Aman Pandey : గూగుల్‌లో బగ్ కనిపెట్టాడు.. ఓవర్ నైట్లో కోటీశ్వరుడయ్యాడు..!

ఇతడో బగ్ హంటర్.. భారతీయ టెక్కీ.. ఏదైనా వెబ్ అప్లికేషన్‌లో బగ్ ఉంటే వెతికిమరి చిటికెలో కనిపెట్టేస్తాడు. అతడే.. అమన్ పాండే... ఇతగాడికి సాంకేతిక లోపాలను కనిపెట్టడంటే చాలా ఆసక్తి..

Aman Pandey Bug Hunter : ఇతడో బగ్ హంటర్.. భారతీయ టెక్కీ.. ఏదైనా వెబ్ అప్లికేషన్‌లో బగ్ ఉంటే వెతికిమరి చిటికెలో కనిపెట్టేస్తాడు. అతడే.. అమన్ పాండే… ఇతగాడికి సాంకేతిక లోపాలను కనిపెట్టడంటే చాలా ఆసక్తి.. వెబ్ సైట్ల, యాప్స్ ఏమైనా సరే వాటిలో బగ్స్ ఉంటే వెంటనే కనిపెట్టేస్తాడు. ఇప్పడు అదే అతడ్ని ఓవర్ నైట్లో కోటీశ్వరుడిని చేసేసింది. ఇప్పటివరకూ గూగుల్‌లో 300 బగ్‌లను కనిపెట్టాడట.. అందుకే గూగుల్ కంపెనీ అమన్ పాండేకు రూ.66 కోట్లు బౌంటీ రివార్డ్‌ను చెల్లించింది. ఉత్తరాఖండ్‌లో జన్మించిన అమన్‌ పాండే.. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌ NITలో బీటెక్‌ పూర్తి చేశాడు. ఆ తర్వాత బగ్స్‌ మిర్రర్‌ (Bugs Mirror) అనే సంస్థను ప్రారంభించి 15 మంది ఉద్యోగులను కూడా నియమించుకున్నాడు. గతేడాది గూగుల్‌లో ఉన్న బగ్‌లను కనిపెట్టాడు.. ఆ తర్వాత గూగుల్ నుంచి వరుస ప్రాజెక్టులు తీసుకున్నాడు. ఒక్క ఏడాదిలోనే 300 బగ్స్ (లోపాలను) కనిపెట్టి రూ.66 కోట్లు రివార్డు అందుకున్నాడు.

దాంతో గూగుల్ వల్నరబిలిటీ రివార్డ్స్ ప్రోగ్రామ్ (Vulnerability Rewards Program) లేదా VRP అగ్ర పరిశోధకుల జాబితాలో అమన్ పాండేకు చోటు దక్కింది. Google ప్రకారం.. అమన్ పాండే.. 2019 నుంచే గూగుల్ బగ్స్ నివేదించడం ప్రారంభించాడు. గత ఏడాదిలో ఆండ్రాయిడ్‌లో 232 లోపాలు (vulnerabilities), 280 valid problems గుర్తించి సమర్పించినట్లు ఓ నివేదిక వెల్లడించింది. NIT భోపాల్ నుంచి BTech గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన పాండే.. గొప్ప బగ్ హంటర్‌గా పేరు తెచ్చుకున్నాడు. మొబైల్ అప్లికేషన్ డెవలప్‌మెంట్, మొబైల్ అప్లికేషన్స్, జావా, సాఫ్ట్‌వేర్‌గా సర్వీస్ ప్రోడక్ట్ డెవలప్‌మెంట్‌లో నైపుణ్యాన్ని సంపాదించాడు. గూగుల్‌లోని లోపాలను కనిపెడుతూ కోట్లు సంపాదించాడు.

గూగులే కాదు.. ఆపిల్, శాంసంగ్ కూడా తన క్లయింట్‌లేనట..
ఆండ్రాయిడ్, క్రోమ్‌లను బగ్స్ గుర్తించి గూగుల్ నుంచి కోట్ల రూపాయలను రివార్డుగా పొందాడు. ఒక్క గూగుల్ మాత్రమే కాదు. ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్, సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్‌ కూడా తన క్లయింట్లేనని అమన్‌ చెబుతున్నాడు. సైబర్ భద్రత ముప్పు నుంచి సేఫ్ గా వెబ్ అప్లికేషన్లను ప్రొటెక్ట్ చేసేందుకు అందులోని బగ్స్ కనిపెడుతుంటాడు అమన్ పాండే. స్మార్ట్‌ఫోన్‌లు, PDAలు లేదా ఏదైనా IoT డివైజ్‌లను మాల్వేర్ వైరస్‌ల నుంచి ప్రొటెక్ట్ చేసేందుకు బగ్ మిర్రర్ అనే సంస్థను కూడా స్థాపించాడు పాండే.

సాధారణంగా ప్రపంచ టెక్ దిగ్గజాలైన గూగుల్, ఆపిల్, మైక్రోసాఫ్ట్ కంపెనీలు తాము రూపొందించిన అప్లికేషన్లలో ఏమైనా లోపాలు (Bugs) ఉన్నాయో లేదో కనిపెట్టేందుకు బగ్ హాంటర్లను నియమించుకుంటాయి. తమ అప్లికేషన్లలో బగ్స్ కనిపెట్టిన టెక్కీలకు బగ్స్ బౌంటీ ప్రొగ్రామ్ ద్వారా లక్షలు, కోట్లల్లో రివార్డులను అందిస్తాయి. 2021లోనే ఆండ్రాయిడ్ దాదాపు 3 మిలియన్ డాలర్ల రివార్డులకు గూగుల్ వెచ్చించింది. 2020 గణాంకాల కంటే రెండింతలుగా క్రిటికల్ బగ్స్‌ను ప్రపంచవ్యాప్తంగా 119 మంది టెక్కీలు కనుగొన్నారు. వీరికి గూగుల్ VRPగా 8.7 మిలియన్ డాలర్లను చెల్లించింది.

ఈ VRP ప్రొగ్రామ్ ద్వారా 2021లో పాండే 8.7 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 65.3 కోట్లు) సంపాదించాడు. ఈ ఏడాదిలో కూడా VRP ద్వారా చరిత్రలోనే అత్యధికంగా కోట్లు సంపాదించాడు పాండే. ఆండ్రాయిడ్‌లో గుర్తించిన బగ్‌కు 157వేల డాలర్లను గూగుల్ చెల్లించింది. అంతేకాదు.. పిక్సెల్ మొబైల్ (Pixel Mobiles) డివైజ్‌ల్లోని టైటాన్-ఎమ్ సెక్యూరిటీ చిప్‌లో బగ్స్ కనుగొన్నందుకు 1.5 మిలియన్ డాలర్ల రివార్డును కూడా గూగుల్ ఆఫర్ చేసింది. Chrome బ్రౌజర్ లో బగ్స్ కనిపెట్టేందుకు గూగుల్ ‘బౌంటీ’ ద్వారా కొత్త రికార్డును నెలకొల్పింది. 333 స్పెషల్ Chrome సెక్యూరిటీ సమస్యలను గుర్తించేందుకు 110 కంటే ఎక్కువ మంది టెక్కీలను గూగుల్ ఆహ్వానించింది. ఇందులో బగ్ కనిపెట్టినవారికి 3.3 మిలియన్ డాలర్లను అందించింది.

Read Also : Windows 11 Bug : కొత్త విండోస్‌ 11 వెర్షన్‌లో బగ్‌.. మానిటర్ రంగులు మార్చేస్తుంది..! 

ట్రెండింగ్ వార్తలు