Airtel to Vi 5G Services : భారత్‌కు 5G వచ్చేసిందిగా.. ఏయే నగరాల్లో ఫస్ట్ 5G సర్వీసులు? ప్లాన్ల ధరలు ఎంత ఉండొచ్చు? పూర్తి వివరాలు మీకోసం..!

Airtel to Vi 5G Services : భారత మార్కెుట్లోకి ఎట్టకేలకు 5G ఎంట్రీ ఇచ్చింది. ఇండియా మొబైల్ కాంగ్రెస్ (IMC) 6వ ఎడిషన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) 5G నెట్‌వర్క్ ప్రారంభించారు. దేశీయ టెలికం దిగ్గజాలైన రిలయన్స్ జియో (Reliance Jio), ఇతర టెలికాం కంపెనీలు మోదీతో 5G విభిన్న వినియోగ కేసులను ప్రదర్శించాయి.

Airtel to Vi 5G Services : భారత మార్కెుట్లోకి ఎట్టకేలకు 5G ఎంట్రీ ఇచ్చింది. ఇండియా మొబైల్ కాంగ్రెస్ (IMC) 6వ ఎడిషన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) 5G నెట్‌వర్క్ ప్రారంభించారు. దేశీయ టెలికం దిగ్గజాలైన రిలయన్స్ జియో (Reliance Jio), ఇతర టెలికాం కంపెనీలు మోదీతో 5G విభిన్న వినియోగ కేసులను ప్రదర్శించాయి.

Airtel, Jio, BSNL, Vi launched 5G services in India Rollout timeline, 5G plans

అంతేకాదు.. 5G సర్వీసులకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన వివరాలను కూడా ధృవీకరించాయి. ఎంపిక చేసిన నగరాల్లో 5G మొబైల్ సర్వీసులను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు కంపెనీ చైర్మన్ సునీ మిట్టల్ ప్రకటించారు. భారత్‌లోని కస్టమర్లకు 5G సర్వీసులను అందించే మొదటి టెల్కోగా Airtel నిలిచింది. ఆ తర్వాత రిలయన్స్ జియో (Reliance Jio), BSNL, Vodafone Idea (Vi) తమ 5G సర్వీసులను ఇంకా వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురాలేదు.

దేశంలో 5Gని ఎప్పుడు ప్రారంభిస్తాయంటే? :
రాబోయే ఆరు నెలల్లో భారత మార్కెట్లో 200 నగరాలకు 5G సర్వీసులు అందుబాటులోకి వస్తాయని భారత టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. భారతి ఎయిర్‌టెల్ ఇప్పటికే దాదాపు 8 నగరాల్లో 5G సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. టెలికాం కంపెనీ మార్చి 2024 నాటికి అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ కంటే ముందు భారతదేశంలోని ప్రతి గ్రామీణ ప్రాంతాలకు 5Gని తీసుకువస్తానని హామీ ఇచ్చింది. జియో 5G డిసెంబర్ 2023 నాటికి అందరికీ అందుబాటులోకి వస్తుందని RIL చైర్మన్ ముఖేష్ అంబానీ ప్రకటించారు. వచ్చే ఏడాది చివరి నాటికి 5Gని అందుబాటులోకి తీసుకురావాలని టెలికాం ఆపరేటర్ జియో భావిస్తోంది. దేశంలో 5G సర్వీసులను ఎప్పుడు లాంచ్ చేయాలనే దానిపై ఖచ్చితమైన వివరాలను వెల్లడించలేదు.

Airtel, Jio, BSNL, Vi launched 5G services in India Rollout timeline, 5G plans

అయితే దీపావళి నాటికి 5G సర్వీసులు అందుబాటులోకి వస్తాయని గతంలో పేర్కొంది. ఈ నెలాఖరులోనే దీపావళి పండుగ ప్రారంభం కానుంది. వోడాఫోన్ ఐడియా (Vi) త్వరలో 5Gని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించింది, అయితే ఖచ్చితమైన ప్రారంభ తేదీని రివీల్ చేయలేదు. ప్రభుత్వ నేతృత్వంలోని టెలికాం సంస్థ BSNL సుమారు 2 ఏళ్ల కాలంలో దేశంలోని 80-90 శాతం మందికి 5G అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే ఏడాది ఆగస్టు 15 నుంచి 5G సర్వీసులను BSNL అందజేస్తుందని ఐటీ మంత్రి స్పష్టం చేశారు.

Airtel, Jio, BSNL, Vi launched 5G services in India Rollout timeline, 5G plans

ఏ సిటీల్లో ఫస్ట్ 5G సర్వీసులు వస్తాయంటే? :
దీపావళి నాటికి కోల్‌కతా, ముంబై, ఢిల్లీ, చెన్నైతో సహా నాలుగు నగరాల్లో 5G అందుబాటులోకి వస్తాయని రిలయన్స్ జియో గతంలోనే ధృవీకరించింది. Airtel ప్రస్తుతం 8 నగరాల్లో 5Gని అందిస్తోంది. అందులో ఢిల్లీ, ముంబై, వారణాసి, బెంగళూరు, గురుగ్రామ్, చెన్నైసహా మరికొన్ని నగరాలు ఉన్నాయి. వోడాఫోన్ ఐడియా, BSNL ఇంకా దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించలేదు.

భారత్‌లో 5G ప్లాన్‌ల ధర ఎంత ఉండొచ్చుంటే?
భారత ప్రభుత్వం దేశంలో సరసమైన ధరలో 5G ప్లాన్‌లు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. IMC ఈవెంట్‌లో వైష్ణవ్ ఇదే విషయాన్ని ప్రకటించారు. గతంలో, 1GB డేటా ధర సుమారు రూ. 300 ఉండగా.. ఇప్పుడు ఒక GBకి దాదాపు రూ.10కి తగ్గింది. భారత మార్కెట్లో ఒక యూజర్ సగటున నెలకు 14GB వినియోగిస్తాడు. దీనికి నెలకు దాదాపు రూ.4200 ఖర్చు అవుతుంది కానీ, రూ.125-150 ఖర్చవుతుంది. ప్రభుత్వ ప్రయత్నాలే ఇందుకు కారణమని చెప్పవచ్చు.

ప్రపంచంలోని ఏ టెలికాం కంపెనీతో పోలిస్తే.. Jio 5G ప్లాన్‌లు దేశంలో అతి తక్కువ ధరలకు అందుబాటులో ఉంటాయని అంబానీ ప్రకటించారు. ఎయిర్‌టెల్‌లోని ఒక సీనియర్ అధికారి కూడా 5G ప్లాన్ ధరలు 4G ప్లాన్‌ల మాదిరిగానే ఉంటాయని చెప్పారు. ప్రస్తుతం 4G అన్‌లిమిటెడ్ బెనిఫిట్స్ కోసం దాదాపు రూ.500-600 ఖర్చు చేయాల్సి వస్తుంది. 5G ప్లాన్ ధరలు అదే రేంజ్‌లో తగ్గే అవకాశాలు ఉన్నాయి.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Airtel vs Jio vs Vi : రూ. 300 లోపు బెస్ట్ బడ్జెట్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లు ఇవే.. మీకు నచ్చిన ప్లాన్ ఎంచుకోండి..!

ట్రెండింగ్ వార్తలు