Amazon India: ఇండియాలో మల్టీ మార్కెటింగ్ కోసం మల్టీ ఛానల్ ఫుల్ ఫిల్మెంట్‭ను ప్రారంభించిన అమెజాన్

ఇది అసాధారణమైన వేగం, సౌలభ్యంతో సౌకర్యవంతమైన ఫుల్ ఫిల్మెంట్ను అందిస్తుంది. MCF ద్వారా, అమెజాన్ కస్టమర్ ఆర్డర్ ఫుల్ ఫుల్‌ఫిల్‌మెంట్ ను అందరికీ అందుబాటులోకి చేరుస్తుంది

Multi Channel Full Fulfillment: భారతదేశంలో మల్టీ-ఛానల్ ఫుల్‌ఫిల్‌మెంట్(MCF)ను ప్రారంభించినట్లు అమెజాన్ ఇండియా ప్రకటించింది. ఈ ఆవిష్కరణతో, D2C బ్రాండ్‌లు, తయారీదారులు, పరిశ్రమలలోని రిటైలర్‌లతో సహా విక్రేతలు తమ ఫుల్ ఫిల్మెంట్ కార్యకలాపాలను మార్చవచ్చు. అమెజాన్ భారత దేశ వ్యాప్త కార్యకలాపాలు, అత్యాధునికమైన ఫుల్ ఫిల్మెంట్ కేంద్రాలు, స్వంత వెబ్‌సైట్‌లతో సహా విస్తృత శ్రేణి విక్రయ ఛానెల్‌ల నుంచి స్వీకరించబడిన కస్టమర్ ఆర్డర్‌లను నిర్వహించడానికి లాజిస్టిక్స్ సామర్థ్యాలను ఉపయోగించుకోవడం ద్వారా తమ కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచుకోవచ్చు.

ఇది అసాధారణమైన వేగం, సౌలభ్యంతో సౌకర్యవంతమైన ఫుల్ ఫిల్మెంట్ను అందిస్తుంది. MCF ద్వారా, అమెజాన్ కస్టమర్ ఆర్డర్ ఫుల్ ఫుల్‌ఫిల్‌మెంట్ ను అందరికీ అందుబాటులోకి చేరుస్తుంది. MCF విక్రేతలు తమ ఆఫ్-అమెజాన్ షాపర్‌ల కోసం ఆర్డర్‌లను సృష్టించడం, వాటిని ట్రాక్ చేయడం, టాక్స్ ఇన్‌వాయిస్‌లను రూపొందించడాన్ని సులభతరం చేస్తుంది. అదే సమయంలో వేగవంతమైన షిప్పింగ్, వేగవంతమైన డెలివరీని అందిస్తుంది. ఇది విక్రేతల కోసం పూర్తి ప్రక్రియను సులభతరం చేస్తుంది, కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరుస్తుంది, పెరిగిన విక్రయాలకు అవకాశాలను అందిస్తుంది.

Vivo T2 Pro Launch : ఈ ఫోన్ భలే ఉంది బ్రో.. వివో T2 ప్రో ఫోన్ వచ్చేసిందోచ్.. దిమ్మతిరిగే ఫీచర్లు.. ధర ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు..!

అమ్మకందారులు అమెజాన్ ఫుల్ ఫిల్మెంట్ ద్వారా కూడా ప్రయోజనం పొందుతారు. ఇన్‌బౌండ్ రవాణా, లేబులింగ్, స్టోరేజ్, ఆర్డర్ మేనేజ్‌మెంట్, పిక్-ప్యాక్, షిప్పింగ్ సేవలు వంటి అనేక సేవలలో విస్తరించి ఉన్న సౌకర్యవంతమైన, సరసమైన, స్కేలబుల్ నిల్వ, ఫుల్ ఫిల్మెంట్ పరిష్కారంతో కార్యకలాపాలను క్రమబద్దీకరించటంతో సామర్ధ్యం మెరుగుపరుస్తుంది. మల్టీ -ఛానెల్ ఫుల్ ఫిల్మెంట్ ఈ సవాళ్లను వారి పూర్తి అవసరాల కోసం సమగ్రమైన, ఉత్తమ-తరగతి పరిష్కారం ద్వారా పరిష్కరిస్తుంది. ఇది ఉత్పత్తి అభివృద్ధి, మార్కెటింగ్, కస్టమర్ సేవ వంటి ప్రధాన వ్యాపార కార్యకలాపాలపై దృష్టి పెట్టడానికి విక్రేతలను అందిస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది.