబ్ లెస్ టైర్లు, గ్రౌండ్ క్లియరెన్స్, ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఎంట్రీ లెవల్ వేరియంట్ లో వచ్చిన ఈ బైక్ కనీస ధర 56,100 ఉండగా.. రూ. 62,950 (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) వరకు ఉంది.
5. Bajaj Platina 100 :
ఈ బజాజ్ ప్లాటినా 100 మోడల్ బైక్.. ప్రస్తుతం.. డ్రమ్ బ్రేక్, డిస్క్ బ్రేక్ అనే రెండు ట్రిమ్ వెర్షన్‌లలో అందుబాటులో ఉంది. ఈ రెండు వేరియంట్ల కనీస ధర రూ.59,859 ఉండగా.. ఢిల్లీలో ఎక్స్ షోరూం ధర రూ.63,578లకు అందుబాటులో ఉంది. అలాగే దీని ఇంజిన్ 102cc 4-స్ట్రోక్, DTS-i, సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో 7,500rpm వద్ద 7.9PS గరిష్టంగా శక్తిని అందిస్తుంది. 5,500rpm స్పీడ్ వద్ద 8.3Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ మోడల్ ఫస్ట్ ఇన్ క్లాస్ నైట్రాక్స్ రియర్ సస్పెన్సన్ తో వచ్చింది. ఇందులో ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఆప్షనల్ గా ఉంది. అలాగే LED, DRL, ట్యాక్ ప్యాడ్స్, కంపర్ట్ గా ఉండే సీటు, కాలు పెట్టుకోవడానికి వీలుగా వైడ్ రబ్బర్ ఫూట్ పెగ్స్ ఉన్నాయి. ఈ మోడల్ బైక్ రెడ్, బ్లాక్.. ఈ రెండు పెయింట్ స్కీమ్ లలో మాత్రమే అందుబాటులో ఉంది.