Airtel Recharge Plan : BSNLకు పోటీగా ఎయిర్‌టెల్ అతి చౌకైన ప్లాన్.. ఒకసారి రీఛార్జ్ చేస్తే చాలు.. 365 రోజులు ఎంజాయ్ చేయొచ్చు..!

Airtel Recharge Plan : ఎయిర్‌టెల్ నెలవారీ రీఛార్జ్ ప్లాన్లతో విసిగిపోయిన కస్టమర్ల కోసం సరికొత్త వార్షిక రీఛార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది. ఒకసారి రీఛార్జ్ చేసుకుంటే 365 రోజులు వ్యాలిడిటీతో ఎంజాయ్ చేయొచ్చు.

Airtel Recharge Plan

Airtel Recharge Plan : ఎయిర్‌టెల్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఎయిర్‌‌టెల్ అదిరిపోయే వార్షిక ప్లాన్ ప్రవేశపెట్టింది. దేశంలో రెండో అతిపెద్ద టెలికాం ప్రొవైడర్‌గా నిలిచిన ఎయిర్‌టెల్.. ప్రస్తుతం సుమారు 38 కోట్ల మందికి సర్వీసులను అందిస్తోంది. ఇటీవల రీఛార్జ్ ప్లాన్‌ల ధరలు భారీగా పెరిగాయి. దాంతో మొబైల్ యూజర్లు లాంగ్ టైమ్ వ్యాలిడిటీ ఆప్షన్ల వైపు మొగ్గు చూపుతున్నారు. నెలవారీ కన్నా వార్షిక ప్లాన్లకు ఎక్కువ డిమాండ్ పెరిగింది.

Read Also : Nothing Phone 3a Series : నథింగ్ ఫోన్లు భలే ఉన్నాయి భయ్యా.. రెండు ఫోన్లపై రూ. 5వేలు డిస్కౌంట్.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు!

ఇప్పటికే ప్రభుత్వ రంగ టెలికం కంపెనీ బీఎస్ఎన్ఎల్ కూడా తమ కస్టమర్ల కోసం 365 వార్షిక ప్లాన్ ప్రవేశపెట్టింది. ఇప్పుడు బీఎస్ఎన్ఎల్‌ కస్టమర్లను ఆకర్షించేందుకు ఎయిర్‌టెల్ కూడా 365 రోజుల వార్షిక ప్లాన్ తీసుకొచ్చింది. అత్యంత సరసమైన ఈ రీఛార్జ్ ప్లాన్‌ ద్వారా కస్టమర్లు ఏడాది మొత్తం ఫ్రీ అన్‌లిమిటెడ్ కాల్స్ ఎంజాయ్ చేయొచ్చు.

గతంలో టెలికాం కంపెనీలు అన్ని ప్లాన్‌లలో డేటాను ఫ్రీ కాలింగ్‌తో కలిపి అందించేవి. కానీ, ఈ రీఛార్జ్ ప్లాన్లు డేటా అవసరం లేని చాలామంది కస్టమర్లకు ఖరీదైనదిగా మారాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు ట్రాయ్ టెలికాం ఆపరేటర్లకు వాయిస్-ఓన్లీ ప్లాన్‌లను రూపొందించాలని సూచించింది.

ఎయిర్‌టెల్ రూ.1849 రీఛార్జ్ ప్లాన్ :
ట్రాయ్ (TRAI) మార్గదర్శకాల ప్రకారం.. ఎయిర్‌టెల్ వార్షిక రీఛార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ ధర కేవలం రూ.1849 మాత్రమే. కస్టమర్లు రోజుకు రూ. 5 చొప్పున చెల్లించా

లక్షలాది మంది యూజర్లను లక్ష్యంగా చేసుకుని ఎయిర్‌టెల్ ఈ ప్లాన్ అందుబాటులోకి తీసుకొచ్చింది. మీరు ఎయిర్‌టెల్ సిమ్ కస్టమర్ అయితే రీఛార్జ్‌ల ఇబ్బంది లేకుండా ఈ కాలింగ్ ప్లాన్ అద్భుతమైన ఆప్షన్ అని చెప్పవచ్చు.

ఈ ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ద్వారా అన్ని లోకల్, ఎస్టీడీ నెట్‌వర్క్‌లలో ఏడాది పొడవునా అన్‌లిమిటెడ్ ఫ్రీ కాలింగ్ ఆప్షన్ అందిస్తుంది. అదనపు డేటా లేకుండా కాలింగ్ ఆప్షన్ కోరుకునే యూజర్లకు బెస్ట్ ఆప్షన్. అదనంగా, ఈ ప్లాన్‌తో వినియోగదారులు మొత్తం 365 రోజుల వ్యవధిలో మొత్తం 3600 ఫ్రీ ఎస్ఎంఎస్ పొందవచ్చు.

ఎయిర్‌టెల్ సేవింగ్ డేటా ఆప్షన్ :
ఎయిర్‌టెల్ అందించే ఈ ప్లాన్ వాయిస్-ఓన్లీ రీఛార్జ్ ప్లాన్. ఇందులో ఇంటర్నెట్ డేటా లేదు. వార్షిక ప్లాన్‌లో మీకు డేటా అవసరమైతే.. రూ. 2249 రీఛార్జ్ ఆప్షన్ ఎంచుకోవచ్చు. చౌకైన ప్లాన్ మాదిరిగానే 365 రోజుల వ్యాలిడిటీతో అన్ని నెట్‌వర్క్‌లలో అన్‌లిమిటెడ్ కాలింగ్స్ అందిస్తుంది. అయితే, ఇందులో 30జీబీ డేటా కూడా ఉంటుంది. ప్రతి నెలా దాదాపు 2.5జీబీ వినియోగాన్ని అందిస్తుంది.

Read Also : Samsung Galaxy S24 Plus : హోలీ బంపర్ ఆఫర్.. రూ. లక్ష ఖరీదైన శాంసంగ్ 5జీ ఫోన్ కేవలం రూ. 22వేలకే.. డోంట్ మిస్

భారతీ ఎయిర్‌టెల్ దేశమంతటా ఉన్న వినియోగదారులకు స్టార్‌లింక్ హై-స్పీడ్ ఇంటర్నెట్ సర్వీసులను అందించే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా టెస్లా అధినేత ఎలన్ మస్క్ స్పేస్‌ఎక్స్‌తో భాగస్వామ్యాన్ని ప్రకటించింది. దేశంలో శాటిలైట్ కమ్యూనికేషన్ సర్వీసుల కోసం అవసరమైన అనుమతులకు స్పేస్‌ఎక్స్ సహకారం తప్పనిసరి కావడంతో చేతులు కలిపింది.