Airtel 5G services rolling out to 8 cities starting today, pan India rollout by March 2024
Airtel 5G Services : భారత మార్కెట్లోకి 5G నెట్‌వర్క్ వచ్చేసింది. దేశీయ టెలికం దిగ్గజాలు రిలయన్స్ జియో (Reliance Jio), ఎయిర్‌టెల్ (Airtel) 5G సర్వీసులను లాంచ్ చేసినట్టు ప్రకటించాయి. కానీ, వోడాఫోన్ ఐడియా (Vodaphone Idea) తమ 5G సర్వీసులపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.
దేశంలో ఎట్టకేలకు 5G సర్వీసులను ఎయిర్‌టెల్ ఛైర్మన్ సునీల్ మిట్టల్ ప్రారంభించారు. టెలికాం ఆపరేటర్ ఈరోజు ఎంపిక చేసిన నగరాల్లో 5G సర్వీసులను లాంచ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఎయిర్‌టెల్ 5G సర్వీసులను వీలైనంత త్వరగా దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది.
Airtel 5G services rolling out to 8 cities starting today, pan India rollout by March 2024
దేశంలో 5G నెట్‌వర్క్ మొదట దాదాపు 8 నగరాల్లో అందుబాటులో ఉంటుందని ఎయిర్‌టెల్ ఎగ్జిక్యూటివ్ ఒక ప్రకటనలో వెల్లడించారు. మొత్తం 8 నగరాల పేర్లను ఎయిర్‌టెల్ రివీల్ చేయలేదు. అందులో ఢిల్లీ, వారణాసి, ముంబై, బెంగుళూరు నగరాలను మాత్రమే ఎయిర్‌టెల్ వెల్లడించింది. మిగిలిన ఇతర 4 నగరాలు ఈరోజు నుంచి ఎయిర్‌టెల్ 5G సర్వీసులు అందుబాటులోకి వస్తాయని మిట్టల్ ధృవీకరించారు.
మార్చి 2024 నాటికి టెలికాం కంపెనీ భారత్‌లో ప్రతి ప్రాంతానికి 5G సర్వీసులను అందజేస్తుందని ఎగ్జిక్యూటివ్ హామీ ఇచ్చారు. మరోవైపు, రిలయన్స్ జియో 5G సర్వీసులను ఎప్పుడు లాంచ్ చేసేది మాత్రం కచ్చితమైన ప్రారంభ తేదీని వెల్లడించలేదు.
Airtel 5G services rolling out to 8 cities starting today, pan India rollout by March 2024
RIL ఛైర్మన్ ముఖేష్ అంబానీ మాట్లాడుతూ.. భారత్ 5G సర్వీసులను అందించడంలో కొంత ఆలస్యమైందని అన్నారు. టెలికాం కంపెనీ డిసెంబర్ 2023 నాటికి దేశంలోని ప్రతి ప్రాంతానికి 5G సర్వీసులను అందించాలని లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. రిలయన్స్ Jio ముందుగా అందరికీ 5G సర్వీసులను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఎయిర్‌టెల్ కూడా అదే వాగ్దానం చేస్తోంది.
జియో 5G ప్లాన్‌లు ప్రపంచంలోనే అతి తక్కువ ధరలకు అందుబాటులో ఉంటాయని అంబానీ ప్రకటించారు. రిలయన్స్ జియో దీపావళి నాటికి 5G సర్వీసులను ప్రారంభిస్తుందని గతంలో ప్రకటించింది. రాబోయే వారాల్లో వోడాఫోన్ ఐడియా కూడా భారత్ మార్కెట్లో సరికొత్త 5G నెట్‌వర్క్‌ను ప్రారంభిస్తామని హామీ ఇచ్చింది.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..