Airtel Recharge Plans : ఎయిర్‌టెల్ యూజర్లకు పండగే.. 30 రోజుల వ్యాలిడిటీతో 12 కొత్త రీఛార్జ్ ప్లాన్లు.. 60GB వరకు డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్!

Airtel Recharge Plans : ఎయిర్‌టెల్ 30 రోజుల వ్యాలిడిటీతో 12 కొత్త రీఛార్జ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. 60GB వరకు డేటాను పొందవచ్చు. అన్ లిమిటెడ్ కాల్స్‌ చేసుకోవచ్చు.

Airtel Recharge Plans

  • ఎయిర్ టెల్ యూజర్ల కోసం 12 కొత్త రీచార్జ్ ప్లాన్లు
  • 28రోజులు కాదు.. పూర్తి నెల 30 రోజుల వ్యాలిడిటీ
  • 60జీబీ వరకు డేటా, SMS, OTT, కాలింగ్ బెనిఫిట్స్

Airtel Recharge Plans : ఎయిర్‌టెల్ యూజర్ల కోసం అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్లు.. ఇకపై 28 రోజుల వ్యాలిడిటీ కాదు.. ఏకంగా 30 రోజుల పూర్తి వ్యాలిడిటీతో ఎంజాయ్ చేయొచ్చు. ఎయిర్‌టెల్ యూజర్ల కోసం 30 రోజుల వ్యాలిడిటీతో కొత్త 12 రీఛార్జ్ ప్లాన్లను అందిస్తోంది. ఇకపై ప్రతి నెలా పదేపదే రీఛార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎయిర్ టెల్ అందించే ప్లాన్ల ధరలు ఏంటి? ఏయే బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

ఎయిర్‌టెల్ 30-రోజుల వ్యాలిడిటీ ప్లాన్లు :
మీరు కూడా ప్రతి నెలా మీ మొబైల్‌ను రీఛార్జ్ చేసి విసిగిపోయారా? ఎయిర్‌టెల్ మీకోసం (Airtel Recharge Plans) అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్లను అందిస్తోంది. ఎయిర్‌టెల్ పూర్తి 30 రోజుల వ్యాలిడిటీని అందించే అదిరిపోయే ప్లాన్‌లను ఆఫర్ చేస్తోంది. ఇప్పటి వరకు చాలా మొబైల్ ప్లాన్‌లు 28 రోజుల వ్యాలిడిటీతో వచ్చేవి. దాంతో ఏడాదికి 13 సార్లు రీఛార్జ్ చేయాల్సి వచ్చేది.

అందుకే ఎయిర్‌టెల్ ఇప్పుడు 30 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. ఈ ఎయిర్‌టెల్ ప్లాన్‌లలో కాలింగ్, డేటా, SMS, OTT యాక్సెస్ సహా ఇతర అదనపు బెనిఫిట్స్ కూడా ఉన్నాయి.

ఎయిర్‌టెల్ రూ. 319 ప్లాన్ :
ఈ ఎయిర్‌టెల్ ప్లాన్ 30 రోజుల పూర్తి వ్యాలిడిటీతో పాటు రోజుకు 1.5GB డేటాను అందిస్తుంది. మీరు సోషల్ మీడియా వాడకం, వెబ్ బ్రౌజింగ్ వీడియో స్ట్రీమింగ్ ఈజీగా చేయొచ్చు.

ఇందులో అన్ లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMS బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. ఈ ప్లాన్‌లో ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే, అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం, ఎయిర్‌టెల్ మ్యూజిక్ గూగుల్ వన్ ద్వారా 30GB క్లౌడ్ స్టోరేజ్ వంటి డిజిటల్ బెనిఫిట్స్ ఉన్నాయి.

Read Also : Tech Tips in Telugu : మీ మొబైల్ డేటా ఇట్టే అయిపోతుందా? ప్లాన్ మార్చకుండానే డేటా సేవ్ చేసే బిగ్ సీక్రెట్..

ఎయిర్‌టెల్ రూ. 355 ప్లాన్ :
ఈ ఎయిర్‌టెల్ ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీతో మొత్తం 25GB డేటాను అందిస్తుంది. ఇందులో అన్ లిమిటెడ్ లోకల్, STD రోమింగ్ కాలింగ్ బెనిఫిట్స్ ఉన్నాయి. మీరు ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా దేశవ్యాప్తంగా కాల్స్ చేసుకోవచ్చు.

