×
Ad

New Aadhaar App : కొత్త ఆధార్ యాప్.. ఇకపై ఇంట్లో నుంచే మీ పేరు, అడ్రస్, ఫోన్ నంబర్‌ మార్చుకోవచ్చు.. ఫుల్ ఫీచర్లు, ప్రాసెస్ మీకోసం!

New Aadhaar App : ఆధార్ కొత్త యాప్‌ వచ్చేసింది. ఇకపై ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఉన్నచోటనే మీ ఫోన్‌లో ఆధార్ కొత్త యాప్ ఇన్ స్టాల్ చేసుకుని ఈజీగా ఆధార్ వివరాలను అప్ డేట్ చేయొచ్చు.

  • Published On : January 29, 2026 / 04:32 PM IST

New Aadhaar App

  • ఆధార్ వివరాలు అప్ డేట్ కోసం కొత్త యాప్
  • మొబైల్ నెంబర్, అడ్రస్ వివరాలను మార్చుకోవచ్చు
  • ఆఫ్‌లైన్‌లో కూడా ఆధార్ ఐడెంటిటీని వెరిఫై చేయొచ్చు
  • క్యూఆర్ కోడ్‌తో ఇన్‌స్టంట్ ఐడెంటిటీ అథెంటికేషన్
  • ఆధార్ అప్‌డేట్ కోసం రూ. 75 రుసుము చెల్లించాలి.
  • 14 రోజుల నుంచి 30 రోజుల్లో అడ్రస్ అప్‌డేట్

New Aadhaar App : మీ ఆధార్ కార్డులో మొబైల్ నెంబర్ లేదా అడ్రస్ మార్చుకోవాలని అనుకుంటున్నారా? మీరు ఇంట్లో నుంచే మొబైల్ నెంబర్, అడ్రస్ ఈజీగా మార్చుకోవచ్చు తెలుసా? మీరు ఏ మొబైల్ ఫోన్ సెంటర్ కు వెళ్లాల్సిన పనిలేదు. మీ పాత నంబర్ స్థానంలో కొత్త మొబైల్ నెంబర్ తో ఈజీగా అప్ డేట్ చేసుకోవచ్చు. ఇందుకోసం యూఐడీఏఐ కొత్త ఆధార్ యాప్‌ ప్రవేశపెట్టింది.

ఇది చాలా సేఫ్ ఆఫ్‌లైన్ వెరిఫికేషన్. సెలెక్టివ్ డేటా షేరింగ్, మొబైల్ నంబర్ అప్‌డేట్‌ వంటి ఫీచర్లను అందిస్తుంది. ఈ యాప్ మీ స్మార్ట్‌ఫోన్ నుంచే మీ డిజిటల్ ఐడెంటిటీని ఈజీగా వెరిఫై చేయొచ్చు. ఇంతకీ కొత్త ఆధార్ యాప్‌లో ఏయే ఫీచర్లు ఉన్నాయి? ఎక్కడ డౌన్‌లోడ్ చేసుకోవాలి? ఫిజికల్ ఆధార్ కార్డుతో పనిలేదా? అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

కొత్త ఆధార్ యాప్ ఏంటి? :
ఆధార్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఈజీగా ఉండేందుకు వీలుగా కొత్త ఆధార్ యాప్ తీసుకొచ్చింది యూఐడీఏఐ. హోటల్ చెక్-ఇన్, సిమ్ కార్డ్ వెరిఫికేషన్, ఆఫీస్ వెరిఫికేషన్ కోసం ఆధార్ ఫోటోకాపీలను షేర్ చేయడం వల్ల డేటా దుర్వినియోగం రిస్క్ పెరుగుతుందని యూఐడీఏఐ హెచ్చరిస్తోంది.

ఇకపై అలాంటి రిస్క్ లేకుండా యూఐడీఏఐ కొత్త ఆధార్ యాప్ ద్వారా ఆఫ్‌లైన్ ఆధార్ వెరిఫికేషన్ పూర్తి చేయొచ్చు. ఆధార్ నంబర్ లేదా బయోమెట్రిక్ డేటా షేర్ చేయకుండా ఐడెంటిటీని వెరిఫై చేయొచ్చు.

ఈ యాప్ మొబైల్ నంబర్, అడ్రస్ వంటి ముఖ్యమైన డేటాను అప్‌డేట్ చేసుకోవచ్చు. మొబైల్ నంబర్ అప్ డేట్స్ మాదిరిగానే, అడ్రస్ మార్పు అప్‌డేట్ కోసం రూ. 75 రుసుము చెల్లించాలి. అడ్రస్ మార్పు అప్‌డేట్‌కు 14 రోజుల నుంచి 30 రోజుల వరకు సమయం పట్టవచ్చు

ఆధార్ యాప్‌ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? :

  • ఆధార్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసి ఈ కింది విధంగా ఫాలో అవ్వండి.
  • మీ మొబైల్‌లో గూగుల్ ప్లే స్టోర్ (Android) లేదా ఆపిల్ యాప్ స్టోర్ (iOS) ఓపెన్ చేయండి.
  • సెర్చ్ బాక్సులో UIDAI అధికారిక “Aadhaar” యాప్ కోసం సెర్చ్ చేయండి.
  • యాప్‌ డౌన్‌లోడ్ చేసి, ఇన్‌స్టాల్ చేయండి.
  • మీకు నచ్చిన లాంగ్వేజీ ఎంచుకుని సెటప్‌ కంప్లీట్ చేయండి.
  • ఇన్‌స్టాల్ తర్వాత డిజిటల్ ఐడెంటిటీ మేనేజ్‌మెంట్, వెరిఫికేషన్, అప్‌డేట్ కోసం యాప్‌ వినియోగించవచ్చు.

