Airtel Unlimited 5G Data : ఎయిర్టెల్ 5G హాట్‌స్పాట్ బ్లాక్ చేసిందా? వైరల్ న్యూస్‌పై అసలు నిజం ఇదే!
Airtel Unlimited 5G Data :ఎయిర్టెల్ వెబ్సైట్లో మొబైల్ హాట్ స్పాట్‌తో అన్లిమిటెడ్ 5జీ డేటా షేరింగ్ చేయలేరంటూ ఎలాంటి ప్రత్యేక నిబంధనలు కనిపించలేదు. కంపెనీ టర్మ్స్ అండ్ కండిషన్స్ పేజీలో కూడా ప్రస్తావించలేదు.
Airtel Unlimited 5G Data
- ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారా ఆఫర్‌ను క్లెయిమ్ చేసుకోవచ్చు
- కంపెనీ నిబంధనలు, షరతులకు సంబంధించి స్క్రీన్షాట్లు వైరల్
- 5జీ డేటా షేరింగ్‌పై వినియోగదారుల ఫిర్యాదులు
Airtel Unlimited 5G Data : ఎయిర్టెల్ యూజర్లకు బిగ్ అప్డేట్.. అన్లిమిటెడ్ 5G డేటాను నిజంగా మొబైల్ హాట్‌స్పాట్ ద్వారా షేర్ చేయలేమా? ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో భారీగా చర్చ నడుస్తోంది. వాస్తవానికి, 2023లో ఎయిర్టెల్ భారత టెలికం మార్కెట్లో అన్లిమిటెడ్ 5జీ డేటా ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి 5జీ ప్లాన్ యాక్టివ్ యూజర్లు అదనపు ఖర్చు లేకుండా అన్ లిమిటెడ్ 5జీ డేటాను వాడేస్తున్నారు.
అయితే, కొంతమంది యూజర్లు మాత్రం మొబైల్ హాట్‌స్పాట్‌తో అన్లిమిటెడ్ 5G డేటా షేరింగ్ అవ్వడం లేదంటూ ఫిర్యాదులు చేశారు. అందులోనూ ల్యాప్‌టాప్, టాబ్లెట్, ఇతర డివైజ్‌లకు 5జీ ఇంటర్నెట్ కనెక్ట్ కాలేకపోతున్నామని అంటున్నారు. దీనికి సంబంధించి ఆన్లైన్లో కొన్ని స్క్రీన్షాట్లు కూడా వైరల్ అయ్యాయి.
అందులో ప్రధానంగా ఎయిర్టెల్ అన్లిమిటెడ్ 5జీ డేటా ఆఫర్‌ను కేవలం పర్సనల్, నాన్ కమర్షియల్ వినియోగానికి మాత్రమే అనుమతిస్తామని, మొబైల్ హాట్‌స్పాట్ ద్వారా డేటా షేరింగ్‌కు అనుమతి లేదని పేర్కొన్నట్లు కనిపించింది. అయితే, ఈ నిబంధనలు నిజంగా ఎయిర్టెల్ అధికారిక వెబ్సైట్లో ఉన్నాయా? అనేదానిపై క్లారిటీ లేదు.
గాడ్జెట్స్360 ప్రకారం.. ఎయిర్టెల్ వెబ్సైట్లో అలాంటి ప్రత్యేక నిబంధనలు ప్రస్తుతం ఎక్కడా కనిపించడం లేదు. అలాగే, కంపెనీ అధికారిక టర్మ్స్ అండ్ కండిషన్స్ పేజీలో కూడా హాట్‌స్పాట్ ద్వారా అన్లిమిటెడ్ 5జీ డేటా వినియోగంపై నిషేధం ఉందని ప్రస్తావించలేదు.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. ఎయిర్టెల్ అధికారికంగా ‘హాట్‌స్పాట్ ద్వారా అన్లిమిటెడ్ 5జీ డేటాను షేర్ చేయలేరు’ అని ప్రకటించినట్టు ఎలాంటి ఆధారం కూడా లేదు. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే స్క్రీన్షాట్లు అసలు నిజమేనా? పాత నిబంధనలకు సంబంధించినవా? లేదా ఏదైనా ఇతర ఆఫర్లకు సంబంధించినదా? అనేది క్లారిటీ లేదు.
కొంతమంది యూజర్లకు మొబైల్ హాట్‌స్పాట్ వినియోగంలో ఇష్యూ ఉన్నప్పటికీ అది కొత్త నిబంధన కారణంగానే అనేందుకు కూడా ఎలాంటి ఆధారాలు కనిపించలేదు. అన్లిమిటెడ్ 5జీ హాట్‌స్పాట్ వినియోగంపై వైరల్ అవుతున్న నిబంధనలకు సంబంధించి ఎయిర్టెల్ నుంచి ఎలాంటి అధికారిక క్లారిటీ రాలేదు.
