Telugu » Technology » Amazon Great Republic Day Sale 2026 Iqoo 15 Price To Drop By Rs 7k Only Sh
iQOO 15 Price : కొత్త ఫోన్ కావాలా? ఐక్యూ 15పై ఖతర్నాక్ డిస్కౌంట్.. అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే?
iQOO 15 Price : అతి త్వరలో అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ మొదలు కానుంది. ఐక్యూ 15 స్మార్ట్ ఫోన్‌పై అద్భుతమైన డిస్కౌంట్ అందిస్తోంది. ఈ డీల్ ఎలా పొందాలంటే?
iQOO 15 Price : కొత్త ఐక్యూ ఫోన్ కోసం చూస్తున్నారా? జనవరి 16న అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026 ప్రారంభం కానుంది. అనేక బ్రాండ్ల స్మార్ట్ ఫోన్లపై అద్భుతమైన డిస్కౌంట్లను అందించనుంది.
2/6
ఈ సేల్ సమయంలో స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు, ల్యాప్‌టాప్‌లు, టెలివిజన్‌లు, కెమెరాలు, అప్లియన్సెస్, ఆడియో డివైజ్‌లు, వేరబుల్, గృహ, కిచెన్ అప్లియన్సెస్, ఆటో అప్లియన్సెస్ మరిన్నింటిపై డీల్స్ అందుబాటులో ఉన్నాయి.
3/6
మీ పాత స్మార్ట్‌ఫోన్ అప్‌గ్రేడ్ చేసుకోవాలనుకునే వారికి ఈ సేల్ అద్భుతంగా ఉంటుంది. అనేక స్మార్ట్‌ఫోన్ డీల్స్ అమెజాన్ ఇప్పటికే ప్రకటించింది. అందులో ఐక్యూ 15పై భారీ తగ్గింపు అందిస్తోంది. పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.
4/6
ఐక్యూ 15 అమెజాన్ డీల్ : భారత మార్కెట్లో ఐక్యూ 15 రూ.72,999 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026 సమయంలో ఐక్యూ 15 రూ.65,999 ధరకు అందుబాటులో ఉంటుంది. ఈ ధర తగ్గింపులో బ్యాంక్ ఆఫర్లు కూడా ఉంటాయి.
5/6
ఐక్యూ 15 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు : ఐక్యూ 15లో 6.85-అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 2600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉన్నాయి. హుడ్ కింద క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 మొబైల్ ప్లాట్‌ఫామ్‌పై రన్ అవుతుంది. 16GB వరకు ర్యామ్, 512GB వరకు UFS 4.1 స్టోరేజ్‌తో వస్తుంది. ఇంకా ఐక్యూ ఫోన్ 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 7000mAh బ్యాటరీతో సపోర్టు ఇస్తుంది.
6/6
ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. ఐక్యూ 15 లో ట్రిపుల్ 50MP బ్యాక్ కెమెరా సిస్టమ్ ఉంది. ఇందులో ప్రైమరీ సోనీ IMX921 సెన్సార్, లాస్‌లెస్ జూమ్‌తో 3x పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, అల్ట్రా-వైడ్-యాంగిల్ షూటర్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ 32MP కెమెరా కూడా ఉంది.