Amazon Great Freedom Sale 2026 : అమెజాన్‌లో అద్భుతమైన ఆఫర్లు.. ఈ వన్‌ప్లస్ ఫోన్లపై భారీ తగ్గింపులు.. ఛాన్స్ మిస్ కాకండి!

Amazon Great Freedom Sale 2026 : అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ఆగస్టు 7న ప్రారంభం కానుంది. ఈ సేల్‌కు ముందు వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లపై అద్భుతమైన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. వన్‌ప్లస్ 15, నార్డ్ 6, నార్డ్ సీఈ6, నార్డ్ ఎన్6ఎక్స్ వంటి అనేక మోడళ్లు బ్యాంకు ఆఫర్లతో లభిస్తాయి.

Amazon Great Freedom Sale 2026

  • అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్‌లో వన్‌ప్లస్ ఫోన్‌లపై భారీ తగ్గింపులు
  • వన్‌ప్లస్ 15 నుంచి నార్డ్ N6x వరకు ధరలు వెల్లడి
  • ధరలు, బ్యాంకు ఆఫర్లతో కలిపి వన్‌ప్లస్ ఫోన్లపై తగ్గింపులు

Amazon Great Freedom Sale 2026 : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ భారత మార్కెట్లో ఆగస్టు 7న ప్రారంభం కానుంది. స్వాతంత్ర్య దినోత్సవం 2026 సందర్భంగా ఈ సేల్‌ నిర్వహించనుండగా అనేక స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, టాబ్లెట్‌లు, స్మార్ట్‌వాచ్‌లు ఇతర ఎలక్ట్రానిక్ ప్రొడక్టులపై భారీ డిస్కౌంట్లు లభించనున్నాయి.

ఈ సేల్‌కు ముందే వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లపై డీల్స్ కూడా రివీల్ అయ్యాయి. అమెజాన్ ఇండియా టీజర్ పేజీ ప్రకారం.. బ్యాంక్ డిస్కౌంట్లు, ఇతర (Amazon Great Freedom Sale 2026) ఆఫర్లతో అత్యంత తక్కువ ధరకే కొనేసుకోవచ్చు.

ఈ సేల్ సమయంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈజీ ఈఎంఐ లావాదేవీలపై 10శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుందని అమెజాన్ ప్రకటించింది. అదనంగా, అమెజాన్ పే యూపీఐ ఇతర ప్రీపెయిడ్ పేమెంట్ మెథడ్స్‌తో రూ. 150 వరకు అదనపు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.

Read Also : Samsung Galaxy F70 Pro 5G : శాంసంగ్ ఫ్యాన్స్‌కు పండగే.. భారీ బ్యాటరీతో కొత్త 5G ఫోన్ ఎంట్రీ! బడ్జెట్ ధరకే అదిరే ఫీచర్లు

అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో నాన్-ఈఎంఐ లావాదేవీలపై 5శాతం అన్‌లిమిటెడ్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. కస్టమర్లు అమెజాన్ పే లేటర్ ద్వారా నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు కూడా ఎంచుకోవచ్చు.

వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ :

వన్‌ప్లస్ 15 ఫోన్ ధర రూ. 81,999, వన్‌ప్లస్ 15R రూ. 56,999, వన్‌ప్లస్ 13S రూ. 49,999గా ఉండొచ్చు. వన్‌ప్లస్ నార్డ్ సిరీస్ విషయానికి వస్తే.. వన్‌ప్లస్ నార్డ్ 6 ఫోన్ రూ. 41,999 ధరకు లాంచ్ అయింది. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 6 రూ. 31,999కు, వన్‌ప్లస్ నార్డ్ సీఈ 6 లైట్‌ను రూ. 24,999కు కొనేసుకోవచ్చు.

మీరు బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ఫోన్ కోసం చూస్తుంటే.. ఎన్ సిరీస్‌ చెక్ చేయడం బెటర్.. లిస్టింగ్ ప్రకారం.. వన్‌ప్లస్ N6 ధర రూ. 20,999 కాగా కొత్త వన్‌ప్లస్ నార్డ్ N6x ఫోన్ రూ. 17,499 ధరకు లభ్యం కానుంది. ఈ ధరలో బ్యాంక్ ఆఫర్‌లు, ఇతర కూపన్ డిస్కౌంట్‌లు పొందవచ్చు. సేల్ మొదలయ్యాక ప్రొడక్టు పేజీలో డిస్కౌంట్‌లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లలో మార్పులు ఉండొచ్చు.