Airtel vs Jio vs Vi : ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా, జియో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు ఇవే!

ప్రముఖ టెలికం దిగ్గజాలు ఎయిర్ టెల్, జియో, వోడాఫోన్ ఐడియా మిడ్ రేంజ్ ప్రీపెయిడ్ ప్లాన్లను అందిస్తున్నాయి. రూ.666 ప్రీపెయిడ్ ప్లాన్ ఆఫర్ చేస్తున్నాయి.

Airtel vs Jio vs Vi : దేశీయ టెలికం దిగ్గజాలు ప్రీపెయిడ్ ప్లాన్లపై టారిఫ్ రేట్లు పెంచేశాయి. అప్పటినుంచి టెలికం యూజర్లలలో ఏయే ప్లాన్ ఎంత అనేది కన్ఫూయిజ్ ఎదురవుతోంది. ఏ ప్లాన్ టారిఫ్ ఎంచుకోవాలి.. ఎందులో బెనిఫిట్స్ ఉన్నాయో తెలియడం కష్టంగా మారింది. కేవలం ప్రీపెయిడ్ ప్లాన్లు మాత్రమే కాదు.. స్ట్రీమింగ్ బెనిఫిట్స్ కూడా భారీగా తగ్గించేశాయి. ఇప్పుడు ఎయిర్ టెల్, జియో, వోడాఫోన్ ఐడియా మిడ్ రేంజ్ ప్రీపెయిడ్ ప్లాన్లను అందిస్తున్నాయి. రూ.666 ప్రీపెయిడ్ ప్లాన్ ఆఫర్ చేస్తున్నాయి.

ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియా 77 రోజుల వ్యాలిడిటీతో రూ.666 ప్రీపెయిడ్ ప్లాన్ అందిస్తున్నాయి. రిలయన్స్ జియో కూడా రూ.666 ప్లాన్‌పై 84 రోజుల వ్యాలిడిటీతో అఫర్ చేస్తోంది. రెండు నెలల కాలపరిమితితో పాటు డేటా, కాలింగ్ బెనిఫిట్స్ కోరుకునే యూజర్లకు బాగుంటుంది. గతవారమే వోడాఫోన్ ఐడియా కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ తీసుకొచ్చింది. రూ.700 లోపు ప్రీపెయిడ్ ప్లాన్లలో వరుసగా రూ.155, రూ.239, రూ.666 ఉన్నాయి. ఈ ప్లాన్లు అన్ని టెలికం సర్కిళ్లలో అందుబాటులో ఉన్నాయని, అలాగే Vi వెబ్ సైట్, మొబైల్ యాప్ ద్వారా కూడా ప్లాన్లను యాక్టివేట్ చేసుకోవచ్చు.

రూ. 666 ప్రీపెయిడ్ ప్లాన్ :
ఈ ప్లాన్ కింద అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, 1.5GB డెయిలీ డేటా, రోజుకు 100SMS పొందవచ్చు. Vi Movies, TV కంటెంట్ 77 రోజుల వ్యాలిడిటీతో యాక్సస్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్లలో అదనపు బెనిఫిట్స్.. బింగే ఆల్ నైట్ బెనిఫిట్స్ పొందవచ్చు. అలాగే వీకెండ్ రోల్ అవర్ డేటా బెనిఫిట్స్, డేటా డిలైట్స్ ఆఫర్ అందిస్తున్నాయి. ఎయిర్ టెల్ ఇప్పుడు అలాంటి ప్రీపెయిడ్ ప్లాన్ ఒకటి తీసుకొచ్చింది. రోజుకు 1.5GB డేటాను పొందవచ్చు. అన్ లిమిటెడ్ కాల్స్, రోజుకు 100SMS , 77 రోజుల వ్యాలిడిటీతో పొందవచ్చు. అదనపు బెనిఫిట్స్ Prime Video Mobile Edition, Apollo 24| 7 సర్కిల్, షా అకాడమీతో ఫ్రీ ఆన్‌లైన్ కోర్సులు, ఫాస్ట్ ట్యాగ్ 100 క్యాష్ బ్యాక్.. ఫ్రీ హాలో ట్యూన్స్, వైయాంక్ మ్యూజిక్ (Wynk Music) వంటి బెనిఫిట్స్ అందిస్తోంది.

రిలయన్స్ జియో రూ.666 ప్రీపెయిడ్ ప్లాన్లపై రోజుకు 1.5GB డెయిలీ డేటాతో పాటు అన్ లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 SMS, జియో యాప్స్ యాక్సస్ చేసుకోవచ్చు. 84 రోజుల వరకు ఈ ప్లాన్ వ్యాలిడిటీ ఉంటుంది. Vodafone Idea రూ. 699 ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందిస్తోంది. 56 రోజుల వ్యాలిడిటీతో 3GB రోజువారీ డేటాను ఆఫర్ చేస్తోంది. అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలతో యాక్సెస్‌తో అందిస్తుంది.

Jio రూ. 533 ప్లాన్‌ను ఆఫర్ చేస్తోంది. 56 రోజుల వ్యాలిడిటీతో పాటు 2GB రోజువారీ డేటా, అన్ లిమిటెడ వాయిస్ కాల్స్, రోజుకు 100 SMS, Jio యాప్‌లకు యాక్సెస్‌ పొందవచ్చు. ఎయిర్‌టెల్ రూ. 549 ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందిస్తుండగా.. అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలతో 56 రోజుల వ్యాలిడిటీతో 2GB రోజువారీ డేటాను ఆఫర్ చేస్తోంది. ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్, అపోలో 24కి కూడా 7 సర్కిల్‌లు యాక్సెస్ చేసుకోవచ్చు.

Read Also : Gmail user ALERT : మీ ఆండ్రాయిడ్, ఐఫోన్ నుంచి Secret email ఇలా పంపుకోవచ్చు!

ట్రెండింగ్ వార్తలు