Amazon Laptop Deals
Amazon Laptop Deals : కొత్త ల్యాప్‌టాప్ కొనేవారికి గుడ్ న్యూస్.. అమెజాన్ ప్రైమ్ డే 2025 సేల్ వచ్చేసింది. ప్రత్యేకించి ల్యాప్‌టాప్ కొనుగోలుచేసేవారికి అద్భుతమైన డీల్స్ అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్‌టీవీలు హియరబుల్స్ మాత్రమే కాదు.. ఈ సేల్ అన్ని కేటగిరీల నుంచి ల్యాప్‌టాప్‌లపై కొన్ని బెస్ట్ డిస్కౌంట్‌లను ఆఫర్ చేస్తోంది.
మీరు గేమింగ్ ల్యాప్‌టాప్ కావాలన్నా లేదా సరసమైన ధరలకు పవర్-ప్యాక్డ్ మెషీన్ కోసం చూస్తున్నా అన్ని రకాల గాడ్జెట్లు అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ఉన్నవారే ఆకర్షణీయమైన డీల్స్ అందుకోవచ్చు. అయితే, అమెజాన్ ప్రైమ్ డే 2025 ల్యాప్‌టాప్ డీల్స్ ఎలా పొందాలంటే..?
ఆసుస్ వివోబుక్ 15 :
అమెజాన్ డీల్‌లో ఈ ల్యాప్‌టాప్ అసలు ధర రూ.85,990కి నుంచి రూ.56,990కి తగ్గింది. ఈ ల్యాప్‌టాప్ 13వ జనరేషన్ ఇంటెల్ కోర్ i7 ప్రాసెసర్ అద్భుతంగా ఉంటుంది. అంతేకాదు.. ఇంటెల్ UHD iGPU, 16GB ర్యామ్, 512GB SSD స్టోరేజ్ కూడా ఉంది. 15.6-అంగుళాల డిస్‌ప్లేతో పాటు 60Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది.
HP ఒమెన్ :
HP స్మార్ట్‌చాయిస్ ఒమెన్ ల్యాప్‌టాప్ అసలు ధర కన్నా 25 శాతం తగ్గింపుతో లభిస్తోంది. ఈ ల్యాప్‌టాప్ రూ.1,02,990 ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ ల్యాప్‌టాప్‌లో రైజెన్ 7 7840H ప్రాసెసర్, 8GB RTX 4060 గ్రాఫిక్స్ కార్డ్, 16GB DDR5 ర్యామ్, 1TB SSD, 165Hz రిఫ్రెష్ రేట్, విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్నాయి.
ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ :
ఈ సేల్‌లో ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ రూ.74,900 నుంచి రూ.56,990కు లభిస్తుంది. ఆపిల్ మ్యాక్ M1 ప్రాసెసర్, 13.3-అంగుళాల రెటినా డిస్‌ప్లే, 8GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్, ఫేస్‌టైమ్ HD కెమెరా, బ్యాక్‌లిట్ కీబోర్డ్, టచ్ ID వంటి మరిన్ని ఫీచర్లతో వస్తుంది.
లెనోవా ఐడియాప్యాడ్ స్లిమ్ 3 :
అమెజాన్ నుంచి లెనోవా ఐడియాప్యాడ్ స్లిమ్ 3 ల్యాప్‌టాప్ రూ.61,990 ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ లెనోవా ల్యాప్‌టాప్ అసలు ధర రూ.89,300 ఉండగా 31శాతం డిస్కౌంట్ పొందింది. ఈ ల్యాప్‌టాప్ 13వ జనరేషన్ ఇంటెల్ i7 ప్రాసెసర్‌తో 16GB ర్యామ్, 512GB SSD స్టోరేజ్‌తో వస్తుంది. విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. 300 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 15.3-అంగుళాల FHD యాంటీ-గ్లేర్ డిస్‌ప్లేను కలిగి ఉంది.