Airtel working on Xstream AirFiber 5G to let you create 5G hotspot at home, office
Airtel Xstream AirFiber 5G : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం ఎయిర్‌టెల్ 5G (Airtel Fiber 5G) కనెక్టివిటీ పవర్ పెంచే హాట్‌స్పాట్ పరిష్కారంపై పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ కొత్త పరిష్కారం రూటర్ ద్వారా అందించనుంది. ఎయిర్‌టెల్ Xstream AirFiber 5G అని కూడా పిలుస్తారు. ఎయిర్‌టెల్ వినియోగదారులు యాక్సెస్ చేయడానికి పవర్ సోర్స్‌లోకి ప్లగ్ చేయాలి. డివైజ్ కాన్ఫిగర్ చేసేందుకు వినియోగదారులు ఎయిర్‌టెల్ సిమ్‌ని పొందాల్సి ఉంటుంది. డెడికేటెడ్ ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఎయిర్‌ఫైబర్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ప్రొడక్ట్ రిలయన్స్ జియో (JioAirFiber) మాదిరిగానే ఉంటుంది. సాంప్రదాయ Wi-Fi రూటర్‌లకు ప్రత్యామ్నాయంగా అందిస్తుంది. ఎయిర్‌టెల్ ఈ ప్రాసెస్ ఇంకా ధృవీకరించలేదు.
ఓన్లీటెక్ (Onlytech) ఫోరమ్‌లో అందుబాటులో ఉన్న స్క్రీన్‌షాట్‌ల ఆధారంగా GSMArena ద్వారా రిపోర్టు చేయొచ్చు. ఎయిర్‌టెల్ యూజర్లు గత వారమే (Google Play) యాప్ స్టోర్‌లో Xstream AirFiber యాప్ అని గుర్తించారు. మొబైల్‌లో ఎయిర్‌టెల్ 5G సిమ్ వాడితే యాప్‌ని ఓపెన్ చేస్తే.. లొకేషన్ యాక్సెస్ పొందాలి. మీకు సమీపంలోని 5G టవర్‌ని చూపిస్తుంది. స్క్రీన్‌షాట్ ఆధారంగా.. బెస్ట్ ఇంటర్నెట్ స్పీడ్ రూటర్‌ను ఉంచడానికి సరైన 5G కవరేజ్ జోన్ కనుగొనేందుకు యాప్ యూజర్లను అనుమతిస్తుంది. ఈ యాప్ Xstream AirFiber 5G రూటర్‌లో కూడా అందించింది. Jio AirFiber పొడవైన డిజైన్‌ను పోలి ఉంటుంది.
SIM కార్డ్ రూటర్ దిగువన ఉన్న స్లాట్‌లో కనిపిస్తుంది. వినియోగదారులు తమ ల్యాప్‌టాప్‌లు లేదా PCని ఫిజికల్‌గా ఎయిర్‌టెల్ రూటర్‌కి కనెక్ట్ చేయాలనుకుంటే వెనుక భాగంలో పవర్ సోర్స్, అనేక ఈథర్‌నెట్ పోర్ట్‌లు ఉంటాయి. ఈ మెథడ్ సాధారణంగా వేగవంతమైనది. మరింత స్టేబుల్ ఇంటర్నెట్ స్పీడ్ అందిస్తుంది. డివైజ్ రెడీ అయిన తర్వాత వినియోగదారులు ఇంటర్నెట్ నెట్‌వర్క్, సెల్యులార్ నెట్‌వర్క్, Wi-Fi కనెక్టివిటీకి 3 ఇండికేషన్లను చూడవచ్చు. రిలయన్స్ జియో AirFiber వర్కింగ్ కోసం ఇదే మెథడ్ ఉపయోగిస్తుంది.
Airtel working on Xstream AirFiber 5G to let you create 5G hotspot at home, office
ఎయిర్‌టెల్ ఇంకా కొత్త డివైజ్ ప్రకటించలేదు. హాట్‌స్పాట్ సొల్యూషన్ చాలా మంది యూజర్లకు అందుబాటులో ఉంది. ఒకే ప్రాంతంలో Wi-Fi స్పాట్‌ను క్రియేట్ చేయడానికి వీలుంటుంది. రూటర్‌కు ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్ అవసరం లేదు. బలమైన 5G కనెక్టివిటీ ఉన్నట్లయితే.. వినియోగదారులు ఈ రూటర్ ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. ఎయిర్‌టెల్ సాంప్రదాయ Wi-Fi వ్యాపారాన్ని మరింత పెంచనుంది. ఎయిర్‌టెల్ ఇప్పటికీ భారత బ్రాడ్‌బ్యాండ్ (వైర్డ్ + వైర్‌లెస్) మార్కెట్‌లో ముఖ్యమైన లొకేషన్ కలిగి ఉంది. ఏప్రిల్ 2023 నాటికి ఈ నెలలో TRAI డేటా ప్రకారం.. 28.72 శాతం వాటాను (జియో తర్వాత) పొందింది.
ఇంతలో, ఎయిర్‌టెల్ Xstream AirFiber 5G ద్వారా Wi-Fi 6 రౌటర్‌ను ఆఫర్ చేస్తుందని ఓన్లీటెక్ నివేదించింది. ఎయిర్‌టెల్ 100Mbps స్పీడ్‌తో 6 నెలల సెమీ-వార్షిక ప్లాన్‌ను రూ. 2,994 (నెలకు దాదాపు రూ. 499) అందజేస్తుందని నివేదిక తెలిపింది. సాధారణ Airtel Xstream ఫైబర్ ప్లాన్ కన్నా చాలా తక్కువ ధర రూ. 499కు అందించింది. ఈ ప్లాన్ గరిష్టంగా 40Mbps స్పీడ్ అందిస్తుంది.