iQOO 15 Discount
iQOO 15 Discount : ఐక్యూ అభిమానులకు అదిరిపోయే న్యూస్. ఈ ఐక్యూ 15ఫోన్‌పై అద్భుతమైన డిస్కౌంట్ అందిస్తోంది. అమెజాన్ ఈ ఫోన్ కొనుగోలుపై రూ.4వేలు తగ్గింపు అందిస్తోంది. ఈ ఫోన్ 50MP ప్రైమరీ కెమెరా, 7000mAh బ్యాటరీ ఉన్నాయి.
అమెజాన్ ఇండియాలో 12GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ మోడల్ ధర రూ. 72,998కు లభిస్తోంది. అమెజాన్ ధాకడ్ డీల్ సమయంలో ఈ ఫోన్‌ను రూ. 4వేలకు కన్నా తక్కువకే సొంతం చేసుకోవచ్చు.
ఈ అద్భుతమైన ఆఫర్ అసలు మిస్ చేసుకోవద్దు. ఈ ఐక్యూ ఫోన్ కొనుగోలుపై రూ.3,649 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా మరింత తగ్గింపు పొందవచ్చు. బ్రాండ్, కంపెనీ ఎక్స్ఛేంజ్ పాలసీతో మీ పాత ఫోన్ వర్కింగ్ కండిషన్ బట్టి ఎక్స్ఛేంజ్ ఆఫర్ పొందవచ్చు. ఈ ఫోన్ 7000mAh బ్యాటరీ, మూడు 50MP కెమెరాలతో వస్తుంది. IP68+ IP69 వాటర్ ప్రూఫ్ రేటింగ్‌తో వస్తుంది.
ఐక్యూ 15 ఫోన్‌లో 6.85-అంగుళాల 2K+ డిస్‌ప్లే స్పెషల్ అట్రాక్షన్. ఈ కర్వ్డ్ డిస్‌ప్లే రిఫ్రెష్ రేట్ 144Hzతో వస్తుంది. డిస్‌ప్లే టాప్ బ్రైట్‌నెస్ లెవల్ 6000 నిట్స్ అందిస్తుంది. ఈ ఫోన్‌లో 512GB UFS 4.1 స్టోరేజ్, 16GB LPDDR5X ర్యామ్ ఉన్నాయి. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్ ఫోన్‌కు పవర్ అందిస్తుంది. ఫొటోగ్రఫీ విషయానికి వస్తే ఎల్ఈడీ ఫ్లాష్‌తో 3 కెమెరాలు అందుబాటులో ఉన్నాయి.
50MP 3x పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా, 50MP ప్రైమరీ సెన్సార్, 50MP అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ ఉన్నాయి. ఈ ఫోన్ సెల్ఫీల కోసం 32MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. ఈ ఫోన్ 100 వాట్ల వద్ద ఛార్జ్ చేయగల 7000mAh బ్యాటరీతో వస్తుంది. 40-వాట్ల వైర్‌లెస్ ఛార్జింగ్‌కు కూడా ఫోన్ సపోర్టు ఇస్తుంది. ఈ ఫోన్ బయోమెట్రిక్ సేఫ్టీ కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది.
ఆండ్రాయిడ్ 16 ఆధారంగా OriginOS 6.0 పవర్ అందిస్తుంది. ఈ ఫోన్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌లు IP68 + IP69 ఉన్నాయి. 5G, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 7, బ్లూటూత్ 6.0, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ 3.2 జెన్ 1, NFC వంటి ఫీచర్లు కనెక్టివిటీ ఆప్షన్లలో ఉన్నాయి.
ఇందులో లెజెండ్, ఆల్ఫా అనే 2 కలర్ ఆప్షన్లు ఉన్నాయి. ఈ ఐక్యూ ఫోన్ AnTuTu స్కోరు 4 మిలియన్ల కన్నా ఎక్కువ అందిస్తుంది. భారీ గేమింగ్ సమయంలో ఫోన్ హీట్ కాకుండా 8K VC కూలింగ్ సిస్టమ్ కూడా ఉంది.