SMSల విషయానికొస్తే.. ఈ ప్లాన్ మొత్తం 300 మెసేజ్‌ అందిస్తుంది. డేటా అలవెన్స్ అయిపోతే.. ప్రతి MBకి 50 పైసల చొప్పున ఛార్జీలు వర్తిస్తాయి. ఈ ప్లాన్ హలో ట్యూన్స్, అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియంకు కూడా యాక్సెస్ ఇస్తుంది.

ఎయిర్‌టెల్ రూ. 379 ప్లాన్ :
ఎయిర్‌టెల్ రూ. 379 ప్లాన్ రోజుకు 2GB డేటాను అందిస్తుంది. ఇందులో అన్ లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMS కూడా ఉంటాయి. ఈ ప్లాన్ అదనపు బెనిఫిట్స్ పొందాలంటే అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం, ఎయిర్‌టెల్ మ్యూజిక్, హలో ట్యూన్స్, గూగుల్ వన్ ద్వారా 30GB క్లౌడ్ స్టోరేజ్ ఉన్నాయి.

ఎయిర్‌టెల్ రూ. 429 ప్లాన్ :
మీకు ఎక్కువ డేటా వాడేవారు అయితే రూ. 429 ప్లాన్ అద్భుతమైన ఆప్షన్. 30 రోజుల వ్యాలిడిటీతో పాటు రోజుకు 2.5GB డేటాను అందిస్తుంది. అదనంగా, ఈ ప్లాన్‌లో అన్ లిమిటెడ్ కాలింగ్ రోజుకు 100 SMS బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఈ ప్లాన్ 5G నెట్‌వర్క్ సపోర్ట్‌తో పాటు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లేకు యాక్సెస్‌ను అందిస్తుంది.

ఎయిర్‌టెల్ రూ. 589, రూ. 605 ప్లాన్‌లు :
ఎయిర్‌టెల్ రూ. 589 ప్లాన్ 50GB డేటాను అందిస్తోంది. రూ. 605 ప్లాన్ 60GB డేటాను అందిస్తుంది. ఈ రెండు ప్లాన్‌లు 30 రోజుల వ్యాలిడిటీ, అన్‌లిమిటెడ్ కాలింగ్ 300 SMS లిమిట్స్ వస్తాయి. వీడియో స్ట్రీమింగ్, గేమింగ్ లేదా వర్క్ ఫ్రమ్ హోం కోసం ఎక్కువ ఇంటర్నెట్ డేటాను వాడే యూజర్లకు ఈ ప్లాన్‌లు అద్భుతంగా ఉంటాయి.

డేటా వోచర్లు, ఎంటర్‌టైన్మెంట్ ప్లాన్లు :
అదనపు డేటా, OTT బెనిఫిట్స్ కోసం ఎయిర్‌టెల్ వ్యాలిడిటీని 30 రోజులకు పొడిగించింది. ఎయిర్‌టెల్ రూ. 48 ప్లాన్, జియోహాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు 1GB డేటాను అందిస్తుంది. అలాగే రూ. 100 ప్లాన్ 6GB డేటాతో పాటు జియోహాట్‌స్టార్ మొబైల్ + టీవీకి యాక్సెస్‌ను అందిస్తుంది. రూ. 161 ప్లాన్ 12GB డేటాను అందిస్తుంది. అయితే ఇందులో ఎలాంటి OTT బెనిఫిట్స్ ఉండవు.

మీ డేటాతో పాటు ఎంటర్‌టైన్మెంట్ కావాలంటే రూ. 195 ప్లాన్ బెస్ట్ ఆప్షన్. 12GB డేటాతో పాటు జియోహాట్‌స్టార్, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లేకి యాక్సెస్‌ను అందిస్తుంది. అంతేకాకుండా, రూ.361 ప్లాన్ 50GB డేటా 3 నెలల OTT సబ్‌స్క్రిప్షన్‌ కూడా అందిస్తుంది. ఎక్కువ డేటాను వాడే యూజర్లకు అద్భుతమైన ఆప్షన్.

రూ. 279 ఎంటర్‌టైన్మెంట్ ప్లాన్ :
ఎయిర్‌టెల్ రూ. 279 ప్లాన్‌ను ప్రత్యేకంగా OTT ప్రియుల కోసం అందిస్తోంది. కేవలం 1GB డేటాను మాత్రమే అందిస్తోంది. నెట్‌ఫ్లిక్స్, జియోహాట్‌స్టార్, జీ ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే వంటి అనేక ప్లాట్‌ఫారమ్‌లకు యాక్సెస్‌ పొందవచ్చు.