Apple MacBook Pro M6 : పండగ చేస్కోండి.. ఆపిల్ కొత్త M6 మ్యాక్‌బుక్ ప్రో, ఐమ్యాక్ వచ్చేశాయ్.. ప్రీ-ఆర్డర్ ఎప్పటి నుంచంటే?

Apple MacBook Pro M6 : ఆపిల్ భారత్‌లో కొత్త M6 మ్యాక్‌బుక్ ప్రో, ఐమ్యాక్‌లను లాంచ్ చేసింది. ధరలు, ఫీచర్లు, బ్యాటరీ లైఫ్, ప్రీ-ఆర్డర్ తేదీలు, సేల్ వివరాలివే..

Apple MacBook Pro M6

  • ఆపిల్ నుంచి కొత్త మ్యాక్‌బుక్ ప్రో, ఐమ్యాక్.. ఫీచర్లు అదుర్స్
  • రూ. 1.74 లక్షల నుంచి కొత్త ఐమ్యాక్.. M6 మ్యాక్‌బుక్ ప్రో ధర ఎంతంటే?
  • ఆపిల్ కొత్త M6 మ్యాక్ వచ్చేశాయ్.. ప్రీ-ఆర్డర్ ఎప్పటి నుంచంటే?

Apple 14-inch MacBook Pro : ఆపిల్ అభిమానులకు గుడ్ న్యూస్.. టెక్ దిగ్గజం ఆపిల్ భారత మార్కెట్‌లో 2 కొత్త మ్యాక్ ప్రొడక్టులను అందిస్తోంది. కొత్త M6 చిప్‌తో 14 అంగుళాల మ్యాక్‌బుక్ ప్రో, ఐమ్యాక్‌ను లాంచ్ చేసింది. మెరుగైన పర్ఫార్మెన్స్, ఫాస్ట్ ఏఐ ఫీచర్లు, ఆకట్టుకునే డిజైన్‌తో ఈ కొత్త డివైజ్‌లు టెక్ ప్రియులను అత్యంతగా ఆకర్షిస్తున్నాయి..

ఆపిల్ మ్యాక్‌బుక్ ప్రో M6 ధర ఎంతంటే? :
భారత్‌లో కొత్త 14 అంగుళాల మ్యాక్‌బుక్ ప్రో ప్రారంభ ధర రూ. 2,39,900గా ఉంది. విద్యార్థులకు అందించే ప్రత్యేక ధరతో రూ. 2,27,900కు కొనుగోలు చేయవచ్చు. స్పేస్ బ్లాక్, సిల్వర్ కలర్ ఆప్షన్లలో ఈ ల్యాప్‌టాప్ అందుబాటులో ఉంటుంది.

ఇందులో 12-కోర్ సీపీయూ, 12-కోర్ జీపీయూతో M6 చిప్‌ను అందించారు. గత M5 చిప్‌తో పోలిస్తే.. గ్రాఫిక్స్ పర్ఫార్మెన్స్ 30 శాతం వరకు, ఏఐ పర్ఫార్మెన్స్ 25 శాతం వరకు మెరుగ్గా ఉంటుందని ఆపిల్ చెబుతోంది. 14 అంగుళాల లిక్విడ్ రెటినా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లే, 24 గంటల వరకు బ్యాటరీ లైఫ్, వై-ఫై7, బ్లూటూత్ 6 వంటి ఫీచర్లు ఉన్నాయి. ఫాస్ట్ ఛార్జింగ్ చేసుకునే సదుపాయం కూడా ఉంది.

Read Also : Flipkart Big Bang Diwali Sale : ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్.. ఐఫోన్ 17, శాంసంగ్ గెలాక్సీ S25 ఫోన్లపై దిమ్మతిరిగే డిస్కౌంట్లు.. ఎలా కొనాలంటే?

కొత్త iMac ధరలు, ఫీచర్లు :
కొత్త M6 ఐమ్యాక్ 2 వేరియంట్లలో వస్తుంది. 10-కోర్ సీపీయూ, 10-కోర్ జీపీయూ మోడల్ ధర రూ. 1,74,900 నుంచి ప్రారంభమవుతుంది. 12-కోర్ సీపీయూ, 12-కోర్ జీపీయూ వేరియంట్ ధర రూ. 1,99,900గా ఉంది.

ఈ ఐమ్యాక్‌లో 24 అంగుళాల 4.5K రెటినా డిస్‌ప్లే, 12MP కెమెరా, ఆరు స్పీకర్ల సౌండ్ సిస్టమ్ ఉన్నాయి. బ్లూ, గ్రీన్, పింక్, ఎల్లో, పర్పుల్, ఆరెంజ్, సిల్వర్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. Wi-Fi 7, బ్లూటూత్ 6 సపోర్ట్‌తో పాటు 2 ఎక్స్‌ట్రనల్ 6K డిస్‌ప్లే కనెక్ట్ చేసుకునే సదుపాయం కూడా ఉంది.

ఎప్పటి నుంచి కొనొచ్చు? :
ఈ రెండు కొత్త మ్యాక్ ప్రొడక్టులను అక్టోబర్ 28 నుంచి ప్రీ-ఆర్డర్ చేసుకోవచ్చు. నవంబర్ 6 నుంచి సేల్స్ ప్రారంభం కానున్నాయి. కొత్త చిప్, గ్రాఫిక్స్, ఏఐ ఫీచర్లతో ఈ డివైజ్‌లు ప్రొఫెషనల్స్‌తో పాటు రోజువారీ టాస్కులకు అద్భుతంగా ఉంటాయి.