Earth Is Now Spinning Faster : ఎర్త్‌కు ఏమైంది.. ఏదైనా ప్రళయం ముంచుకొస్తోందా? దశబ్దాల పాటు మెల్లగా.. ప్రశాంతంగా తిరిగిన భూమి.. ఉన్నట్టుండి ఒక్కసారిగా వేగంగా తిరుగుతోంది.. ఇప్పుడు ఇదే ప్రశ్న ఖగోళ సైంటిస్టుల బుర్రలను తొలిచివేస్తోంది. ఒక రోజు అంటే 24 గంటలు.. భూమి తాను చుట్టూ తాను తిరిగిరావడానికి 24 గంటల సమయం పడుతుందని చిన్నప్పుడే చదువుకున్నాం.. ఉన్నఫలంగా భూమి వేగంగా తిరిగడానికి కారణమేంటి?.. అంతరిక్షంలో శాటిలైట్లకు ఛార్జింగ్ చేయడం మరిచిపోయారా? అందుకే ఈ భూగోళం.. గందరగోళంగా కనిపిస్తుందా? అంటే అదేం కాదంటున్నారు.
భూపరిభ్రమణం అనేది ఒక నిర్దిష్ట కక్ష్యలో ఉంటుంది. తన కక్ష్యలో భూమి 365 సార్లు సూర్యుని చుట్టూ పరిభమ్రిస్తే.. ఒక ఏడాదిగా లెక్కిస్తారు. అయితే ఎప్పటిలా భూమి నిదానంగా తిరగడం లేదంట.. గతంలో కంటే ఇప్పుడు భూమి వేగంగా తిరుగుతుందని ఖగోళ సైంటిస్టులు అంటున్నారు. వాస్తవానికి.. వందల మిలియన్ల ఏళ్ల క్రితం భూమి సూర్యుని చుట్టూ పూర్తిగా తిరిగిరావడానికి 420సార్లు పరిభ్రమించిందంట.
మిలియన్ల ఏళ్ల క్రితమే భూమి.. 444-419 సార్లు తిరిగిందని సైంటిస్టులు గణాంకాలను లెక్కగట్టారు. అంటే.. అప్పుడు ఒక ఏడాదిలో భూమి 420 సార్లు పరిభ్రమించింది. కొన్ని మిలియన్ల ఏళ్ల తర్వాత భూమి వేగం 410కి నెమ్మదించింది. భూమి వేగంలో మార్పులకు అనేక కారణాలు ఉంటాయని అంటున్నారు సైంటిస్టులు. భూమిలోని సముద్ర మట్టం స్థాయిలో మార్పులు కారణం కావొచ్చు. భూమికి దూరంగా చంద్రుడు కదలడమే అతిపెద్ద కారకమని చెబుతున్నారు. ఇలా జరిగినప్పుడు భూమి వేగం నెమ్మదించినట్టు కనిపించవచ్చు. సాధారణంగా భూమి నెమ్మదించడానికి ఒక లీప్ సెకండ్ సమయం పడుతుంది.
కానీ, 2020లో భూమి భ్రమణం మళ్లీ వేగవంతమైంది. 2005లో అతి తక్కువ రోజుగా రికార్డు అయింది. 2020లో ఆ రికార్డు 28 సార్లు బ్రేక్ చేసింది. సగటు రోజు ఎక్కువ అవుతోంది. 2020 వరకు ఏడాదిలో సగటున, రోజులు 0.5 మిల్లీసెకన్లు తక్కువగా నమోదయ్యాయి. దీని ఫలితంగా 2021లో భూమి ఇంత వేగంగా తిరుగుతోంది. భూమి భ్రమణ చరిత్రలో మొదటిసారిగా (world’s International Earth’s Rotation Service)కు నెగటీవ్ లీపు సెకను అవసరం పడింది. గత 50 ఏళ్లలో కంటే భూమి ఇప్పుడు వేగంగా తిరుగుతోందని సైంటిస్టులు కచ్చితంగా చెబుతున్నారు. గతంలో 2021లో సగటు రోజు సాధారణ 86,400 సెకన్ల కన్నా 0.05 మిల్లీసెకన్లు తక్కువగా ఉంటుందని సైంటిస్టులు అంచనా వేశారు.
Leap second news! Normally I only pay attention every 6 months when the IERS publish Bulletin C, the leap second yes or no announcementhttps://t.co/C1b2O1Cyns
— Tony Finch (@fanf) November 13, 2020