Samsung Galaxy F70 Pro 5G : శాంసంగ్ ఫ్యాన్స్‌కు పండగే.. భారీ బ్యాటరీతో కొత్త 5G ఫోన్ ఎంట్రీ! బడ్జెట్ ధరకే అదిరే ఫీచర్లు
Samsung Galaxy F70 Pro 5G : శాంసంగ్ నుంచి కొత్త గెలాక్సీ F70 ప్రో 5జీ ఫోన్ లాంచ్ అయింది. 6000mAh బ్యాటరీతో అత్యంత ఆకర్షణీయంగా ఉంది. ఈ శాంసంగ్ ఫోన్ ధర, స్పెషిఫికేషన్లు, ఆఫర్లకు సంబంధించి పూర్తి వివరాలివే..
Samsung Galaxy F70 Pro 5G
- బడ్జెట్ ధరలో ప్రీమియం ఫీల్.. శాంసంగ్ కొత్త 5G ఫోన్ ఫుల్ వైరల్
- ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజంతా టెన్షన్ ఉండదు.. ధర తక్కువ.. ఫీచర్లు ఎక్కువ
- బ్యాటరీ పవర్, డిస్ప్లే క్వాలిటీతో ప్రీమియం లుక్ అదుర్స్
Samsung Galaxy F70 Pro 5G : శాంసంగ్ లవర్స్ కోసం అదిరిపోయే 5జీ ఫోన్ వచ్చేసింది. భారత మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ F70 ప్రో 5జీ ఫోన్ లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ 2026 ప్రారంభంలో లాంచ్ అయిన గెలాక్సీ F70e 5జీ తర్వాత వచ్చింది.
గెలాక్సీ F70 లైనప్‌లో ఇది సెకండ్ మోడల్. ఈ సౌత్ కొరియా స్మార్ట్‌ఫోన్ తయారీదారు అమోల్డ్ డిస్ప్లే, గెలాక్సీ ఏఐ ఫీచర్లు, 50MP ప్రైమరీ కెమెరా, 6000mAh బ్యాటరీని (Samsung Galaxy F70 Pro 5G) అమర్చింది. సరికొత్త శాంసంగ్ గెలాక్సీ F70 ప్రో 5జీ ఫోన్ ఫీచర్లు, ధరకు సంబంధించి పూర్తి వివరాలివే..
స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
శాంసంగ్ గెలాక్సీ F70 ప్రో 5జీ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ప్రొటెక్షన్‌తో 6.7-అంగుళాల ఫుల్ HD+ సూపర్ అమోల్డ్ డిస్ప్లేతో వస్తుంది. ఈ హ్యాండ్సెట్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 చిప్సెట్తో రన్ అవుతుంది. 8GB వరకు LPDDR5X ర్యామ్, 256GB యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ అందిస్తుంది.
కెమెరాల విషయానికొస్తే.. :
ఈ శాంసంగ్ ఫోన్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) ఫీచర్‌తో 50MP ప్రైమరీ కెమెరా, 5MP అల్ట్రా-వైడ్ కెమెరా, 2MP మాక్రో సెన్సార్ అమర్చారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం HDR సపోర్ట్‌తో 12MP ఫ్రంట్ కెమెరా వాడారు. శాంసంగ్ గెలాక్సీ F70 ప్రో 5జీలో సర్కిల్ టు సెర్చ్, జెమిని వాయిస్ అసిస్టెంట్, ఏఐ వాయిస్ ట్రాన్స్క్రిప్షన్, డైరెక్ట్ వాయిస్‌మెయిల్, నౌ బార్ వంటి అనేక గెలాక్సీ ఏఐ ఫీచర్లు ఉన్నాయి.
ఆండ్రాయిడ్ 16 ఆధారిత వన్ యూఐ 8.5తో రన్ అయ్యే ఈ స్మార్ట్‌ఫోన్‌కు 6 ఏళ్ల ఆండ్రాయిడ్ OS అప్గ్రేడ్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్లు లభిస్తాయి. ఈ ఫోన్లో 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో భారీ 6000mAh బ్యాటరీ కూడా ఉంది.
భారత్‌లో ధర, ఆఫర్లు :
టెక్ దిగ్గజం శాంసంగ్ నుంచి గెలాక్సీ F70 ప్రో 5జీ ఫోన్ 6జీబీ + 128జీబీ వేరియంట్ రూ. 25,999 ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. 8GB + 128GB మోడల్ ధర రూ. 29,999 కాగా, టాప్-ఎండ్ 8GB + 256GB వెర్షన్ ధర రూ. 34,999గా ఉంది.
ప్రారంభ ఆఫర్లలో భాగంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ. 23,999 ప్రారంభ ధరకే కొనేసుకోవచ్చు. ఈ హ్యాండ్సెట్ ఆల్ఫా బ్లాక్, ఆరా గ్రీన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ శాంసంగ్ ఫోన్ ఇండియా ఆన్లైన్ స్టోర్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్‌లో కూడా లభ్యం కానుంది.
