Apple AirPods Pro 2
Apple AirPods Pro 2 : ఆపిల్ లవర్స్ పండగ చేస్కోండి.. దీపావళి పండగ సీజన్‌లో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ అనేక ప్రొడక్టులపై అద్భుతమైన డీల్స్, మరెన్నో డిస్కౌంట్లను అందిస్తున్నాయి. అందులో ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికే స్మార్ట్‌ఫోన్‌లు, ఇయర్‌ఫోన్‌లు, ఇతర గాడ్జెట్‌లపై భారీగా తగ్గింపు ధరకే ఆఫర్ చేస్తోంది.
మీరు ఇప్పుడు, ఆపిల్ ఎయిర్‌పాడ్ కోసం (Apple AirPods Pro 2) చూస్తుంటే ఇదే బెస్ట్ టైమ్. ఫ్లిప్‌కార్ట్ ఆపిల్ ఎయిర్ పాడ్స్ ప్రో 2 అతి తక్కువ ధరకే అందిస్తోంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ క్రేజీ డీల్ వెంటనే సొంతం చేసుకోండి.
ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఎయిర్‌పాడ్స్ ప్రో 2 డీల్ :
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ నుంచి ఆపిల్ ఎయిర్‌పాడ్స్ ప్రో 2 రూ. 16,490కి కొనుగోలు చేయవచ్చు. అసలు లాంచ్ ధర రూ. 26,900 నుంచి తగ్గింపు ధరకే పొందవచ్చు. అయినప్పటికీ, హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్ హోల్డర్లు రూ. 1250 అదనపు డిస్కౌంట్ తగ్గింపును పొందవచ్చు. మీరు హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్ తీసుకుంటే ఆపిల్ ఎయిర్‌పాడ్స్ ప్రో 2 డివైజ్ ధర రూ. 15,240కి తగ్గుతుంది. హెచ్‌డీఎఫ్‌సీ నెట్‌బ్యాంకింగ్‌తో పేమెంట్ చేస్తే అదనంగా రూ. 200 తగ్గింపు పొందవచ్చు.
ఆపిల్ ఎయిర్‌పాడ్స్ ప్రో 2 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఆపిల్ ఎయిర్‌పాడ్స్ ప్రో 2 ఆపిల్ H2 చిప్‌తో వస్తుంది. హై బాస్‌ను అందిస్తుంది. అన్ని ఇతర ఫీచర్లకు సపోర్టు ఇస్తుంది. ఈ బడ్స్ అడాప్టివ్ ట్రాన్స్‌పరెన్సీ, స్పేషియల్ ఆడియోను కూడా అందిస్తాయి. మ్యూజిక్ వినేందుకు వీలుగా ఉంటుంది.
డిజైన్ విషయానికొస్తే.. ఎర్గోనామిక్‌గా ఉంటాయి. ఎక్కువసేపు బడ్స్ పెట్టుకున్న తర్వాత కూడా మీ చెవులకు ఎలాంటి ఇబ్బంది కలిగించవు. యూ1 చిప్‌సెట్‌తో ఫైండ్ మై అలర్ట్ ఫీచర్ల కోసం ఇంటర్నల్ స్పీకర్‌ను కూడా కలిగి ఉంటాయి. పవర్‌ఫుల్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) మోడ్‌తో వస్తాయి.