Airtel vs Jio Offer : Airtel, Jio యూజర్లకు బంపర్ ఆఫర్.. ఒక్క రీఛార్జ్ చేస్తే మరో రీఛార్జ్ ఫ్రీ.. ఎందులో ఎక్కువ బెనిఫిట్స్?

Airtel vs Jio Offer : ఎయిర్ టెల్, జియో యూజర్లకు బై వన్ గెట్ వన్ ఫ్రీ రీఛార్జ్ ఆఫర్ అందిస్తున్నాయి. రూ.299 నుంచి రూ.399 వరకు ప్లాన్ల బెనిఫిట్స్, డేటా, వ్యాలిడిటీతో ఎలాంటి బెనిఫిట్స్ పొందవచ్చు? ఈ ఆఫర్ ఎవరికి వర్తిస్తుందో ఇప్పుడు చూద్దాం..

Airtel vs Jio Offer

  • Airtel, Jio కొత్త ఆఫర్ చూశారా?
  • రూ.299 నుంచి రూ.399 వరకు అదిరిపోయే ఆఫర్లు
  • ఒక్కసారి రీఛార్జ్ చేస్తే డబుల్ బెనిఫిట్స్..
  • ఈ రెండు రీఛార్జ్ ప్లాన్లపై ఓ లుక్కేయండి

Airtel vs Jio Offer : టెలికాం యూజర్లకు అదిరిపోయే న్యూస్.. ప్రముఖ టెలికాం కంపెనీలు ఎయిర్ టెల్, జియో తమ ఎంపిక చేసిన ప్రీపెయిడ్ యూజర్లకు బై వన్ గెట్ వన్ ఫ్రీ (Buy One Get One Free) ఆఫర్‌ను అందిస్తున్నాయి.

అర్హత ఉన్న యూజర్లు ఒక ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే మరో రీఛార్జ్‌ను ఫ్రీగా పొందే అవకాశం ఉంది. అయితే, ఇక్కడో చిన్న ట్విస్ట్ ఉంది. ఈ ఆఫర్ (Airtel vs Jio Offer) అందరికీ అందుబాటులో లేదు. కంపెనీల నుంచి ప్రత్యేకంగా SMS వచ్చిన యూజర్లు మాత్రమే ఈ ఆఫర్ క్లెయిమ్ చేసుకోగలరు.. మీకు కూడా ఈ SMS ఆఫర్ వచ్చిందో లేదో మైజియో యాప్ లో చెక్ చేసుకోండి..

ఎయిర్‌టెల్ రూ.349, రూ.399 ప్లాన్లలో ఏముంది? :
ఎయిర్‌టెల్ రూ.349 ప్లాన్‌లో 28 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 2GB డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ లభిస్తాయి. అర్హత ఉన్న ప్రాంతాల్లో అన్‌లిమిటెడ్ 5జీ డేటా కూడా వాడుకోవచ్చు.. అలాగే 12 నెలల అడోబ్ ఎక్స్ ప్రెస్ ప్రీమియం, ఎయిర్ టెల్ సేఫ్, ఫ్రీ హాలో టూన్స్ వంటి అదనపు బెనిఫిట్స్ పొందవచ్చు..

ఇక రూ.399 ప్లాన్ విషయానికొస్తే.. 28 రోజుల వ్యాలిడిటీతో అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 SMS బెనిఫిట్స్ లభిస్తాయి. ప్లాన్ స్పెషాలిటీ ఏమిటంటే రోజువారీ డేటా లిమిట్ లేకుండా అన్‌లిమిటెడ్ 4జీ, 5జీ డేటా బెనిఫిట్ పొందవచ్చు..

Read Also : Jio Cheapest Plan : జియో యూజర్లకు పండగే.. రూ.123కే 28 రోజుల వ్యాలిడిటీ, అన్‌లిమిటెడ్ కాల్స్.. వారికి మాత్రమే..!

జియో రూ.349, రూ.299 ప్లాన్లు ఎలా? :

జియో రూ.349 ప్లాన్‌లో రోజుకు 2GB డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, 100 SMS, 28 రోజుల వ్యాలిడిటీ ఉన్నాయి. అర్హత ఉన్నవారికి అన్‌లిమిటెడ్ 5జీతో పాటు జియోహాట్ స్టార్ మొబైల్, కాన్వా ప్రో లైట్, జియోటీవీ, జియోఏఐ క్లౌడ్ బెనిఫిట్స్ కూడా లభిస్తాయి.

మరోవైపు రూ.299 ప్లాన్‌లో రోజుకు 1.5GB డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, 100 SMS, 28 రోజుల వ్యాలిడిటీ ఉన్నాయి. అయితే, ఇందులో అన్‌లిమిటెడ్ 5జీ ఉండదు.

ఏ ప్లాన్ బెస్ట్ అంటే? :
ఎక్కువ డేటా వాడేవారికి ఎయిర్ టెల్ రూ.399 ప్లాన్ బెస్ట్ ఆప్షన్.. ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు అదనపు డిజిటల్ బెనిఫిట్స్ కావాలనుకునేవారికి జియో రూ.349 ప్లాన్ బెస్ట్.. తక్కువ ధరలో నార్మల్ రీఛార్జ్ కావాలనుకునేవారు జియో రూ.299 ప్లాన్‌ను తీసుకోవచ్చు..

ఈ గెట్ వన్ ఆఫర్ అందరికీ కాదు. మీ నంబర్‌కు ఎయిర్ టెల్ లేదా జియో నుంచి ఆఫర్‌కు సంబంధించిన SMS వచ్చిందో లేదో ముందుగా చెక్ చేసుకోండి. ఆ తర్వాతే రీఛార్జ్ చేసుకోవడం బెటర్..