ఆఫ్‌లైన్ ఆధార్ వెరిఫికేషన్ ఎలా చేయాలంటే? :
యాప్‌ డౌన్‌లోడ్ చేశాక ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండానే మీ పర్సనల్ డేటాను షేర్ చేయకుండా ఆఫ్‌లైన్‌లో ఐడెంటిటీని వెరిఫై చేయొచ్చు. ఆధార్‌ను ఆఫ్‌లైన్‌లో రెండు విధాలుగా వెరిఫై చేయొచ్చు.

షేర్ ఐడీ : పాస్‌వర్డ్-ప్రొటెక్టెడ్ ఆధార్ ఫైల్‌ను క్రియేట్ చేయొచ్చు. అవసరమైతే పేరు, వయస్సు వంటి వివరాలను మాత్రమే షేర్ చేయొచ్చు.

క్యూఆర్ కోడ్‌ స్కానింగ్ : ఈ యాప్ వాడే యూజర్లు క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసుకోవచ్చు. ఎలాంటి డాక్యుమెంట్లు, ఆధార్ ఫొటోకాపీలు లేకుండా ఇన్‌స్టంట్ ఐడెంటిటీ అథెంటికేషన్ చేయొచ్చు.

Read Also : Budget Economic Survey 2026 : కేంద్ర ఆర్థిక సర్వే 2026.. ఇకపై ఆ సమయంలో కొన్ని రకాల ప్రకటనలు బ్యాన్..

ఈ ఆధార్ యాప్‌ ఎలా వాడాలంటే? :
ఆఫ్‌లైన్ అథెంటికేషన్ పాటు ఆధార్ యాప్ యూజర్లు తమ మొబైల్ నంబర్, అడ్రస్ వివరాలను యాప్ నుంచి నేరుగా అప్‌డేట్ చేసుకోవచ్చు.

  • ఆధార్ యాప్ ఓపెన్ చేసి ఆధార్ ఆధారిత అథెంటికేషన్ ద్వారా లాగిన్ అవ్వండి.
  • హోమ్ స్క్రీన్‌లో ‘Update Aadhaar Details’ ఆప్షన్ ఎంచుకోండి.
  • మొబైల్ నంబర్, అడ్రస్ అప్ డేట్ అనే ఆప్షన్ ఎంచుకోండి.
  • కొత్త వివరాలు ఎంటర్ చేసి వెరిఫికేషన్ కోసం సబ్మిట్ చేయండి.
  • యాప్‌లో సూచించిన విధంగా అథెంటికేషన్ పూర్తి చేయండి.
  • అప్‌డేట్ కోసం నామమాత్రపు రుసుము చెల్లించాలి.
  • వెరిఫై పూర్తి అయ్యాక మీ వివరాలు ఆధార్ రికార్డులో అప్‌డేట్ అవుతాయి.

ఆధార్ యాప్ ఇతర ఫీచర్లు :
ఆఫ్‌లైన్ ధృవీకరణతో పాటు యాప్ అనేక ఇతర టూల్స్ కూడా అందిస్తుంది.
5 ఆధార్ ప్రొఫైల్‌ క్రియేట్ చేయండి. ఈ ఫీచర్ ఫ్యామిలీలకు బెటర్. సింగిల్ డివైజ్ నుంచి పిల్లలు లేదా ఇతరుల ఆధార్ వివరాలను ధృవీకరించవచ్చు.
ఆధార్ కాంటాక్ట్ కార్డ్ : ఆధార్ పూర్తి సమాచారం తెలియకుండా కాంటాక్ట్ వివరాలను సురక్షితంగా షేర్ చేసేందుకు యూజర్లను అనుమతిస్తుంది.

ఆఫ్‌లైన్ ఆధార్‌ ధృవీకరణకు కొత్త రూల్ :
ఆఫ్‌లైన్‌లో ఆధార్ సంబంధిత ధృవీకరణపై యూఐడీఏఐ కొత్త నియమాన్ని ప్రవేశపెట్టింది. ఇకపై ఆధార్ అనుబంధ సంస్థలు ఆఫ్‌లైన్ ఆధార్ ధృవీకరణకు రిజిస్టర్ తప్పనిసరి. బ్యాంకులు, హోటళ్ళు, సేవా ప్రదాతలు వంటి అధీకృత సంస్థలు మాత్రమే యాప్‌ ద్వారా ఆధార్ వివరాలను ధృవీకరించేలా చర్యలు చేపట్టనుంది. ఆఫ్‌లైన్ ఆధార్ ధృవీకరణ క్రమంగా అన్ని రంగాలలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.