Airtel Plans Offer _ Airtel plans offering unlimited calling and data benefits with free OTT subscriptions_ check full list
Airtel Plans Offer : 2022 ఏడాదిలో టెలికాం ఆపరేటర్లు తమ ప్రీపెయిడ్ ప్లాన్‌ల నుంచి OTT బెనిఫిట్స్ తొలగించారు. ప్రముఖ టెలికం దిగ్గజాలైన రిలయన్స్ జియో (Reliance Jio), ఎయిర్‌టెల్ (Airtel)తో సహా ప్రముఖ టెల్కోలు ప్రీపెయిడ్ ప్లాన్‌ల రేంజ్‌తో OTT బెనిఫిట్స్ పొందవచ్చు. అయితే, టెల్కో కంపెనీలు తమ ప్రీపెయిడ్ ప్లాన్లలో ఆఫర్ల నుంచి పూర్తిగా తొలగించాయి. అదృష్టవశాత్తూ.. ఎంపిక చేసిన రీఛార్జ్ ప్లాన్‌లపై Airtel ఇప్పటికీ OTT బెనిఫిట్స్ అందిస్తోంది. OTT యాప్‌లకు ఉచిత యాక్సెస్‌తో అన్‌లిమిటెడ్ కాలింగ్, డేటా బెనిఫిట్స్ కోరుకునే Airtel యూజర్లు అనేక ప్రీపెయిడ్ ప్లాన్‌లను పొందవచ్చు. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (Disney Plus Hotstar) లేదా అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లకు ఉచిత సబ్‌స్క్రిప్షన్ వంటి OTT బెనిఫిట్స్ కలిగిన Airtel ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ల లిస్టును అందిస్తున్నాం.. ఇందులో మీకు నచ్చిన ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకోండి.
OTT బెనిఫిట్స్‌తో Airtel ప్రీపెయిడ్ ప్లాన్‌లు :
రూ. 399 ప్లాన్ : 28 రోజుల వ్యాలిడిటీతో ఈ ప్లాన్ అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMS, 2.5GB రోజువారీ డేటా లిమిట్ అందిస్తుంది. ఈ ప్యాక్ కింద OTT బెనిఫిట్స్ 3-నెలల డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను కలిగి ఉంటాయి. అదనంగా, వినియోగదారులు అపోలో 24|7 సర్కిల్, రూ. 100 ఫాస్ట్‌ట్యాగ్ క్యాష్‌బ్యాక్, ఉచిత హలోట్యూన్స్, ఉచిత వింక్ మ్యూజిక్ కూడా పొందవచ్చు.
రూ. 499 ప్లాన్ : ఎయిర్‌టెల్ యూజర్లు అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMS, 3GB రోజువారీ డేటా లిమిట్ 28 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 3 నెలల డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్, అపోలో 24|7 సర్కిల్, రూ. 100 ఫాస్ట్‌ట్యాగ్ క్యాష్‌బ్యాక్, ఉచిత హెలోట్యూన్స్, ఉచిత వింక్ మ్యూజిక్‌ని అందిస్తుంది.
Airtel Plans Offer _ Airtel plans offering unlimited calling and data benefits
రూ. 699 ప్లాన్ : ఎయిర్‌టెల్ వినియోగదారులు 56 రోజుల పాటు ఏదైనా 1 Xstream ఛానెల్‌లకు ఉచిత యాక్సెస్‌తో పాటు అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌కు యాక్సెస్ పొందవచ్చు. Xtream యాప్ Sony LIV, LionsgatePlay, ErosNow, ఇతరులతో సహా పలు రకాల ఛానెల్‌పై స్ట్రీమింగ్‌ను అందిస్తుంది. అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMS, 3GB రోజువారీ డేటా బెనిఫిట్స్ అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ అపోలో 24|7 సర్కిల్, రూ. 100 ఫాస్ట్‌ట్యాగ్ క్యాష్‌బ్యాక్, ఉచిత హెలోట్యూన్స్, 56 రోజుల ప్లాన్ వ్యాలిడిటీతో Free Wynk మ్యూజిక్‌ను అందిస్తుంది.
రూ. 839 ప్లాన్ : రూ. 699 ప్లాన్ మాదిరిగానే.. ఈ ప్లాన్ 84 రోజుల పాటు ఏదైనా 1 ఎంపిక చేసిన Xtream ఛానెల్‌లకు Xtream యాప్ యాక్సెస్‌ను అందిస్తుంది. అన్‌లిమిటెడ్ కాలింగ్‌తో, రోజుకు 100 SMS ఈ ప్లాన్ రోజువారీ హై-స్పీడ్ డేటా లిమిట్ రోజుకు 2GBకి సెట్ చేసింది. వినియోగదారులు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మొబైల్, అపోలో 24|7 సర్కిల్, రూ. 100 ఫాస్ట్‌ట్యాగ్ క్యాష్‌బ్యాక్, ఉచిత హెలోట్యూన్స్, ఉచిత వింక్ మ్యూజిక్‌కు 3 నెలల సభ్యత్వాన్ని కూడా పొందవచ్చు.
రూ. 999 ప్లాన్ : ఎయిర్‌టెల్ యూజర్లు అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్, 56 రోజుల పాటు ఏదైనా 1 ఎక్స్‌ట్రీమ్ ఛానెల్‌కు యాక్సెస్ చేయడమే కాకుండా Xstream యాప్ బెనిఫిట్స్ యాక్సెస్ పొందవచ్చు. అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMS, 2.5GB రోజువారీ డేటా లిమిట్ 84 రోజులు వరకు అందిస్తుంది. అదనంగా, ప్లాన్ రివార్డ్స్‌మినీ సబ్‌స్క్రిప్షన్, అపోలో 24|7 సర్కిల్, రూ. 100 ఫాస్ట్‌ట్యాగ్ క్యాష్‌బ్యాక్, ఉచిత హలోట్యూన్స్, ఉచిత వింక్ మ్యూజిక్‌ను కూడా అందిస్తుంది.
రూ. 3359 ప్లాన్ : ఈ వార్షిక ప్లాన్ అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMS, 2.5GB రోజువారీ డేటా లిమిట్‌తో 365 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. OTT బెనిఫిట్స్ సహా అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) మొబైల్ ఎడిషన్‌కు 1 ఏడాది సభ్యత్వం, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మొబైల్‌కు 1 ఏడాది సభ్యత్వాన్ని పొందవచ్చు. అదనంగా ఈ ప్లాన్‌లు అపోలో 24|7 సర్కిల్, రూ. 100 ఫాస్ట్ ట్యాగ్ క్యాష్‌బ్యాక్, ఉచిత హలోట్యూన్స్, ఉచిత వింక్ మ్యూజిక్ బెనిఫిట్స్ కూడా పొందవచ్చు.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..