Best Camera Phones
Best Camera Phones : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? కెమెరా ప్రియుల కోసం భారత మార్కెట్లో అత్యంత పవర్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు లభ్యమవుతున్నాయి. అందులో శాంసంగ్ S సిరీస్, ఐఫోన్ లైనప్ నుంచి ఒప్పో ఫైండ్ ఎక్స్ సిరీస్ వరకు ఈ స్మార్ట్‌ఫోన్‌లు అప్‌గ్రేడ్ ఇమేజ్ సెన్సార్లు, ఏఐ ఫీచర్లతో మొబైల్ ఫోటోగ్రఫీని అందిస్తున్నాయి.
మీరు కూడా మంచి కెమెరా ఫోన్ (Best Camera Phones) కోసం చూస్తుంటే ఈ కెమెరా ఫోన్లలో మీకు నచ్చిన ఫోన్ ఎంచుకుని కొనేసుకోండి. శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా నుంచి షావోమీ 15 అల్ట్రా వరకు లభించే ఫోన్లలో ఏది కొంటారో కొనేసుకోండి.
శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా (రూ. 1,15,450) :
శాంసంగ్ గెలాక్సీ S25 లో-లైటింగ్ పర్ఫార్మెన్స్ అప్‌గ్రేడ్ ప్రైమరీ సెన్సార్ (200MP + 10MP + 50MP + 50MP)తో క్లినడ్ క్వాడ్-కెమెరా సెటప్‌ను అందిస్తుంది. ఈ ఫోన్ 120Hz 2600నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. 6.9-అంగుళాల డైనమిక్ ఎల్టీపీఓ అమోల్డ్ 2X డిస్‌ప్లే కలిగి ఉంది. 2025లో బెస్ట్ కెమెరా క్వాలిటీతో ఆల్-రౌండర్ కోసం చూస్తున్న యూజర్లకు గెలాక్సీ S25 అల్ట్రా ఆప్షన్ పొందవచ్చు.
ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ (రూ. 1,49,900) :
ఆపిల్ ఐఫోన్ 17 ప్రో మాక్స్ ట్రిపుల్ 48MP ప్రైమరీ కెమెరా సెటప్, 18MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ కోసం ఆపిల్ A19 ప్రో చిప్‌సెట్ కలిగి ఉంది. ఈ ఐఫోన్ డాల్బీ విజన్‌తో 6.9-అంగుళాల ఎల్టీపీఓ సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే కలిగి ఉంది. iOS 26లో రన్ అయ్యే ఈ స్మార్ట్‌ఫోన్ ఫొటోగ్రఫీని ఇష్టపడేవారికి టాప్ రేంజ్ పర్ఫార్మెన్స్ కోరుకునే వారికి బెస్ట్ అని చెప్పొచ్చు.
ఐఫోన్ 17 ప్రో (రూ. 1,34,900) :
ఆపిల్ ఐఫోన్ 17 ప్రో మోడల్ మాక్స్ వేరియంట్ మాదిరిగానే ట్రిపుల్ 48MP రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంది. ఈ యూనిట్ సూర్యకాంతి, తక్కువ కాంతి రెండింటిలోనూ అదిరిపోయే ఫొటోగ్రఫీ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. మొత్తంమీద, స్మార్ట్‌ఫోన్ క్లియర్ ఫొటోలను క్లిక్ చేసేందుకు ఇష్టపడే వారికి అద్భుతమైన ఆప్షన్.
గూగుల్ పిక్సెల్ 10 ప్రోలో 48MP, 50MP వైడ్ సెన్సార్లతో కెమెరా సెటప్, గూగుల్ టెన్సార్ G5 చిప్‌సెట్ కలిగి ఉంది. ఫ్లాగ్‌షిప్-లెవల్ ఫొటోగ్రఫీని అద్భుతమైన పర్ఫార్మెన్స్‌తో అందిస్తుంది. మల్టీ-జోన్ లేజర్ AF, LED ఫ్లాష్, అల్ట్రా-HDR పనోరమా ఫీచర్లు హై-క్వాలిటీని అందిస్తాయి. ఫొటో ఔత్సాహికులకు అద్భుతమైన ఆప్షన్ అని చెప్పొచ్చు.
వన్‌ప్లస్ 15 (రూ. 72,999) :
వన్‌ప్లస్ 15 లేటెస్ట్ లాంచ్‌లో ట్రిపుల్ 50MP బ్యాక్ కెమెరా సెటప్, 32MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఎప్పటిలాగే అద్భుతమైన ఫొటోలను క్యాప్చర్ చేయొచ్చు. వన్‌ప్లస్ 15 పెద్ద 6.78-అంగుళాల ఎల్టీపీఓ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. 1B కలర్ విజువల్స్‌కు సపోర్టు ఇస్తుంది.
షావోమీ 15 అల్ట్రా (రూ. 1,09,999) :
షావోమీ 15 అల్ట్రా ఫోన్ క్వాడ్-కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో మూడు 50MP కెమెరాలు, 4.3x ఆప్టికల్ జూమ్‌తో 200MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీ ప్రియుల కోసం ఈ షావోమీ 32MP ఫ్రంట్ కెమెరా కలిగి ఉంది.
ఒప్పో ఫైండ్ X9 ప్రో (రూ. 99,999) :
నవంబర్ 18న లాంచ్ కానున్న ఒప్పో ఫైండ్ ఎక్స్ సిరీస్‌లో 50MP + 200MP సెన్సార్‌లతో కూడిన పవర్‌ఫుల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుందని భావిస్తున్నారు. ఇందులో సెల్ఫీల కోసం 50MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. పవర్‌ఫుల్ ఫొటోల కోసం కెమెరా సిస్టమ్ హాసెల్‌బ్లాడ్ కలర్ కాలిబ్రేషన్‌తో వస్తుంది.