AC Maintenance Tips
AC Maintenance Tips : సమ్మర్ వచ్చేసింది. ఎండలు కొద్దికొద్దిగా పెరిగిపోతున్నాయి. ప్రతిఒక్కరూ మార్కెట్లో కొత్త ఏసీల కోసం చూస్తుంటారు. కొంతమంది ఇంట్లో పాత ఏసీలతోనే కాలం గడిపేస్తుంటారు. చాలామందిలో కొత్త ఏసీ కొనాలా? పాత ఏసీతోనే నడపాలా? అనే ఆలోచనలో ఉంటుంటారు.
వాస్తవానికి, ఏదైనా ఒక ఏసీని కొనుగోలు చేస్తే.. చాలా ఏళ్ల పాటు వాడేస్తుంటారు. ఏసీ కొనుగోలు చేసే సమయంలోనే దానికి అవసరమైన యూనిట్ కూడా ఎంచుకోవాలి. ఏసీల పనితీరు ఎక్కువ కాలం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
మీరు వాడే ఏసీ జీవిత కాలం ఇంకా ఉందా? లేదా మరికొంత కాలం ఏసీని వాడవచ్చా? లేదా అనేది ముందే నిర్ణయించుకోవాలి. లేదంటే.. పాత ఏసీని మార్చేందుకు ఇదే సమయమా లేదా అనేది తెలుసుకోవాలి.
శీతాకాలం ముగిసిన వెంటనే వేసవి మొదలు కావడానికి ముందే పాత ఏసీలను పక్కన పెట్టేసి కొత్త ఏసీలను కొనుగోలు చేస్తే బెటర్ అని చెప్పవచ్చు. పాత ఏసీలను అలానే ఉంచుకోవాలనుకంటే వాటి పనితీరు ఎంతకాలం వస్తుందనేది అంచనా వేయాలి. పాత ఏసీనా లేదా కొత్త ఏసీనా అనేది ఎప్పుడు ఏది అవసరమో ముందుగానే తెలుసుకోవాలి.
ఏసీలు తరచుగా పాడైపోతే.. :
ఏసీలు తరచుగా చెడిపోతుంటాయి. వెంటవెంటనే రిపేర్లు వస్తుంటాయి. ఏసీలను మార్చే సమయం వచ్చిందని గమనించాలి. లేదంటే ఈ ఏసీల కారణంగా అనేక ఆర్థికపరమైన నష్టాలను భరించాల్సి వస్తుంది. ప్రతిసారి ఏసీని రిపేరింగ్ చేయడం వల్ల ఎక్కువ మొత్తంలో మరమ్మత్తుల కోసం డబ్బులను ఖర్చు చేయాల్సి వస్తుంది.
ఏసీల లైఫ్ టైమ్ :
ఏసీల లైఫ్ టైమ్ సాధారణంగా 10 ఏళ్ల నుంచి 15 ఏళ్ల వరకు ఉంటుంది. ఈ సమయం రాగానే ఇంట్లో పాత ఏసీని వెంటనే మార్చేయాలి. 10 ఏళ్ల నుంచి 15 ఏళ్లలో ఏసీని తప్పక మార్చడం చేయాలి. ఏసీలు వాటి ఏజ్ పెరిగేకొద్దీ కూలింగ్ తగ్గిపోతుంది. కూలింగ్ తక్కువ అధికంగా విద్యుత్ వాడేస్తాయి. ఫలితంతా కరెంట్ బిల్లు తడిసి మోపెడు అవుతుంది. మరమ్మతులకు అయ్యే ఖర్చు కూడా పెరిగిపోతుంది. ఏసీలకు అమర్చే పాత యూనిట్ ప్రతి 10 ఏళ్ల నుంచి 15 ఏళ్లకు కొత్తవి మార్చేయడం చేస్తుండాలి.
ఏసీల్లో లీకేజీ సమస్యలు :
శీతాకాలంలో కూడా ఏసీలపై నీటిబిందువులు పేరుకుపోతుంటాయి. అదే లీకేజీ లీకేజీ ఎక్కువగా ఉంటే సమస్య పెద్దదని గమనించాలి. ఏసీ యూనిట్‌లో నీటి లీకేజీ ఎక్కువగా ఉంటే.. తీవ్రమైన సమస్య పరిగణించాలి. రిఫ్రిజిరెంట్ లీకేజీ యూజర్ల ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. పాత ఏసీలు లేదా భారీగా దెబ్బతిన్న ఏసీలు చాలా ప్రమాదమని గుర్తించాలి. అలానే జరిగితే అది అగ్ని ప్రమాదాలు, ఇతర ప్రాణాంతక పరిస్థితులకు దారితీస్తాయని గమనించాలి.
శబ్దం, దుర్వాసనలు :
ఏసీ అనేది సరిగా పనిచేయకపోతే ఇంటిని కూల్ చేయదు. దానికితోడు శబ్దం, పొగ, కాలిపోయిన వాసనలు వస్తుంటాయి. ఇలాంటి ఏసీలను వెంటనే మార్చుకోవడం ఎంతైనా మంచిది. సరిగా పనిచేయని ఏసీలతో అనేక సమస్యలు తలెత్తుతుంటాయి. ఇంట్లో పవర్ బిల్లు భారీగా వస్తుంది. ఇదే ఏసీ పనితీరు తగ్గిందని చెప్పడానికి సూచనగా చెప్పవచ్చు. కొత్త ఏసీ యూనిట్ వేసుకోవడం ద్వారా పవర్ వినియోగాన్ని తగ్గిస్తుంది. తక్కువ ఖర్చుతోనే ఇల్లు కూల్ అవుతుంది.
Read Also : CIBIL Score : మీ సిబిల్ స్కోరు తగ్గడానికి 5 కారణాలివే.. పొరపాటున కూడా ఇలాంటి మిస్టేక్స్ చేయెద్దు..!
వాతావరణ సమస్యలు :
ఉష్ణోగ్రతలను బట్టి కూడా ఏసీలు పనితీరులో తేడాలు వస్తుంటాయి. మీరు ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉండే ప్రదేశాల్లో ఉన్నా లేదా తేమ అధికంగా ఉండే చోట ఉంటే మీ ఏసీలను తరచూ మార్చాల్సి రావచ్చు. ఎందుకంటే ఇలాంటి వాతావరణ సమస్యలతో ఏసీ యూనిట్‌పై తీవ్ర ఒత్తిడి పడుతుంది. ఫలితంగా ఏసీల జీవితకాలం క్రమంగా తగ్గిపోతూ వస్తుంది.