Vivo T2 Pro Launch : ఈ ఫోన్ భలే ఉంది బ్రో.. వివో T2 ప్రో ఫోన్ వచ్చేసిందోచ్.. దిమ్మతిరిగే ఫీచర్లు.. ధర ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు..!

Vivo T2 Pro Launch : కొత్త ఫోన్ కొంటున్నారా? భారత మార్కెట్లోకి వివో T2 ప్రో ఫోన్ వచ్చేసింది. ఫీచర్ల కోసమైన ఫోన్ కొనేసుకోవచ్చు. ధర ఎంతో తెలుసా? పూర్తి వివరాలు మీకోసం..

Vivo T2 Pro Launch : ఈ ఫోన్ భలే ఉంది బ్రో.. వివో T2 ప్రో ఫోన్ వచ్చేసిందోచ్.. దిమ్మతిరిగే ఫీచర్లు.. ధర ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు..!

Vivo T2 Pro Launched in India, price starts at Rs 23,999, Check specs and other details

Vivo T2 Pro Launch : కొత్త ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? భారత మార్కెట్లోకి ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో (Vivo) నుంచి సరికొత్త ఫోన్ (Vivo T2 Pro 5G) మోడల్ వచ్చేసింది. వివో T2 ప్రో ఫోన్ బేస్ మోడల్ 8GB RAM, 128GB స్టోరేజ్‌తో రూ.23,999 ప్రారంభ ధరతో వస్తుంది. ప్రారంభ ధర రూ. 25వేల లోపు ఉంటుంది. ఈ ఫీచర్లు, ధరలు రెండూ ఒకేలా ఉంటాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రాసెసర్, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 3D కర్వ్డ్ డిస్‌ప్లే, 64MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, కొన్ని ముఖ్య ఫీచర్ల వివరాలు ఇలా ఉన్నాయి.

Read Also : Apple iPhone 15 Pro Sale : ఆపిల్ ఐఫోన్ 15ప్రో సేల్.. ఈ కొత్త ఐఫోన్ టచ్ చేస్తే చాలు.. టైటానియం ఫ్రేమ్ రంగులు మార్చేస్తుంది.. ధర ఎంతంటే? 

వివో T2 ప్రో భారత్ ధర ఎంత?, సేల్ వివరాలివే :
వివో ప్రో ఫోన్ 8GB RAM 128GB స్టోరేజ్‌తో బేస్ మోడల్ రూ.23,999 ఉండగా, 256GB స్టోరేజ్ మోడల్ ధర రూ.24,999గా నిర్ణయించింది. మొదటి సేల్ సెప్టెంబర్ 29న సాయంత్రం 7:00 గంటలకు ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటుంది. లాంచ్‌లో భాగంగా కంపెనీ సేల్ ఆఫర్లను కూడా ప్రకటించింది. యాక్సిస్ బ్యాంక్, ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై రూ. 2వేలు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఆఫర్, రూ. 1,000 అదనపు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా పొందవచ్చు.

Vivo T2 Pro Launched in India, price starts at Rs 23,999, Check specs and other details

Vivo T2 Pro Launch, price starts at Rs 23,999, Check specs and other details

వివో T2 ప్రో సిరీస్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు :
వివో ఫోన్ (iQOO Z7 Pro) మాదిరిగానే డిజైన్‌ను కలిగి ఉంది. మీరు కర్వ్డ్ డిస్‌ప్లే, స్లిమ్ డిజైన్‌ పొందవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ చాలా తేలికైనది. వివో T2 ప్రో మోడల్ 6.78-అంగుళాల స్క్రీన్‌తో వస్తుంది. హుడ్ కింద MediaTek డైమెన్సిటీ 7200 చిప్‌సెట్ ద్వారా ఆధారితమైనది. ఈ డివైజ్ Android 13 OSతో వస్తుంది. వెనుకవైపు 2 కెమెరాలు ఉన్నాయి. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్టుతో 64MP ప్రధాన కెమెరా, రింగ్ ఆకారంలో LED ఫ్లాష్ ఉన్నాయి.

సెకండరీ సెన్సార్ 2MP సెన్సార్, ఫ్రంట్ సైడ్ సెల్ఫీలకు 16MP కెమెరాను చూడవచ్చు. 5G ఫోన్ 4,600mAh బ్యాటరీని అందిస్తుంది. కంపెనీ 66W ఛార్జింగ్ స్పీడ్‌కు సపోర్టును అందించవచ్చు. వివో మార్కెట్‌లోని అనేక బ్రాండ్‌ల మాదిరిగా కాకుండా 5G ఫోన్‌తో పాటు రిటైల్ బాక్స్‌లో ఫాస్ట్ ఛార్జర్‌ను కూడా అందిస్తుంది.

Read Also : Reliance Jio Offers : ఆపిల్ ఐఫోన్ 15 కొనుగోలుపై జియో ఆఫర్లు.. 6 నెలల ఫ్రీపెయిడ్ ప్లాన్ ఉచితం.. ఈ ఆఫర్ మళ్లీ రాదు.. డోంట్ మిస్!